Bigg Boss 9 Telugu Grand Finale TRP Ratings: గడిచిన నాలుగైదు తెలుగు బిగ్ బాస్ సీజన్స్ కంటే , ఈ సీజన్(Bigg Boss 9 Telugu) కి ఆడియన్స్ నుండి ఎలాంటి సెన్సేషనల్ రెస్పాన్స్ వచ్చిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఏ సీజన్ కి లేని విధంగా ఈ సీజన్ ని ఫ్యామిలీ ఆడియన్స్ నెత్తిన పెట్టుకొని మరీ ఆదరించడం తో ప్రతీ వారం ఈ యావరేజ్ గా 12 టీఆర్ఫీ రేటింగ్స్ నమోదు అయ్యేవి. గత సీజన్ కి కనీసం యావరేజ్ గా మూడు టీఆర్ఫీ రేటింగ్స్ వచ్చిన దాఖలాలు కూడా లేవు. ఇకపోతే రీసెంట్ గానే గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్ ముగిసింది. ప్రతీ సీజన్ లో విన్నర్ ఎవరో షో ముగిసే నాలుగైదు వారాలకే స్పష్టంగా తెలిసిపోయేది. కానీ ఈ సీజన్ లో మాత్రం చివరి వరకు ఎవరు విన్నర్ గా నిలుస్తారు అనే దానిపై క్లారిటీ రాలేదు.
దాంతో ఎవరు గెలుస్తారు అనే క్యూరియాసిటీ ప్రతీ ఒక్కరిలోనూ ఉండేది. అందుకే ఫినాలే ఎపిసోడ్ కి సెన్సేషనల్ టీఆర్ఫీ రేటింగ్స్ వచ్చాయి. దీని గురించి నాగార్జున నిన్న ట్విట్టర్ లో ఒక ట్వీట్ వేస్తూ, ఫినాలే ఎపిసోడ్ కి 19.6 టీఆర్ఫీ రేటింగ్స్ స్టార్ మా ఛానల్ లో వచ్చిందని చెప్పుకొచ్చాడు నాగార్జున. అదే విధంగా జియో హాట్ స్టార్ లో ఈ ఎపిసోడ్ కి 285 మిలియన్ వాచ్ మినిట్స్ వచ్చాయట. గడిచిన 5 సీజన్స్ లో ఈ రేంజ్ టీఆర్ఫీ రేటింగ్స్ రాలేదని, ఎమోషన్స్ , గొడవలు, మర్చిపోలేని తీపి జ్ఞాపకాల మధ్య సాగిన ఈ సీజన్ ని ఇంత పెద్ద హిట్ చేసిన ఆడియన్స్ కి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. బిగ్ బాస్ సీజన్ 9 ఒక హిస్టరీ అంటూ చెప్పుకొచ్చాడు నాగార్జున. ఈ సీజన్ ఇంతపెద్ద హిట్ అవుతుందని బహుశా నాగార్జున మరియు బిగ్ బాస్ టీం కూడా ఊహించి ఉండదు.

అన్ని అలా కలిసొచ్చేశాయ్. ఇక ఈ సీజన్ టైటిల్ విన్నర్, మరియు టాప్ 3 కంటెస్టెంట్ గా కామనర్స్ రావడం తో ఈ ఏడాది అగ్నిపరీక్ష సీజన్ 2 ని కనీవినీ ఎరుగని రేంజ్ లో నిర్వహించబోతున్నారు. ఈ రెండవ సీజన్ లో మొదటి అగ్నిపరీక్ష సీజన్ కి సంబంధించిన వాళ్ళు కూడా కొంతమంది హాజరు అవుతారట. వాళ్ళు అతిధులుగా వస్తారో , లేదా కంటెస్టెంట్స్ గా వస్తారో చూడాలి. ఇది ఇలా ఉంటే కనీసం ఈ ఏడాది అయినా నాన్ స్టాప్ ఓటీటీ సీజన్ ఉంటుందా లేదా అనేది ఇప్పుడు ప్రేక్షకుల నుండి ఎదురు అవుతున్న ప్రశ్న.