Bigg Boss 7 Telugu: టాప్ సెలబ్స్ లో ఒకరిగా ఉన్న అమర్ దీప్ అంచనాలకు తగ్గట్టు ఆడటం లేదు. అతడి గేమ్ లో క్లారిటీ కొరవడింది. ఇదే విషయం నాగార్జున కూడా చెప్పారు. అమర్ దీప్ కి క్లాస్ పీకాడు. గత ఐదు వారాల్లో అమర్ దీప్ పెరఫామెన్స్ చూస్తే ఎక్కడో ఉంది. ఆరో వారం నామినేషన్స్ లో హౌస్ మేట్స్ అందరూ అమర్ దీప్ ని టార్గెట్ చేశారు. ఇంట్లోకి వచ్చిన కొత్త వాళ్ళు కూడా నామినేట్ చేశారు. అందరి పాయింట్ అమర్ దీప్ పెర్ఫార్మన్స్ సరిగా లేదని.
ఈ వారం ఏకంగా 7గురు నామినేట్ చేశారు. అందరి కంటే ఎక్కువ క్రాస్ మార్క్స్ అమర్ దీప్ ముఖాన పడ్డాయి. నామినేషన్ ప్రక్రియలో భాగంగా ఇంట్లోకి వచ్చిన కొత్త వాళ్ళను పోటుగాళ్ళుగా బిగ్ బాస్ అభివర్ణించారు. వీరు ఒక్కొక్కరు ఇద్దరి ముఖాన క్రాస్ మార్క్ వేసి నామినేట్ చేయాలని చెప్పాడు. వీరిలో చాలా మంది అమర్ దీప్ ని నామినేట్ చేశారు. అంబటి అర్జున్ అయితే అమర్ దీప్ కి సుదీర్ఘంగా క్లాస్ పీకాడు.
నీకు టాస్క్ లు అర్థం కావడం లేదు . ఎవరైనా చెబితే వినడం లేదు. నువ్వు టాస్క్ లలో అగ్రెసివ్ అనుకుంటున్నావు కానీ నిజానికి కాదు. నువ్వు సొంతగా ఆడలేకపోతున్నావు. నీ నిర్ణయాలు నువ్వు తీసుకోలేకపోతున్నావు. మాట్లాడితే పొడిచేస్తా, నరికేస్తా అంటూ గట్టిగా అరుస్తున్నావ్ కానీ చేసేదేమీ లేదు. నీ పెర్ఫార్మన్స్ నిజంగా నిరాశపరిచింది అన్నాడు. అంబటి అర్జున్ మాటలు అమర్ దీప్ శ్రద్దగా విన్నాడు.
ఏడుగురు నామినేట్ చేసిన క్రమంలో అమర్ దీప్ ఈ వారం కూడా ఖచ్చితంగా నామినేషన్స్ లో ఉంటాడు. దీంతో అమర్ దీప్ ని పంపించేస్తారా ఏంటి అనే అనుమానాలు బలపడుతున్నాయి. అమర్ దీప్ ఆడియన్స్ ని అట్రాక్ట్ చేయాలని పల్లవి ప్రశాంత్ ని టార్గెట్ చేశాడు. రైతులే కాదు సమాజంలో అందరూ గొప్పే అని చెప్పే ప్రయత్నం చేశాడు. అయితే అతడి సందేశం రాంగ్ టర్న్ తీసుకుంది. దానికి తోడు అమర్ దీప్ గేమ్ పూర్తిగా నిరాశపరిచింది. అతడు ఒక్క టాస్క్ లో కూడా తన మార్క్ చూపించలేదు. మరోవైపు పల్లవి ప్రశాంత్ పవర్ అస్త్ర గెలిచాడు. అలాగే హౌస్ కెప్టెన్ అయ్యాడు.