Bigg Boss 7 Telugu Nominations: నామినేషన్స్ డే వచ్చిందంటే బిగ్ బాస్ హౌస్లో ఏడుపులు, పెడబొబ్బలు చోటు చేసుకుంటున్నాయి. ఎమోషన్స్ హద్దులు దాటేస్తున్నాయి. గట్టిగా అరవడం, చేతిలో ఉన్న వస్తువులు పగలగొట్టడం, బక్కెట్లు బక్కెట్లు కన్నీళ్ల ధారలు కార్చడం చేస్తున్నారు. నాలుగో వారం నామినేషన్స్ ప్రక్రియ మొదలైంది. అనూహ్యంగా జ్యూరీ మెంబర్స్ ని కూడా పెట్టారు. అంటే ఒక కంటెస్టెంట్ ని నామినేట్ చేయడానికి మరొక కంటెస్టెంట్ చెప్పే కారణంతో జ్యూరీ కూడా ఏకీభవించాలి. లేదంటే ఆ నామినేషన్ చెల్లదు.
హౌస్లో ముఖ్యంగా ఇద్దరు హైపర్ టెన్షన్ గాళ్ళు ఉన్నారు. ఒకటి గౌతమ్ కృష్ణ, మరొకరు ప్రిన్స్ యావర్. వీరిద్దరికీ అమర్ దీప్ కూడా తక్కువ కాదు. మరి నిజంగా కోపం వస్తుందో, ఎదుటివాళ్ళను భయపెట్టాలని ఇలా చేస్తారో అర్థం కావడం లేదు. నోరేసుకుని పడిపోతారు. వేలు చూపిస్తూ మీదకు వెళ్ళిపోతారు. గౌతమ్ కృష్ణ, యావర్ గతంలో కూడా కొట్టుకునేంత పని చేశారు. ఈవారం నామినేషన్స్ లో కూడా కలబడబోయారు. అలాగే గౌతమ్ కృష్ణ పాయింట్ ని వ్యాలిడ్ కాదన్న శివాజీ మీదకు వెళ్ళాడు గౌతమ్ కృష్ణ, అసలు నువ్వు ఎవరంటూ వేలు చూపిస్తూ మాట్లాడాడు.
అనంతరం రతికా రోజ్ పల్లవి ప్రశాంత్ పై గొడవ పడింది. తన డ్రెస్సింగ్ మీద కామెంట్ చేశాడని ఆమె ఫైర్ అయ్యింది. నువ్వు ఎవడ్రా నాతో మజాక్ చేయడానికి అంటూ అతని మీదకు ఎక్కేసింది. అమర్ దీప్ సైతం సహనం కోల్పోయాడు. ప్రియాంక అనర్హుడని నిన్ను ప్రకటిస్తే నువ్వు డిపెండ్ చేసుకోలేకపోయావ్. నువ్వు గేమ్ ఆడలేదు అని శుభశ్రీ కారణం చెప్పింది. ప్రియాంక-నేను కలిసి గేమ్ ఆడకపోవడం మా స్ట్రాటజీ. నీకెందుకు అని ఆమె మీద ఫైర్ అయ్యాడు.
శుభశ్రీ నామినేట్ చేయడానికి చెప్పిన రీజన్ నచ్చలేదని ఆమెను అమర్ దీప్ తిరిగి నామినేట్ చేశాడు. ఇది కరెక్ట్ కాదని శుభశ్రీ అమర్ దీప్ పై అసహనం ప్రకటించింది. అమర్ దీప్ కోపంగా ఆమె మీద విరుచుకుపడ్డాడు. దాంతో శుభశ్రీ కన్నీరు పెట్టుకుంది. మొత్తంగా నామినేషన్స్ ప్రక్రియ గొడవలు, పెడబొబ్బలతో సాగింది. డ్రామా డోసు ఓవర్ కావడం ప్రేక్షకులను ఒకింత అసహనానికి గురి చేస్తుంది. ఈ వారం ఎవరు నామినేట్ అయ్యారు నేడు తేలనుంది.