Bigg Boss 7 Telugu Day 18: బిగ్ బాస్ తెలుగు 7 ఆసక్తికరంగా సాగుతుంది. టాస్క్స్ నిర్వహించి బిగ్ బాస్ ఒక్కో కంటెండర్స్ ని నిర్ణయిస్తున్నారు. ఫస్ట్ కంటెండర్ గా ఆట సందీప్ ఉన్నాడు. అతడు పవర్ అస్త్ర గెలిచిన నేపథ్యంలో 5 వారాల ఇమ్యూనిటీ లభించింది. రెండో పవర్ అస్త్ర శివాజీ గెలుచుకున్నాడు. అతడికి 4 వారాల ఇమ్యూనిటీ లభించింది. ఇక మూడో పవర్ అస్త్ర కోసం పోటీ జరుగుతుంది. దీని కోసం బిగ్ బాస్ నేరుగా ముగ్గురిని ఎంపిక చేశాడు. ప్రిన్స్ యావర్, అమర్ దీప్ చౌదరి, శోభా శెట్టికి ఛాన్స్ ఇచ్చాడు.
అయితే వీరికి అర్హత లేదని వ్యతిరేక ఓటు వేసిన వాళ్లతో వీరు పోటీపడాల్సి ఉంది. ప్రిన్స్ యావర్ కి వ్యతిరేకంగా దామిని, రతికా రోజ్, తేజా ఓటు వేశారు. వీరితో ప్రిన్స్ యావర్ పోటీపడ్డారు. ఆ ముగ్గురు ఎంత డిస్ట్రబ్ చేసినా స్టాండ్ పై నుండి తల తీయకూడదని యావర్ ని బిగ్ బాస్ ఆదేశించారు. యావర్ ని ఓడించడానికి గుడ్లు, పేడ, గడ్డి అన్నీ ముఖాన వేశారు. అయినా ప్రిన్స్ యావర్ గెలిచాడు.
నెక్స్ట్ కంటెండర్ రేసులో ఉన్న శోభా శెట్టికి టాస్క్ ఇచ్చాడు. అత్యంత కారంగా ఉన్న చికెన్ తినాలని. ఎంత ఎక్కువ చికెన్ తింటే అంతగా నీ ప్రత్యర్దులకు పోటీ ఇస్తావ్ అన్నారు. కారంతో కూడిన చికెన్ తినేందుకు శోభా చాలా బాధపడింది. నా వల్ల కావడం లేదు బిగ్ బాస్ అని ఏడ్చేసింది. వాళ్ళ అమ్మను తలచుకుంది. ఏం జరిగినా ఏడవను అని అమ్మకు మాటిచ్చాను. అంటూ అతికష్టం మీద 27 చికెన్ పీసులు తిన్నది.
ఇక శోభా శెట్టికి వ్యతిరేకంగా ఓటు వేసిన శుభశ్రీ, గౌతమ్, పల్లవి ప్రశాంత్ కి కూడా ఇదే టాస్క్ పెట్టాడు. తక్కువ సమయంలో ఎక్కువ చికెన్ పీసులు తిన్నవారు శోభా స్థానంలో కంటెండర్ గా పోటీ పడవచ్చు అన్నాడు. ఈ టాస్క్ లో గౌతమ్ కృష్ణ 28 పీసులు తిన్నాడు. పల్లవి ప్రశాంత్ కూడా 27 తిన్నాడు. గౌతమ్ కృష్ణ 28వ పీస్ పూర్తిగా తినలేదు. అయినప్పటికీ గౌతమ్ కృష్ణ గెలిచినట్లు సంచాలక్ గా ఉన్న సందీప్ ప్రకటించాడు.
శోభా శెట్టి కంటే తక్కువ సమయంలో గౌతమ్ కృష్ణ 27 పీసులు తిన్నప్పటికీ ఆమెను అధిగమించని కారణంగా బిగ్ బాస్ శోభా శెట్టిని విన్నర్ గా ప్రకటించాడు. ఇక మూడో కంటెండర్ రేసులో అమర్ దీప్ ఉన్నాడు. అతడికి వ్యతిరేకంగా ప్రియాంక ఓటు వేసింది. కాబట్టి వారిద్దరికీ కంటెండర్ టాస్క్ పెట్టాడు. ఎవరైతే తమ జుట్టును త్యాగం చేస్తారో వారు కంటెండర్ రేసులో ఉంటారని చెప్పాడు. నాకు తలపై కుట్లు ఉన్నాయి. అవి కనిపిస్తాయి. కాబట్టి నేను గుండు చేయించుకోను అన్నాడు. దీంతో ప్రియాంక బాయ్ కట్ చేయించుకునేందుకు ఒప్పుకుంది.
దీంతో అమర్ దీప్ ఓడిపోయాడు. గెలిచిన ప్రియాంక కంటెండర్ రేసులో నిలిచింది. ప్రిన్స్ యావర్, ప్రియాంక, శోభా శెట్టి తదుపరి రౌండ్ లో పోటీపడతారు. వీరిలో పవర్ అస్త్ర ఎవరికి దక్కుతుందో చూడాలి…