Bigg Boss Telugu, Bharani బండ్లు ఓడలు అవుతాయి, ఓడలు బండ్లు అవుతాయి అని పెద్దలు ఊరికే అనరు. వాళ్ళకు తమ జీవితం లో ఎదురైనా అనుభవాల నుండే ఇలాంటివి చెప్తుంటారు. ఇటీవల కాలంలో ఎన్నో ఉదాహరణలు కూడా ఉన్నాయి. బిగ్ బాస్ 9(Bigg Boss 9 Telugu) లో భరణి ని చూస్తే అలాగే అనిపిస్తోంది. హౌస్ లోకి అడుగుపెట్టిన కొత్తల్లో ఈయన ఆడియన్స్ కి ఎంతో స్ట్రాంగ్ గా అనిపించాడు. అంతే కాదు మొదటి నాలుగు వారాలు హౌస్ కి ఒక లీడర్ లాగా వ్యవహరించి, అన్నీ తానై ముందు నడిపించాడు. ముఖ్యంగా టెనెంట్స్ కి ఆయన అందించిన అభయ హస్తం మామూలుది కాదు. హౌస్ లో ఎలిమినేట్ అవ్వకముందు ఎప్పుడూ తన తోటి కంటెస్టెంట్స్ కి సహాయం చేయడమే కానీ, ఏ రోజు కూడా చెయ్యి చాచి సహాయం అడిగిన సందర్భమే లేదు. అలాంటి మంచి మనిషి గా పేరు తెచ్చుకున్న భరణి, రీ ఎంట్రీ తర్వాత బాగా వీక్ అయిపోయాడు.
కూతురు లాగ చూసుకున్న తనూజ ఇతనితో ఉంటే మనం కూడా నెగిటివ్ అయిపోతాం అని అనుకుందో ఏమో తెలియదు కానీ, భరణి ని పూర్తిగా దూరం పెట్టేసింది. అంతకు ముందు ఆడియన్స్ కి కూడా చిరాకు కలిగించే రేంజ్ నాన్న, నాన్న అంటూ ప్రేమ చూపించిన ఈమె, ఇప్పుడు భరణి సార్ అని పిలుస్తూ ముఖం చూసేందుకు కూడా ఇష్టం చూపించడం లేదు. పాపం నిన్న ఆయన పరిస్థితి చూస్తే చాలా దయనీయంగా అనిపించింది. ఎలిమినేషన్ రౌండ్ లో తానూ మరియు సాయి ఉన్నప్పుడు, భరణి తనూజ ని పక్కకి పిలిచి, ఒకవేళ నీకు అవకాశం వస్తే నన్ను ఎలిమినేషన్ నుండి సేవ్ చేస్తావా? అని అడుగుతాడు. అప్పుడు తనూజ ‘ఇప్పటికే నేను దానిని వేరే వాళ్లకు ఉపయోగిస్తాను అని మాట ఇచ్చేసాను’ అని అంటుంది.
అప్పుడు భరణి ‘నేను ఈ హౌస్ లో ఇప్పటి వరకు నిన్ను నోరు తెరిచి ఒక్క సహాయం కూడా అడగలేదు. దయచేసి ఈ ఒక్క సహాయం చెయ్యి’ అని అడుగుతాడు. అప్పుడు తనూజ ‘వేరే ఏ సహాయం అడిగినా కళ్ళు మూసుకొని చేసేదాన్ని, కానీ మాట ఇచ్చి ఉన్నాను కదా..నాకు తెలిసి మీరు ఎలిమినేట్ అవ్వరు. కానీ చూస్తాను, అప్పుడు పరిస్థితి ని బట్టి నా నిర్ణయం తీసుకుంటాను’ అంటూ చెప్పుకొచ్చింది. ఈమె భరణి తో ఇలా మాట్లాడడం ఆడియన్స్ కి అసలు ఏ మాత్రం కూడా నచ్చలేదు. ఎందుకంటే బెడ్ టాస్క్ లో భరణి ఈమె కోసం శ్రీజ నుండి ఒక వస్తువులాగా బెడ్ మీద నుండి విసిరి ఘోరమైన నెగిటివిటీ ని సంపాదించుకున్నాడు. హౌస్ లో ఉన్నన్ని రోజులు, ఇప్పటికీ ఆయన తనూజ కి సహాయం చేసుకుంటూ వస్తున్నాడు. అలాంటి వ్యక్తి నోరు తెరిచి అడగక్కర్లేదు, ఆపదలో ఉన్నప్పుడు ఆ సేవింగ్ పవర్ ఆయనకే తనూజ ఉపయోగించాలి. కానీ అడిగిన తర్వాత కూడా ఆమె సహాయం చేయడానికి నిరాకరించింది చూడు, ఇక్కడే తనూజ గ్రాఫ్ పాతాళం లోకి పడిపోయింది. నిన్నటి ఈ సంఘటన భరణి పై విపరీతమైన సానుభూతి పెంచేలా చేసింది. చూడాలి మరి రాబోయే రోజుల్లో అయినా భరణి కళ్ళు తెరిచి తన కోసం గేమ్ ఆడుకుంటాడా లేదా అనేది.
#Bharani garini chusthe jaali vesindhi..
Theesukovaalsindhi emyna untene untaayi #thanuja bonds, he is no more use for her #BiggBossTelugu9 pic.twitter.com/7Wbx7q83z4
— BigBoss Telugu Views (@BBTeluguViews) November 9, 2025