Bigg Boss 9 Telugu Sanjana: ఈ సీజన్ బిగ్ బాస్(Bigg Boss 9 Telugu) షో మొదటి ఎపిసోడ్ నుండే పైకి లేవడానికి కారణమైన కంటెస్టెంట్స్ లో ఒకరు సంజన. ఆమె మొదటి వారం లో గుడ్డు దొంగతనం చేయడం హౌస్ లో ఎలాంటి ప్రకంపనలు రేపిందో మనమంతా చూసాము. సుమారుగా రెండు వారాల పాటు హౌస్ లో ఈ గుడ్డు దొంగతనం గురించి నామినేషన్స్ జరిగాయి అంటేనే అర్థం చేసుకోవచ్చు, ఆమె ఏ రేంజ్ కంటెంట్ ఇచ్చింది అనేది. కానీ బిగ్ బాస్ ఆమెని కన్ఫెషన్ రూమ్ కి పిలిచి అభినందించడం తో సరైన కంటెంట్ జనాల్లోకి వెళ్తుందేమో అని సంజన మైండ్ లో బలంగా ఫిక్స్ అయిపోయింది. ఇది నా చిలిపితనం, చిన్నప్పటి నుండి నేను ఇలాగే ఉన్నాను అని వీకెండ్స్ ఎపిసోడ్స్ లో నాగార్జున తో చెప్పుకొచ్చింది సంజన. కానీ ఈ చిలిపితనం రోజు రోజుకి శాడిజం లాగా మారిపోతుంది.
ముఖ్యంగా తినే ఆహారం విషయం లో సంజన చేస్తున్న ఈ దొంగ పనులు హౌస్ లో ఉన్న ప్రతీ ఒక్కరికి చిరాకు కలిగించేలా చేస్తోంది. ఒక ఫుడ్ మానిటర్ గా ఉంటూ నిన్న ఆమె హౌస్ లోని కంటెస్టెంట్స్ అందరికి సంబంధించిన గుడ్లను దొంగతనం చేసి, స్టోర్ రూమ్ లోకి వెళ్లి తినడం సంచలనం గా మారింది. ముందు గా ఆమె ఫ్లోరా తో ఈ విషయం చెప్తుంది. స్టోర్ రూమ్ లోకి వెళ్లి అందరి గుడ్లను తినేద్దాం పదా, హౌస్ మొత్తం ఊగిపోతాది, మంచి కంటెంట్ వస్తుంది అని అంటుంది. అప్పుడు ఫ్లోరా నేను అలాంటి పనులు చెయ్యను నన్ను ఇందులో లాగకండి అని అంటుంది. అప్పుడు సంజన ఒక్కటే స్టోర్ రూమ్ లోకి వెళ్లి హౌస్ మేట్స్ అందరి గుడ్లను తినేస్తుంది, కేవలం మూడు గుడ్లను మాత్రమే మిగిలిస్తుంది. ఇది ఎంత అన్యాయమైన పనో ఆమె అభిమానులు కూడా ఒకసారి ఆలోచించాలి.
హౌస్ మేట్స్ అందరూ శరీరం హూనం అయ్యే విధంగా టాస్కులు ఆడుతూ ఉంటారు. వాళ్లకు బోలెడంత ప్రోటీన్ అవసరం ఉంటుంది. అందుకే గుడ్ల కోసం వాళ్ళు అంత ఆతృతగా ఎదురు చూస్తూ ఉంటారు. అలాంటి ఆహారాన్ని వాళ్ళ నోటి దాకా వెళ్లకుండా చేయడం ఎంతవరకు సమంజసం?, ఇది చిలిపితనం గా చూడాలా? అని సోషల్ మీడియా లో అభిమానులు ప్రశ్నిస్తున్నారు. ఇది చిలిపితనం కాదు, శాడిజం అనేది స్పష్టంగా అర్థం అవుతుంది. ఈ వ్యవహారం పై ఈ వీకెండ్ లో నాగార్జున కామెడీ గా కాకుండా, సీరియస్ గా సంజన కి వార్నింగ్ ఇవ్వాలి. లేదంటే ఈమె కంటెంట్ కోసం ఏది తప్పు, ఏది ఒప్పు అనేది అర్థం చేసుకోకుండా ఇంకా దారుణమైన పనులు భవిష్యత్తులో చేయొచ్చు. కాబట్టి ఈమెని కంట్రోల్ లో పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది అంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు.