Bigg Boss 7 Telugu: బిగ్ బాస్ హౌస్ లో నామినేషన్స్ హోరెత్తిస్తున్నాయి. 12వ వారం ఆరుగురు కంటెస్టెంట్స్ నామినేషన్స్ లో ఉన్నారు. కాగా గత వారం ఎవిక్షన్ ఫ్రీ పాస్ యావర్ ఇంటి సభ్యులతో పోటీ పడి గెలుచుకున్నాడు. కానీ అతడు ఫౌల్ గేమ్ ఆడాడని అనడంతో తిరిగి బిగ్ బాస్ కు ఇచ్చేసాడు. అందుకని మళ్ళీ ఈ వారం కూడా ఎవిక్షన్ ఫ్రీ పాస్ గెలుచుకోవడానికి కంటెస్టెంట్స్ కి అవకాశం కల్పించారు బిగ్ బాస్. ఇక ఎవిక్షన్ పాస్ పోటీలు నిర్వహించారు. అయితే ఈ వారం టాప్ కంటెస్టెంట్ ఏవిక్షన్ పాస్ గెలుచుకున్నట్లు సమాచారం.
అయితే ఈ వారం నామినేషన్స్ హాట్ హాట్ గా సాగుతున్నాయి. ఇందులో ఆరుగురు కంటెస్టెంట్స్ నామినేట్ అయ్యారు. గౌతమ్ కృష్ణ, పల్లవి ప్రశాంత్, అశ్విని శ్రీ, రతిక రోజ్, అంబటి అర్జున్ నామినేషన్ లిస్ట్ లో ఉన్నారు. ఇక అశ్విని అయితే సెల్ఫ్ నామినేట్ చేసుకుంది. ఇక ప్రస్తుతం హౌస్ లో ఉన్న పది మంది కంటెస్టెంట్స్ లో టాప్ 5 లో ఎవరు ఉంటారు. టైటిల్ విన్నర్ ఎవరు అవుతారు అనే అంశాలు ఆసక్తి గా మారాయి.
ఇది ఇలా ఉంటే .. గత వారం ఎవిక్షన్ పాస్ యావర్ గెలుచుకున్నాడు. యావర్ ఎవిక్షన్ పాస్ తిరిగి ఇచ్చినందుకు .. ఎలిమినేషన్ లేదని చెప్పడం ఇదంతా తెలిసిన విషయమే. దీంతో ఈ వారం మళ్ళీ పోటీలు నిర్వహించాడు బిగ్ బాస్. అయితే ఈసారి ఎవిక్షన్ పాస్ ప్రశాంత్ గెలుచుకున్నాడు. కానీ ఓ ట్విస్ట్ ఇచ్చాడు బిగ్ బాస్. గత వారంలో జరిగినట్లు ప్రశాంత్ మిగిలిన ఇంటి సభ్యులతో పోటీ పడి గెలిచి ఎవిక్షన్ పాస్ కాపాడుకోవాలి.
గత వారం అర్జున్ చేతి నుంచి పాస్ యావర్ కి వచ్చింది. మరి ప్రశాంత్ గట్టిగా ఆడి ఎవిక్షన్ పాస్ నిలబెట్టుకుంటాడో లేదో చూడాలి. ఇక ఈ వారం ఎవిక్షన్ పాస్ తో ఎవరు సేఫ్ అవుతారు .. ఎవరు ఎలిమినేట్ అవుతారు అనేది ఉత్కంఠగా మారింది. ఫైనల్ కి మరో మూడు వారాల సమయం మాత్రమే ఉంది. కాబట్టి ఎవిక్షన్ పాస్ కీలకం కానుంది.