Bigg Boss 9 Telugu Midweek Elimination: ఈ సీజన్ బిగ్ బాస్(Bigg Boss 9 Telugu) షో టీఆర్ఫీ రేటింగ్స్ పరంగా బంపర్ హిట్ అని అనిపించుకుంది. ఏ సీజన్ లో లేని విధంగా ఈ సీజన్ లో కుటుంబ బంధాలు, ఎమోషన్స్ మధ్య సాగడం తో, ఫ్యామిలీ ఆడియన్స్ ఈ సీజన్ కి బ్రహ్మరథం పట్టారు. అప్పుడే 14వ వారం లోకి ఈ సీజన్ వచ్చేసిందా, అయ్యో ఇంకా కొన్ని వారాలు ఉంటే బాగుండేది, తనూజ, భరణి తండ్రి కూతుళ్ళ క్యూట్ రిలేషన్ , అదే విధంగా తనూజ, కళ్యాణ్ స్నేహం, ఇమ్మానుయేల్, సంజన తల్లీకొడుకుల బంధం, ఇలా ఎన్నో రిలేషన్స్ ని ఇంకో రెండు వారాల తర్వాత చూడలేము అనే బాధ ఆడియన్స్ లో కలుగుతోంది. అంతటి బ్లాక్ బస్టర్ హిట్ గా నిల్చింది ఈ సీజన్. ఇకపోతే ఈ వారం పవన్ కళ్యాణ్ మినహా, మిగిలిన ఆరు మంది కంటెస్టెంట్స్ నామినేషన్స్ లోకి వచ్చారు.
ఫినాలే వీక్ కి కచ్చితంగా టాప్ 5 మాత్రమే మిగులుతారు కాబట్టి, ఇద్దరు డబుల్ ఎలిమినేషన్ ద్వారా ఈ వీక్ లో ఎలిమినేట్ అవుతారు అన్నది ఊహించిందే. అందుతున్న విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం, గురువారం రోజున మిడ్ వీక్ ఎలిమినేషన్ ని ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. అయితే ఇది ఆడియన్స్ ఓటింగ్ ద్వారా జరగబోయే ఎలిమినేషనా?, లేదంటే ఈ వారం జరుగుతున్నా ఇమ్మ్యూనిటీ టాస్కుల ఆధారంగా జరుగుతున్నా ఎలిమినేషనా? అనేది తెలియాల్సింది. ఇమ్మ్యూనిటి టాస్కులలో అయితే సంజన ఇప్పటికే అవుట్ అయ్యినట్టు సమాచారం. అంటే ఒకవేళ టాస్కుల ద్వారా ఎలిమినేషన్ ని ప్లాన్ చేస్తే, సంజన గురువారం రోజున ఎలిమినేట్ అయ్యేందుకు ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. ఒకవేళ ఆడియన్స్ ఓటింగ్ ద్వారా ఎలిమినేషన్ పెడితే సుమన్ శెట్టి ఎలిమినేట్ అవుతాడు. ఈ రెండిట్లో ఏది జరగబోతుంది అనే దానిపై ప్రస్తుతానికి క్లారిటీ లేదు కానీ, మిడ్ వీక్ ఎలిమినేషన్ మాత్రం కచ్చితంగా ఉండబోతుంది అనేది వాస్తవం.
ఇక ఇమ్మ్యూనిటీ టాస్కుల లైవ్ అప్డేట్స్ విషయానికి వస్తే, నిన్నటి ఎపిసోడ్ లో ఇమ్మానుయేల్ మరియు డిమోన్ పవన్ టాప్ 2 పాయింట్స్ తో నిలిచారు. వీరిలో ఇమ్మానుయేల్ కి ఆడియన్స్ ని ఓటు అప్పీల్ చేసుకునే అవకాశం దక్కింది. ఇక ఈరోజు టెలికాస్ట్ అవ్వబోయే ఎపిసోడ్ తనూజ మరియు భరణి అభిమానులకు పండుగ లాగా ఉండబోతుంది అట. బాల్స్ టాస్క్ ని బిగ్ బాస్ నిర్వహించగా, తనూజ టాప్ 1 , అదే విధంగా భరణి టాప్ 2 గా నిలిచారట. ఆ తర్వాత జరిగిన పజిల్ టాస్క్ లో భరణి గెలిచి టాప్ 1 స్థానాన్ని కైవసం చేసుకోగా, తనూజ టాప్ 2 స్థానాన్ని కైవసం చేసుకుంది. వీళ్లిద్దరికీ ఆడియన్స్ ప్రశ్నలను ఎదురుకునే అవకాశం వచ్చింది. వీరిలో తనూజ కి ఎక్కువ ఓట్లు రావడం తో, ఆమెకు ఓటు అప్పీల్ చేసుకునే అవకాశం దక్కినట్టు తెలుస్తోంది.