Bigg Boss 9 Telugu: ఈ వారం జరగబోయే ఎలిమినేషన్ ఎపిసోడ్ బిగ్ బాస్ సీజన్ 9(Bigg Boss 9 Telugu) లోనే ది బెస్ట్ గా ఉండబోతుందని టాక్. ఎందుకంటే 13 వ వారం లోకి అడుగుపెట్టారు, గత వారం దివ్య ఎలిమినేట్ అవ్వగా, ఈ వారం హౌస్ లో కేవలం 8 మంది మాత్రమే మిగిలారు. వీరిలో ఈ వారం నామినేషన్స్ లోకి తనూజ, భరణి, సుమన్ శెట్టి, రీతూ చౌదరి, సంజన మరియు డిమోన్ పవన్ మిగిలారు. వీరిలో తనూజ తప్ప, మిగిలిన 5 మంది డేంజర్ జోన్ లో ఉన్నారంటే నమ్ముతారా?, కానీ అది నిజమే. అందరూ బాగా ఆడుతున్నారు, అందరికీ సమానమైన ఓటింగ్ పడుతోంది. గత రెండు వారాల్లో ఎలిమినేషన్ ఎపిసోడ్స్ ని గమనిస్తే, సంజన గల్రాని చివరి రెండు స్థానాల్లో ఒక స్థానం లో ఉంది. కానీ శనివారం ఎపిసోడ్ ఆమె జాతకాన్ని మార్చేసింది అనడంలో ఎలాంటి సందేహం లేదు.
Also Read: ‘అఖండ 2’ ప్రీమియర్ షోస్ అడ్వాన్స్ బుకింగ్స్ ఇలా ఉన్నాయేంటి..? ఊహించనిది ఇది!
ఆ ఒక్క ఎపిసోడ్ తో ఆమె ఓటింగ్ భారీ గా పెరిగిపోయింది. ఈ వారం ర్యాంకుల వారీగా ఓటింగ్ ని ఒకసారి పరిశీలిస్తే , మొదటి స్థానం లో తిరుగులేని మెజారిటీ తో తనూజ కొనసాగుతోంది. అదే విధంగా రెండవ స్థానం లో డిమోన్ కళ్యాణ్ కొనసాగుతున్నాడు. తనూజ కి, డిమోన్ కి మధ్య ఓటింగ్ తేడా చాలానే ఉంది. అదే విధంగా డిమోన్ కి మరియు మిగిలిన కంటెస్టెంట్స్ కి మధ్య ఓటింగ్ తేడా చాలా తక్కువ ఉంది. మూడవ స్థానం లో సంజన గల్రాని ప్రస్తుతానికి కొనసాగుతుంది. ఆ తర్వాత నాల్గవ స్థానం లో భరణి కొనసాగుతున్నాడు. సంజన మరియు భరణి మధ్య ఓటింగ్ తేడా చాలా తక్కువ ఉంది. ఒకరోజు భరణి లీడింగ్ లో ఉంటే, మరో రోజు సంజన లీడింగ్ లో ఉంటుంది. ఇక చివరి రెండు స్థానాల్లో రీతూ చౌదరి, సుమన్ శెట్టి ఉన్నారు.
సుమన్ శెట్టి అందరికంటే తక్కువ ఓటింగ్ తో నిన్న మొన్నటి వరకు చివరి స్థానం లో ఉండేవాడు. కానీ నిన్న తనూజ తో జరిగిన పోరు తర్వాత ఆయన ఓటింగ్ శాతం బాగా పెరిగింది. దీంతో రీతూ చౌదరి ఇప్పుడు చివరి స్థానం లో కొనసాగుతోంది. కానీ ఇద్దరి మధ్య తేడా తక్కువే. నిన్న సుమన్ శెట్టి గెలిచినా టాస్క్ కి సంబంధించిన ఎపిసోడ్ కాసేపట్లో టెలికాస్ట్ కానుంది. ఈ ఎపిసోడ్ టెలికాస్ట్ అయ్యాక సుమన్ శెట్టి గ్రాఫ్ మరింత పెరగొచ్చు. అదే విధంగా ఇదే ఎపిసోడ్ లో భరణి కూడా గెలుస్తాడు. ఆయన గ్రాఫ్ కూడా భారీగా పెరగొచ్చు. కాబట్టి ఈ వారం సింగిల్ ఎలిమినేషన్ ఉంటే సుమన్ శెట్టి, రీతూ చౌదరి లలో ఒకరు, డబుల్ ఎలిమినేషన్ ఉంటే డిమోన్ పవన్, భరణి, సంజన లలో ఒకరు ఎలిమినేట్ అయ్యే అవకాశం ఉంది.