Bigg Boss 9 Telugu Bharani Remuneration: ‘బిగ్ బాస్ 9′(Bigg Boss 9 Telugu) టాప్ 5 కంటెస్టెంట్స్ లో ఒకరిగా అడుగుపెట్టడానికి కేవలం ఒక్క అడుగు దూరం లో ఉన్న కంటెస్టెంట్స్ లో ఒకరు భరణి. హౌస్ లోకి అడుగుపెట్టిన కొత్తల్లో ఈయన్ని తన తోటి హౌస్ మేట్స్ తో పాటు, ఆడియన్స్ కూడా విన్నర్ మెటీరియల్ అని అనుకునేవారు. ఎందుకంటే చాలా డైనమిక్ గా కనిపించడం, లీడర్ కి ఉండాల్సిన లక్షణాలు ఉండడం, తన తోటి హౌస్ మేట్స్ అందరూ ఈయన మాటలు వినడం వంటివి చూసి కచ్చితంగా ఇతను విన్నర్ అని అనుకున్నారు. సీజన్ ఆరంభం లో ఓటింగ్ కూడా టాప్ 3 రేంజ్ లో ఉండేది. కానీ ఎప్పుడైతే దివ్య హౌస్ లోకి అడుగుపెట్టిందో, అప్పటి నుండి భరణి గేమ్ మెల్లగా తగ్గుతూ వచ్చింది. ఆడియన్స్ కి ఆయన ఆట నచ్చలేదు. తనూజ, దివ్య మధ్యలో చాలా సేఫ్ గేమ్ ఆడుతున్నట్టుగా అనిపించింది.
బెడ్ టాస్క్ లో ఎప్పుడైతే ఆయన తనూజ ని కాపాడడం కోసం శ్రీజ ని అమానుషం గా క్రిందకు విసిరివేసాడో, అప్పటి నుండి ఆయనపై ఆడియన్స్ లో తీవ్రమైన వ్యతిరేకత మొదలైంది. ఫలితంగా తదుపరి వారం లో ఆయన నామినేషన్స్ లోకి రావడం, ఎలిమినేట్ అవ్వడం వంటివి జరిగింది. అయితే భరణి ఎలిమినేషన్ అప్పట్లో హౌస్ మేట్స్ కి పెద్ద షాక్. తనూజ, దివ్య లు ఏ రేంజ్ లో ఏడ్చారో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. వాళ్ళిద్దరి ఏడుపులు చూసి ఆడియన్స్ కూడా బాగా ఎమోషనల్ అయ్యారు. అయ్యో మంచివాడిని ఎలిమినేట్ చేశామే అనే బాధ ఆడియన్స్ లో కూడా కలిగింది. మళ్లీ రీ ఎంట్రీ అవకాశం ఉంటే భరణి కి ఇస్తే బాగుండును అని అంతా అనుకున్నారు, గట్టిగా కోరుకున్నారు కూడా. వాళ్ళ కోరికలు ఫలించాయి, ఎలిమినేట్ అయిన మరుసటి వారం లో మళ్లీ భరణి బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చాడు.
ఎంట్రీ ఇచ్చిన తర్వాత తన ఆట తీరుని బాగా మార్చుకున్నాడు. టాస్కులు ఆడాల్సిన సమయంలో తన వంతు నూటికి నూరు శాతం ఎఫోర్ట్స్ పెట్టాడు. ఆ క్రమంలోనే ఆయనకు తీవ్రమైన గాయాలు అయ్యాయి. అయినప్పటికీ కూడా పట్టు వీడకుండా ఆయన ఆడిన ఆట తీరుకి ఆడియన్స్ ఫిదా అయిపోయారు. ఫలితంగా రీ ఎంట్రీ తర్వాత ఆయన ప్రతీ వారం నామినేషన్స్ లోకి వస్తూనే ఉన్నాడు, సేవ్ అవుతూనే ఉన్నాడు, ఇప్పుడు టాప్ 5 లో ఆయన నిలబడడానికి అత్యధిక అవకాశాలు ఉన్నాయి. ఇదంతా పక్కన పెడితే భరణి హౌస్ లో అందరికంటే సీనియర్ మోస్ట్ ఆర్టిస్ట్, అంతే కాకుండా అందరికంటే మంచి పాపులారిటీ ఉన్న ఆర్టిస్ట్ కూడా. అందుకే ఆయనకు రెమ్యూనరేషన్ కూడా భారీగానే ఇస్తున్నారు. రోజుకి 45 వేలు అట. అంటే వారానికి 3 లక్షల 15 వేలు అన్నమాట. కేవలం ఒక్క వారం మాత్రమే ఆయన హౌస్ లో లేడు, ఒకవేళ ఆయన టాప్ 5 లోకి వెళ్తే 14 వారాలు హౌస్ లో ఉన్నట్టు, అంటే 44 లక్షల రూపాయిల రెమ్యూనరేషన్ అన్నమాట.