Bigg Boss 7 Telugu: బిగ్ బాస్ హౌస్లో రెండో పవర్ అస్త్ర కోసం పోటీ జరుగుతుంది. ఇంటి సభ్యులను రణధీర-మహాబలి అనే రెండు టీములుగా విభజించిన బిగ్ బాస్ టాస్క్స్ నిర్వహిస్తున్నారు. రణధీర టీంలో శివాజీ, అమర్ దీప్ చౌదరి, షకీలా, ప్రియాంక, శోభా శెట్టి, ప్రిన్స్ యావర్ ఉన్నారు. ఇక మహాబలి టీంలో గౌతమ్ కృష్ణ, దామిని, శుభశ్రీ, రతికా రోజ్, పల్లవి ప్రశాంత్, తేజా ఉన్నారు. ప్రధమ పోటీలో భాగంగా ఫుల్ రాజా ఫుల్ అనే టాస్క్ నిర్వహించారు. ఈ టాస్క్ లో రణధీర టీమ్ గెలవడంతో మాయాస్త్రను చేరుకునే తాళం లభించింది.
రెండో టాస్క్ లో భాగంగా మలుపులో ఉంది గెలుపు అనే టాస్క్ ఏర్పాటు చేశారు. సంచాలకుడిగా ఉన్న ఆట సందీప్ రంగులతో స్పిన్ వీల్ తిప్పి ముల్లు ఏ కలర్ వద్ద ఆగిందో చెబుతారు. ఇరు టీమ్స్ నుండి ఒక్కో సభ్యుడు రంగుల సర్కిల్స్ ఉన్న బోర్డు మీద సందీప్ ఆదేశాల మేరకు చేతులు, కాళ్ళు ఉంచుతూ ముందు వెళ్ళాలి. గెలుపులో ఉంది మలుపు టాస్క్ లో కూడా రణధీర టీమ్ విజయం సాధించింది. దాంతో మాయాస్త్రను పొందే రెండో తాళం కూడా వారు గెలుచుకున్నారు.
ఇప్పుడు అసలు కథ మొదలైంది. రణధీర టీం మాయాస్త్రను సొంతం చేసుకున్న నేపథ్యంలో వారిలో ఒకరికి పవర్ అస్త్ర గెలుచుకునే ఛాన్స్ ఉంది. టీమ్ లో ఉన్న ఆరుగురు సభ్యులు పవర్ అస్త్ర కోసం పోటీపడాల్సి ఉంటుందని బిగ్ బాస్ చెప్పాడు. మొదటి పవర్ అస్త్ర గెలుచుకున్న ఆట సందీప్ కి 5 వారాలు ఇమ్యూనిటీ లభించిన విషయం తెలిసిందే. అతడికి వీఐపీ రూమ్ కూడా అలాట్ చేశారు. రెండో పవర్ అస్త్ర గెలుచుకున్న కంటెస్టెంట్ కూడా 5 వారాల ఇమ్యూనిటీ పొందవచ్చు.
రణధీర టీంలో శివాజీ, అమర్ దీప్ చౌదరి, ప్రియాంక, ప్రిన్స్ యావర్, శోభా శెట్టి, షకీలా ఉన్నారు. వీరిలో ఒకరికి పవర్ అస్త్ర దక్కనుంది. ఎప్పుడూ ఇంగ్లీష్, హిందీలో మాట్లాడుతున్న ప్రిన్స్ యావర్ కి బిగ్ బాస్ శిక్ష వేశాడు. సారీ చెబుతూ ఆయా తెలుగు పదాలు పలకాలని ఆదేశించాడు. ఈ విషయంలో మహాబలి టీమ్ ప్రిన్స్ యావర్ ని డిస్ట్రబ్ చేసే ప్రయత్నం చేశారు. అది నచ్చని శివాజీ ఫైర్ అయ్యాడు. నేను చాలా వైలెంట్ అంటూ డంబెల్స్ విసిరికొట్టాడు. ఆట సందీప్ పవర్ అస్త్రను మహాబలి టీమ్ కాజేసింది. మరి దీని పర్యవసానం ఏమిటో నేటి ఎపిసోడ్లో చూడాలి..