Bigg Boss 9 Telugu Promo: బుల్లితెర అభిమానులు ఎప్పుడెప్పుడా అని వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్న ‘బిగ్ బాస్ 9′(Bigg Boss 9 Telugu) రియాలిటీ షో ప్రసారం అయ్యే సమయం వచ్చేసింది. ప్రతీ సీజన్ కి ప్రోమో ఆగష్టు నెలలో రావడం మనమంతా చూసాము. కానీ ఈసారి మాత్రం జూన్ నెలలోనే వదిలేశారు. నిన్న సాయంత్రం విడుదలైన ‘బిగ్ బాస్ 9’ ప్రోమో కి ఆడియన్స్ నుండి సెన్సేషనల్ రెస్పాన్స్ వచ్చింది. ఈ ప్రోమో లో నాగార్జున(Akkineni Nagarjuna) ‘కూలీ’ మూవీ లోని తన స్వాగ్ ని ఇమిటేట్ చేయడం హైలైట్ గా నిల్చింది. ఇక ప్రోమో విశ్లేషణ విషయానికి వస్తే ఒక భారీ వజ్రం ఉంటుంది. నాగార్జున చేతిలో బిగ్ బాస్ 8 సీజన్స్ కి సంబంధించిన గద ఉంటుంది. ఆ గదని పట్టుకొని నడుస్తూ వస్తూ ‘ఆటలో అలుపు వచ్చినంత సులువు గా గెలుపు రాదు. ఆ గెలుపు రావాలంటే యుద్ధం చేస్తే సరిపోదు..కొన్ని సార్లు ప్రభంజనం సృష్టించాలి’ అని తన చేతిలో ఉన్న గదని ని వజ్రం వైపు విసురుతాడు.
Also Read: గంభీర్ వచ్చిన తర్వాత.. టీమిండియా చెత్తగా, చిత్తుగా.. ఇలాంటి దారుణం మరే జట్టుకు లేదు భయ్యా!
ఆ వజ్రం ముక్కలై ‘బిగ్ బాస్ 9’ లోగో లాగ తయారు అవుతుంది. ఆ తర్వాత ‘ఈసారి చదరంగం కాదు..ప్రభంజనమే’ అని అంటాడు నాగార్జున. సీజన్ 7 నుండి బిగ్ బాస్ టీం లోగో విషయం లో ఎదో ఒక కాన్సెప్ట్ ని ఎంచుకుంటూ ముందుకు వస్తున్నారు. సీజన్ 7 లో ‘ఉల్టా పల్టా’ కాన్సెప్ట్ ని తీసుకొచ్చారు, సీజన్ 8 లో ఇన్ఫినిటీ (అనంతం) కాన్సెప్ట్ ని తీసుకొచ్చారు. ఇప్పుడు సీజన్ 9 కి ప్రభంజనం అనే కాన్సెప్ట్ ని తీసుకొచ్చారు. ఏంటి ఈ ప్రభంజనం కాన్సెప్ట్?, లోగో లో ఎందుకు వజ్రాలు పెట్టారు అనేది ఇప్పుడు ఆసక్తికరమైన చర్చ గా మారింది. అందుతున్న సమాచారం ప్రకారం ఈ సీజన్ లో కంటెస్టెంట్స్ విషయం లో స్టార్ మా టీం ఎంతో జాగ్రత్తగా వ్యవహరిస్తుందట.
ఎక్కడా కూడా తగ్గకుండా అన్ని సీజన్స్ లోకి ‘ది బెస్ట్’ అనిపించేలా ప్లాన్ చేసుకుంటున్నారట. ఈ సీజన్ లో పాల్గొనే కంటెస్టెంట్స్ వజ్రాలను సైతం కొయ్యగల సమర్థులని అర్థం వచ్చేలా ఈ ప్రోమో ఉన్నట్టు కొంతమంది కామెంట్స్ చేస్తున్నారు. మరి కొంతమంది అయితే 8 సీజన్స్ అయ్యాయి కదా, నవరత్నాలు కాన్సెప్ట్ వచ్చేలా ఆ వజ్రాన్ని పెట్టినట్టుగా కూడా చెప్తున్నారు. ఇందులో ఎంతవరకు నిజం ఉందో చూడాలి. ఇకపోతే ఈ సీజన్ లో కంటెస్టెంట్స్ గా ఎవరెవరు పాల్గొనబోతున్నారు అనే దానిపై ఇప్పటికే చాలా మందికి కొంత క్లారిటీ వచ్చింది. ‘కిరాక్ బాయ్స్..కిరాక్ గర్ల్స్’, అదే విధంగా ‘కూకూ..జాతిరత్నాలు’ ప్రోగ్రామ్స్ నుండి కొంతమంది కంటెస్టెంట్స్ ని ఎంచుకున్నట్టు తెలుస్తుంది. అదే విధంగా పాత సీజన్ కంటెస్టెంట్స్ కూడా ఈ సీజన్ లో పాల్గొనబోతున్నారు . కానీ అందరూ గ్రాండ్ లాంచ్ ఎపిసోడ్ లోనే ఎంట్రీ ఇస్తారట, వైల్డ్ కార్డు ఎంట్రీలు ఈ సీజన్ లో ఉండవు.
