Bigg Boss 7 Telugu Nominations: బిగ్ బాస్ హౌస్లో నామినేషన్స్ డే వచ్చిందంటే కంటెస్టెంట్స్ బరస్ట్ అవుతారు. నామినేషన్స్ చెప్పే కారణాలు… వాటిని డిపెండ్ చేసుకునే పాయింట్స్ వాగ్వాదానికి దారితీస్తాయి. సోమవారం నామినేషన్స్ ప్రక్రియ మొదలైంది. గార్డెన్ ఏరియాలో కోర్ట్ రూమ్ సెటప్ పెట్టారు. పవర్ అస్త్ర గెలుచుకున్న ఆట సందీప్, శివాజీ, శోభా శెట్టి జ్యూరీ సభ్యులుగా ఉంటారు. నామినేట్ చేయాలనుకున్న కంటెస్టెంట్ ని గిల్టీ బోర్డు ఎక్కించి నామినేట్ చేయాలి.
ప్రతి ఒక్కరూ ఇద్దరిని నామినేట్ చేయాల్సి ఉంటుంది. నామినేషన్ కి కంటెస్టెంట్స్ చెప్పిన కారణాలతో జ్యూరీ సభ్యులు ఏకీభవించాలి. వారు సంతృప్తి పడకపోతే నామినేషన్ చెల్లదు. గౌతమ్ యావర్ ని నామినేట్ చేస్తూ చెప్పిన కారణాలతో శివాజీ ఏకీభవించలేదు. నేను చెప్పేది పూర్తిగా వింటే మీకు అర్థం అవుతుందని గౌతమ్ చెప్పే ప్రయత్నం చేశాడు. అయినా శివాజీ సంతృప్తి చెందలేదు.
ఈ క్రమంలో గౌతమ్ సహనం కోల్పోయాడు. చేతిలో ఉన్న గొడుగు విరగ్గొట్టారు. మైక్ తీసేశాడు. అసలు నువ్వు ఎంత? అంటూ వేలు చూపిస్తూ శివాజీ మీదకు దూసుకుపోయాడు. గౌతమ్ ఆ రేంజ్ లో ఫైర్ అవుతాడని అసలు ఊహించలేదు. అనంతరం అమర్ దీప్ గౌతమ్ తో మాట్లాడాడు. ఇలాంటి ప్రవర్తనతో నీపై నువ్వే నెగిటివిటి తెచ్చుకుంటున్నావని అన్నాడు.
ఇక మరో నామినేషన్ లో పల్లవి ప్రశాంత్, అమర్ దీప్ కి వాగ్వాదం జరిగింది. నీకు రెండు ముఖాలు. నీలో షేడ్స్ ఉన్నాయి. ముసుగులో ఆట ఆడుతున్నావ్ అని అమర్ దీప్ పల్లవి ప్రశాంత్ ని అన్నాడు. అసలు రెండు ముఖాలు అంటే ఎలా ఉంటాయని అమర్ దీప్ ని పల్లవి ప్రశాంత్ తిరిగి వాదించాడు. నీలో కూడా షేడ్స్ ఉన్నాయని తిరిగి ప్రశ్నించాడు. మొత్తంగా నామినేషన్స్ రోజు కంటెస్టెంట్స్ నువ్వా నేనా అన్నట్లు కొట్లాడుకున్నారు.
Bigg Boss Nominations Turn into a Courtroom Battle! 😲 Contestants lose control as they declare, 'We're not a family; it's just a game.' The drama reaches new heights! 📺🔥#BiggBossTelugu7 #Starmaa @iamnagarjuna @DisneyPlusHSTel
Link: https://t.co/b034cBubRF
— Starmaa (@StarMaa) September 26, 2023