Bigg Boss 9 Telugu: బిగ్ బాస్(Bigg Boss 9 Telugu) షో లో పాల్గొనడం ఒక అదృష్టం లాంటిది. సినీ సెలబ్రిటీలకు చాలా తేలికగా ఈ రియాలిటీ షోలోకి అడుగుపెట్టగలరు. కానీ సామాన్యులు అడుగుపెట్టడం చాలా కష్టం. అయితే తమ షో ని గత 8 సీజన్స్ నుండి బ్లాక్ బస్టర్ చేస్తూ వచ్చిన ఆడియన్స్ కి ఎదో ఒకటి చెయ్యాలి అనే ఉద్దేశ్యంతో ఈ సీజన్ లో సామాన్యులకు కూడా ఎంట్రీ ని కల్పించే ప్రయత్నం చేశారు. అందుకోసం అగ్నిపరీక్ష అనే షో ని నిర్వహించి కేవలం 13 మందిని ఎంచుకొని అందులో నుండి కేవలం ఆరు మంది సామాన్యులను మాత్రమే హౌస్ లోకి పంపారు. అందులో మనీష్ రెండవ వారమే హౌస్ నుండి బయటకు వచేసాడు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ కూడా బయటకు వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. అగ్నిపరీక్ష షో లో పవన్ కళ్యాణ్ తోపు కంటెస్టెంట్.
ఆయనకు ఓటింగ్ కూడా టాప్ 1 స్థాయిలో పడేది. ఎందుకంటే అగ్నిపరీక్ష షో లో టాస్కులన్నీ అద్భుతంగా ఆడేవాడు. దానికి తోడు ఆర్మీ బ్యాక్ గ్రౌండ్ నుండి వచ్చిన వ్యక్తి కావడం తో ఆడియన్స్ ఇతనికి ఓట్లు గుద్ది లోపలకు పంపారు. కానీ ఇప్పటి వరకు ఈయన ఆడియన్స్ కి ఎలాంటి ఎంటర్టైన్మెంట్ ఇవ్వలేదు. ఆయన ఇప్పటి వరకు చేసింది ఏమిటంటే హౌస్ లో ఏడ్చే అమ్మాయిలను గట్టిగా హత్తుకొని ఏడవడమే. మొన్ననే రీతూ చౌదరి వెక్కి వెక్కి ఏడుస్తుంటే ఆమెని గట్టిగా కౌగలించుకొని ఓదార్చాడు. రీతూ చౌదరి ఏడవడమే పెద్ద నాటకం అంటుంటే, ఆమె కన్నీళ్లు తుడుస్తున్నట్టు ఈయన యాక్టింగ్ చేయడం ఇంకా రోతగా అనిపించింది. కేవలం రీతూ చౌదరి విషయం లోనే కాదు, ప్రియా,తనూజ మరియు ఇతర లేడీ కంటెస్టెంట్స్ ఏడుస్తున్నప్పుడు ఇలాగే చేసాడు. ఇది కేవలం ఆడవాళ్లకు మాత్రమే, మగవాళ్ళు ఏడుస్తున్నప్పుడు మనోడు అసలు పట్టించుకోడు.
మొదటి వారం కెప్టెన్సీ టాస్క్ లో ఓడిపోయినప్పుడు ఇమ్మానుయేల్ దగ్గరకు వెళ్లి ఓదార్చే ప్రయత్నం చేస్తే అతన్ని దూరం పెట్టినప్పటి నుండే పవన్ కళ్యాణ్ పై జనాల్లో ఉన్న అభిప్రాయం మారిపోయింది. అప్పటి నుండి ఇప్పటి వరకు ఆయన అద్భుతమైన పెర్ఫార్మన్స్ ఇచ్చిన ఒక్క టాస్క్ కూడా లేదు. తనూజ తో ఎదో ఒక ట్రాక్ నడుపుదామని తెగ ప్రయత్నం చేస్తున్నాడు కానీ వర్కౌట్ అవ్వడం లేదు. నిన్న కూడా ప్రియా తో పులిహోర కలిపే ప్రయత్నం చేసాడు. కానీ ఆమె అందుకు నిరాకరించింది. ఎవరో పిలుస్తున్నారని చెప్పి వెళ్ళిపోయింది. ఇలా బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెట్టిన రోజు నుండి కళ్యాణ్ ఆడవాళ్లతోనే ఎక్కువ ఉంటున్నాడు, వాళ్ళతోనే పులిహోర కలుపుతున్నాడు. ఆర్మీ సెంటిమెంట్ తో ఈ వారం సేఫ్ అవ్వోచ్చేమో కానీ, ఇలాగే ఉంటే వచ్చే వారం ఎలిమినేట్ అవ్వక తప్పదు.