Bigg Boss 7 Telugu: బిగ్ బాస్ 7వ సీజన్ రసవత్తరంగా సాగుతోంది. గత సీజన్లలో కేవలం మాటల తూటాలు.. రొమాన్స్ ఎక్కువగా కనిపించేది. కానీ ఈసారి గేమ్స్, టాస్క్ లతో కంటెస్టెంట్ల మధ్య ఏర్పడిన పోటీ వాతావరణంతో ఉత్కంఠ నెలకొంది. ఒకరిపై ఒకరు విజయం సాధించాలనే తపనతో బాహాబాహికి దిగడంతో ప్రేక్షకుల్లో ఆసక్తిని రేపుతోంది. ఇందులో భాగంగా 62వ ఎపిసోడ్ మరింత రెస్పాన్ష్ వచ్చిందనే చెప్పాలి. వీరసింహాలు, గర్జించే పులులకు మధ్య సాగిన పోరులో బిగినింగ్ లోనే బిగ్ బాస్ దిమ్మతిరగే ట్విస్ట్ ఇచ్చాడు. బాల్స్ స్వాప్ చేసుకోవాలన్న తపనతో భాగంగా ఇరు టీంలు కలిసి సాగిన పోరులో ఆసక్తిని రేపింది.
‘హాల్ బాల్ హాప్’ అనే టాస్క్ తో 62వ ఎపిసోడ్ ప్రారంభమైంది. ఓవైపు గర్జించే పులులు, మరోవైపు వీరసింహాలు నిలిచాయి. బాల్స్ స్వాప్ చేసుకోవడానికి ఇరుజట్లు వీరోచితంగా పోరాడుతాయి. వీర సింహాలకు అడ్వాంటేజ్ గా ఉందని బిగ్ బాస్ చెబుతాడు. దీంతో బాల్స్ స్వాప్ చేసుకోవాలని కెప్టెన్సీ కంటేడర్స్ రేసులో వీర సింహాలు ముందుకు వెళ్లేలా చేస్తాయి. అంతకుముందు ఎపిసోడ్ లో ఆ బాల్ బోళెకు దొరుకుతంది. బ్లాక్ బాల్ తన దగ్గరుంటే టీంకు డిస్ అడ్వాంటేజ్ వస్తుందన్న భయంతో దానిని వీర సింహాల టీంకు ఇస్తాడు.
‘హాల్ బాల్ హాప్’ గేమ్ విన్నయి కంటేడర్స్ గా ఎంపికైన వీరసింహాలు ఓటింగ్ ద్వారా తమలో ఒకరిని కెప్టెన్ ను ఎన్నుకుంటారు. అయితే ప్రత్యర్థి టీంలో ఉన్న సభ్యులను మచ్చిక చేసుకుంటూ ఉండగా సీన్ లోకి బిగ్ బాస్ ఎంట్రీ ఇస్తాడు. కెప్టెన్ ఎవరనేది ఫిజికల్ టాస్క్ తో తేలుస్తామని చెబుతాడు. దీంతో గర్జించే పులులలోని టీంలోని ఒక సభ్యుడు ఈ గేమ్ ఆడాలని చెబుతాడు. వారిలో ఒకరు గెలిస్తే వారి తరుపున ఒకరు కెప్టెన్ అవుతారని అంటాడు. దీంతో బీన్ ఒక టాస్క్ ను పెడుతాడు.
కెప్టెన్ కంటేండర్స్ ఫొటోలతో బీన్ బ్యాగ్స్ ఉంటాయని, కెప్టెన్ కంటేండర్స్ ను సపోర్టు చేసిన వాళ్లు.. వారిని సపోర్టు చేస్తున్న వాళ్లు కంటేండర్స్ బ్యాగును భుజానికి వేసుకొని సర్కిల్లో తిరుగుతాడు. అవతి బ్యాగ్ లో ఉన్న బీన్స్ కిందపడిపోయేలా చెబుతాడు. ఎవరి బ్యాగ్ లో తక్కువగా బీన్స్ ఉంటాయో వారు గేమ్ నుంచి బయటకు వెళ్తారని అంటారు. ఫైనల్ గా ఈ గేమ్ లో ఒక్కరు మిగులుతారని, వారే విన్నర్ అని అంటాడు.
ఈ గేమ్ లో రతిక కోసం ఆడేందుకు ముందుకు వస్తాడు భోలే షావలి. ఎల్లో సర్కిల్ లో బీన్ బ్యాగు వేసుకొని కూల్ గానే కనిపించిన అమర్ టాస్క్ మొదలవగానే విరుచుకుపడుతాడు. మొదట భోళే బ్యాగుపై అంటే రతిక బ్యాగ్ ను టార్గెట్ చేస్తాడు. భోలే షావలి బ్యాగులో ఉన్న బీన్స్ ను కిందపడేస్తాడు. ఇందులో భాగంగా భేళే షావలిపై అమర్ మ్యాన్ హ్యాండిలింగ్ చేస్తాడు. ఈ క్రమంలో పిచ్చకొట్టుడు కొడుతాడు. భోళే షావలి కూడా అమర్ కాలర్ ను పట్టుకొని దాడి చేస్తాడు. ఒకరికొకరు వీరోచితంగా కొట్టుకుంటారు. దీంతో ఇక్కడ యుద్ధం జరుగుతుందా? అన్నట్లుగా షాక్ అవుతారు.