Bigg Boss 9 Telugu Bharani: ఈ బిగ్ బాస్(Bigg Boss 9 Telugu) సీజన్ లో కచ్చితంగా టాప్ 5 లోకి అడుగుపెట్టే సత్తా ఉన్న కంటెస్టెంట్స్ లో ఒకరు భరణి. అందులో ఎలాంటి సందేహం లేదు. టాస్కులు వచ్చినప్పుడు అద్భుతంగా ఆడడం, ఈ వయస్సు లో కూడా కుర్రాళ్లకు బలమైన పోటీ ని ఇవ్వడం సాధారణమైన విషయం అయితే కాదు. కానీ బంధాల్లో చిక్కుకొని తన ఆట ని మొత్తం చెడగొట్టుకున్నాడు భరణి. మొదటి మూడు వారాల్లో ఆయనకు ఉన్నటువంటి గ్రాఫ్, కచ్చితంగా ఇప్పుడు మాత్రం లేదు. ఆశ్చర్యాన్ని కలిగించే విషయం ఏమిటంటే, ఈ వారం నామినేషన్స్ లో వచ్చిన భరణి, డేంజర్ జోన్ లో ఉన్నాడు. ఎలిమినేట్ అయిపోయినా ఆశ్చర్యపోవాల్సిన అవసరమే లేదు. అలాంటి ఉంది పరిస్థితి. కానీ భరణి మాత్రం వైల్డ్ కార్డ్స్ అందరూ నాతో బాగా కలిసిపోయారు, నేను స్ట్రాంగ్ కంటెస్టెంట్, అందరికంటే టాప్ లో ఉన్నాను అనే భ్రమల్లో బ్రతుకుతున్నాడు.
కానీ ప్రస్తుతం తన పరిస్థితి ఎలా ఉందో తెలిస్తే, ఏమైపోతాడో అని సోషల్ మీడియా లో నెటిజెన్స్ మాట్లాడుకుంటున్నారు. నిన్న దివ్య తో భరణి మాట్లాడుతూ ‘నన్ను టార్గెట్ చేసిన ప్రతీ ఒక్కరు ఎలా వెళ్లిపోతున్నారో చూస్తూనే ఉన్నావ్ కదా. నేను వాళ్ళని అసలు నామినేట్ చేయలేదు. వాళ్ళే నన్ను టార్గెట్ చేసి వెళ్లిపోయారు. ఈ విషయం ఇక్కడ చాలా మందికి అర్థం అవ్వడం లేదు’ అంటూ చెప్పుకొచ్చాడు. ఈ వారం శ్రీజ ఎలిమినేషన్ కూడా ఈయన వల్లే జరిగిందేమో అనే భ్రమలో ఉన్నాడు భరణి. కానీ ఈయనతో పాటు క్లోజ్ గా ఉంటున్న దివ్య కూడా రోజు రోజుకి తన గ్రాఫ్ ని పెంచుకుంటూ పోతుంది. భరణి పాపం లైవ్ లో దివ్య ఎక్కడ ఎలిమినేట్ అయిపోతుందో అని భయపడుతున్నాడు. కానీ ఆయనకు తెలియాల్సిన విషయం ఏమిటంటే, కొన్ని సోషల్ మీడియా పోల్స్ లో ఆయన దివ్య కంటే తక్కువ ఓటింగ్ తో ఉన్నాడు.
ఇక్కడ భరణి విషయం లో వస్తున్న సమస్య ఏమిటంటే, ఈయన అందరితో మంచిగా ఉండడం వల్ల, ఇంకా మాస్క్ తీయలేదు, మంచోడిగా నటిస్తున్నాడు అనుకొని, చాలా మంది ఇతనికి ఓట్లు వేయడం లేదు. కానీ అసలు విషయం ఏమిటంటే, భరణి నిజంగానే మంచోడు. అందులో ఎలాంటి సందేహం లేదు. నిన్నటి నామినేషన్స్ లో ఆయన తనని తానూ డిఫెండ్ చేసుకున్న విధానం అదుర్స్. అదుర్స్ ఆ విషయం లో ఫిదా అయిపోయారు. ఇలాగే కొనసాగితే ఆయన గ్రాఫ్ ఎక్కడో ఉంటుంది. కానీ ఈ వారం ఆయన టాస్కుల్లో దుమ్ము లేపాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కానీ భరణి దివ్య డేంజర్ జోన్ లో ఉంది, ఈ వారం ఆ అమ్మాయితో ఎక్కువ టాస్కులు ఆడించాలి అనే మైండ్ సెట్ తో ఉన్నాడు. ఇక్కడే ఆయన పప్పులో కాలేసాడు, భరణి కూడా డేంజర్ జోన్ లో ఉన్నాడు అనే విషయం గ్రహించలేదు. చూడాలి మరి ఏమి అవుతుంది అనేది.