Bigg Boss 9 Agnipariksha: వచ్చే నెల 7వ తారీఖు నుండి బిగ్ బాస్ సీజన్ 9(Bigg Boss 9 Telugu) స్టార్ మా ఛానల్ లో గ్రాండ్ గా ప్రారంభం కాబోతున్న సంగతి తెలిసిందే. ఈ సీజన్ లో సామాన్యులు కూడా కంటెస్టెంట్స్ గా రాబోతున్న ఈ నేపథ్యం లో వాళ్ళని ఎంపిక చేసుకునే ప్రక్రియ లో భాగాంగా ఆన్లైన్ ద్వారా లక్షల సంఖ్యలో దరఖాస్తులను స్వీకరించి, అందులో నుండి కేవలం 45 మందిని ఎంపిక చేసుకొని, ఆ 45 నుండి కేవలం 15 మందిని అగ్నిపరీక్ష షో కోసం ఎంపిక చేశారు. వారం రోజుల నుండి జియో హాట్ స్టార్ లో ప్రతీ రోజు అర్థ రాత్రి 12 గంటలకు ఒక సరికొత్త ఎపిసోడ్ ని అప్లోడ్ చేస్తూ వస్తున్నారు. గత రెండు రోజులుగా ఈ 15 మందికి పెడుతున్న టాస్కులు చూసేందుకు చాలా ఆసక్తిని రేపుతున్నాయి. ఎవ్వరూ తగ్గడం లేదు, ప్రతీ ఒక్కరు నువ్వా నేనా రేంజ్ లో పోటీ పడుతున్నారు.
Also Read: ‘బిగ్ బాస్ 9’ హౌస్ సెట్ ఎంత అందంగా ఉందో చూసారా..? 2 హౌస్లు అదిరిపోయాయి!
ఇకపోతే ఇప్పటి వరకు జరిగిన తాసులలో బాగా ఆడుతూ ప్రేక్షకాభిమానం పొందిన కంటెస్టెంట్స్ పడాలా పవన్ కళ్యాణ్, దమ్ము శ్రీజా, ప్రసన్న కుమార్, షకీబ్, మాస్క్ మ్యాన్ హరీష్ వంటి వారు ఉన్నారు. వీళ్లంతా ఇప్పుడు ఓటింగ్ లైన్ లో ఉన్నారు. ఆడియన్స్ గత రెండు రోజుల నుండి వీళ్లకు ఓట్లు వేస్తున్నారు. మీరు కూడా ఓటు వెయ్యాలని అనుకుంటే జియో హాట్ స్టార్ లోకి వెళ్లి వేయండి. అయితే అందుతున్న విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం ప్రస్తుతానికి పడాలా పవన్ కళ్యాణ్ అందరికంటే అత్యధిక ఓటింగ్ తో నెంబర్ 1 స్థానం లో కొనసాగుతున్నాడట. టాస్కులు అద్భుతంగా ఆడి, ఇప్పటికే ఆయన రెండుసార్లు ఓటు అప్పీల్ చేసుకున్నాడు. దీనిని బట్టే అర్థం చేసుకోవచ్చు అతని స్టామినా ఎలాంటిది అనేది, ఇలాంటోళ్ళు బిగ్ బాస్ కి అవసరమని ఆడియన్స్ కూడా ఫిక్స్ అయిపోయినట్టు ఉన్నారు.
పవన్ కళ్యాణ్ తర్వాత అత్యధిక ఓట్లతో కొనసాగుతున్న మరో కంటెస్టెంట్ షకీబ్. నిన్న మొన్నటి వరకు ఇతనికి అంత జనాదరణ ఉండేది కాదు, కానీ ఇతనిలో బిగ్ బాస్ అంటే పిచ్చి ని గమనించి ఆడియన్స్ ముందుకు తీసుకెళ్తున్నట్టు అనిపిస్తుంది. ఆడిషన్స్ సమయంలో ఇతను డిజాస్టర్ ఫ్లాప్ అయ్యాడు. జడ్జీలు ఇతన్ని ఎలా తీసుకున్నారో అంటూ సోషల్ మీడియా లో తిట్టుకున్నారు. కానీ చివరికి అతన్నే ఆడియన్స్ ఇప్పుడు ఆదరిస్తున్నారు. ఇక వీళ్లిద్దరి తర్వాత దమ్ము శ్రీజా, అనూష రత్నం, ప్రియా శెట్టి, మర్యాద మనీష్ వంటి వారు మంచి ఓటింగ్ తో కొనసాగుతున్నారు. అయితే మొదట్లో అత్యంత ప్రజాధారణ సంపాదించుకున్న ప్రసన్న కుమార్ ఇప్పుడు బాగా డౌన్ అయిపోయాడు. ఈయన ఎలిమినేట్ అయ్యినట్టు తెలుస్తుంది. ఈయనతో పాటు శ్రేయా ఎలిమినేట్ అయిపోయిందని అందరు అంటున్నారు. చూడాలి మరి ఇందులో ఎలాంటి నిజం ఉంది అనేది.