Bigg Boss 9 Telugu Emmanuel: ఈ సీజన్ బిగ్ బాస్(Bigg Boss 9 Telugu) టైటిల్ కి అన్ని విధాలుగా అర్హతలు ఉన్న కంటెస్టెంట్స్ లిస్ట్ తీస్తే అందులో ఇమ్మానుయేల్ కచ్చితంగా ఉంటాడు. టాస్కులు ఆడడం లో కానీ, ఎంటర్టైన్మెంట్ ని అందించడంలో కానీ, ఇమ్మానుయేల్ కి సాటి మరెవ్వరూ రారు అనేంతలా ఈ సీజన్ లో ఆయన అద్భుతమైన పెర్ఫార్మన్స్ ని చూపించాడు. ఎంటెర్టైనెర్స్ కి కప్పు కొట్టేంత సీన్ లేదని అందరూ అంటుంటారు. గత సీజన్ లో అవినాష్ కూడా ఆడియన్స్ ఓట్లతో టాప్ 5 వరకు రాలేదు. ఒకసారి నబీల్ తన దగ్గరున్న ఏవిక్షన్ ఫ్రీ పాస్ ని ఉపయోగించి అవినాష్ ని సేవ్ చేస్తాడు, మరోసారి టాస్కులు ఆడి, టికెట్ టు ఫినాలే సంపాదించుకొని టాప్ 5 లోకి వెళ్తాడు. కానీ ఇమ్మానుయేల్ కి ఆడియన్స్ ఓట్ల బలం ఒక రేంజ్ లో ఉంది.
సాధారణంగా ఒక కంటెస్టెంట్ వరుసగా 10 వారాలు నామినేషన్స్ లోకి రాకుండా, ఒక్క వారం నామినేషన్ లోకి వస్తే ఎలిమినేట్ అయిపోతుంటారు. సీజన్ 7 లో సందీప్ మాస్టర్ అద్భుతంగా గేమ్ ఆడుతూ వస్తున్నప్పటికీ, తొలి ఆరు వారాలు నామినేషన్స్ లోకి రాకపోవడం ఆయనకు చాలా పెద్ద ఎఫెక్ట్ ఇచ్చింది. 7వ వారం నామినేషన్ లోకి రాగానే ఎలిమినేట్ అయిపోయాడు. ఇమ్మానుయేల్ పరిస్థితి కూడా అదే అని అంతా అనుకున్నారు. ఈ వారం నామినేషన్ లోకి వచ్చాడు, కచ్చితంగా డేంజర్ జోన్ లో పడిపోతాడని ఊహించారు. కానీ ఎవ్వరి ఊహలకు అందని విధంగా ఇమ్మానుయేల్ కి కనీవినీ ఎరుగని రేంజ్ ఓటింగ్ పడుతోందని సోషల్ విశ్వసనీయ వర్గాల నుండి అందుతున్న సమాచారం. అంతే కాదు సోషల్ మీడియా లో కూడా ఆయన దాదాపుగా అన్ని పోల్స్ లోనూ రెండు లేదా మూడవ స్థానాల్లో కొనసాగుతున్నాడు. ఇది సాధారణమైన విషయం కాదు.
దానికి తోడు తనూజ లాంటి భారీ ఓటింగ్ ఉన్న కంటెస్టెంట్ నామినేషన్స్ లోకి లేకపోవడం కూడా ఇమ్మానుయేల్ కి కలిసొచ్చింది అని చెప్పొచ్చు. తనూజ ఫ్యాన్స్ తనూజ కి ఎవరైతే క్లోజ్ గా ఉంటారో, వాళ్లకు ఓట్లు వేస్తారు. మొదట్లో తనూజ,ఇమ్మానుయేల్ చాలా క్లోజ్ గా ఉండేవాళ్ళు. వీళ్లిద్దరి కాంబినేషన్ లో వచ్చే కామెడీ ని ఇష్టపడని వాళ్లంటూ ఎవ్వరూ ఉండరు. అందుకే తనూజ ఫ్యాన్స్ ఓట్లు కొంత భాగం ఇమ్మానుయేల్ కి పడొచ్చు. ఇక ఆ తర్వాత తనూజ ఫ్యాన్స్ ఓట్లు భరణి కి పడుతున్నాయి. వీళ్లిద్దరు ప్రస్తుతానికి పెద్దగా మాట్లాడుకోవట్లేదు, కానీ ఒకరంటే ఒకరికి చాలా ప్రేమ. అనేక సందర్భాల్లో ఆ ప్రేమ బయటపడిన క్షణాలు ఉన్నాయి. కాబట్టి అత్యధిక శాతం ఓట్లు భరణి కి పడుతున్నాయి, కొంతభాగం మాత్రం ఇమ్మానుయేల్ కి పడుతున్నాయి. ఓవరాల్ గా 10 వారాలు నామినేషన్స్ లోకి రాకుండా 11 వ వారం నామినేషన్స్ లోకి వచ్చినప్పటికీ సేవ్ అయిన ఏకైక కంటెస్టెంట్ గా బిగ్ బాస్ హిస్టరీ లో ఇమ్మానుయేల్ సరికొత్త చరిత్ర సృష్టించాడు.