Bigg Boss 7 Telugu: బిగ్ బాస్ 7 ఏడో వారానికి సంబంధించిన కెప్టెన్సీ టాస్క్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇందులో జిలేబీ పురం -గులాబీ పురం మధ్య టాస్కులు పెట్టారు బిగ్ బాస్. వరుసగా రెండు టాస్కుల్లో జిలేబీ పురం గెలిచింది. ఇప్పుడు మరో టాస్క్ ఇచ్చారు బిగ్ బాస్. ఏలియన్స్ ని సంతోష పరిచేందుకు స్పేస్ షిప్ ఛార్జ్ చెయ్యాలి అని చెప్పారు. ఇక ఈ టాస్క్ ఆడేందుకు జిలేబీ పురం నుంచి ప్రశాంత్, గులాబీ పురం టీమ్ నుంచి గౌతమ్ పార్టిసిపేట్ చేశాడు. దీని కోసం వారి ముందు చిక్కు పడి ఉన్న తాడులను సరి చేసి ప్లగ్గు ని స్పేస్ షిప్ కి కనెక్ట్ చెయ్యాల్సి ఉంటుంది.
ఇక ఇద్దరు నువ్వా నేనా అన్నట్లుగా హోరా హోరీగా ఆడుతున్నారు. ప్రశాంత్ కాస్త ముందంజలో ఉన్నట్లు కనిపించాడు. సెకన్ల వ్యవధిలో పల్లవి ప్రశాంత్ ఓడిపోయాడు. గులాబీ పురం ఈ టాస్క్ లో గెలిచింది. ఇక టాస్క్ జరుగుతుండగానే తేజ ని బిగ్ బాస్ ఆట పట్టించారు. తేజా టాటూ వేయించుకోవడానికి ఏ డిజైనో డిసైడ్ అయ్యావా అని అడిగారు బిగ్ బాస్. టాస్క్ తర్వాత మాట్లాడదాం బిగ్ బాస్ అని తేజ అన్నాడు. ఈ టాస్క్ తర్వాత మీ టాస్క్ మొదలవుతుంది అని చెప్పారు బిగ్ బాస్.
ఇక తేజ కోసం స్పెషల్ కేక్, దాంతో పాటు ఒక లెటర్ పంపించారు. తేజ ఇది ముగింపు కాదు .. ఇన్ ఫ్రంట్ దేర్ ఈజ్ క్రొకోడైల్ ఫెస్టివల్ (ముందుంది ముసళ్ల పండుగ) అని లెటర్ లో రాసి ఉంది. అసలు ముసళ్ల పండగేంటి.. క్రొకోడైల్ ఫెస్టివల్ ఏంటో అని ఏమి అర్థం కాక బుర్ర బద్దలు కొట్టుకున్నాడు తేజ. ఇక కేక్ చూసి అమర్ ఆగలేక తింటారా .. లేక తినేద్దాం అంటూ కక్కుర్తి పడ్డాడు.
కేక్ తినకపోతే నిద్ర పట్టదా నీకు అని తేజ అడిగాడు. ఆలోచిస్తున్న తినాలా వద్దా అని అమర్ అనగానే తింటే నీకు మాములుగా ఉండదు అని తేజ అన్నాడు. అమర్ అతి చేస్తూ కచ్చితంగా తింటా అంటూ చిన్న కేక్ ముక్క తిన్నాడు. దీంతో తేజ కి కోపం వచ్చింది. ఎవరికి తినాలి అనిపిస్తే వాళ్ళు తినండి ఓపెన్ గా చెబుతున్న అని తేజ చెప్పాడు. మాకు పంపించినపుడు మేము డిసైడ్ చేస్తాం,ఆలోపు ఆగలేని వాళ్ళు కోసుకుని తినేయండి అంటూ వెళ్లిపోయాడు తేజ.
శోభా కూడా ఎవరూ తినడానికి ఇష్టపడలేదు. దాని మీద నా పేరు ఉంది. మీరు తినడానికి వీల్లేదు అంది. కాసేపటి తర్వాత అందరూ వెళ్లిపోయారు. ఏదైతే అది అవుతుందని తేజా-శోభా ఒక నిర్ణయానికి వచ్చారు. అందరితో కలిసి కేక్ తినేద్దాం అనుకున్నారు. ఇంటి సభ్యులను పిలిచారు. శివాజీ రాను తేజా కేకు విషయంలో అవమానించాడు అన్నాడు. తేజా వచ్చి స్వయంగా పిలవడంతో వచ్చాడు. అందరూ కేక్ తిన్నారు.