Bigg Boss 7 Telugu : బిగ్ బాస్ 7 సీజన్ ఇప్పటి వరకు టివి షో లన్నింటిలో నెంబర్ వన్ షో గా అత్యధిక టీఆర్పీ రేటింగ్ ని సాదిస్తు టాప్ లెవల్లో అద్భుతంగా ముందుకు సాగుతుంది. అందులో భాగంగానే ఇప్పటికే కొంతమంది కాంటెస్ట్ బిగ్ బాస్ షో నుంచి ఎలిమినేట్ కూడా అయ్యారు. ఇక ఇప్పటికే శివాజీ,పల్లవి ప్రశాంత్ లాంటి వారు ఈ షోలో చాలా పాపులరిటీ ని సంపాదించుకుంటూ బిగ్ బాస్ చెప్పే టాస్క్ లలో చాలా చురుగ్గా పాల్గొంటూ జెన్యూన్ గా ఉంటూ ప్రేక్షకుల ఆదరణ పొందుతున్నారు.
View this post on Instagram
అందులో భాగంగానే బిగ్ బాస్ లోకి మరింత ఎంటర్ టైన్ మెంట్ ని ఇవ్వడానికి ప్రస్తుతం వైల్డ్ కార్డు ఎంట్రీ తో అశ్విని శ్రీ అనే ఒక ముద్దుగుమ్మ హౌస్ లోకి ఎంటర్ అయింది. ఈమె ఇప్పటికే కొన్ని సినిమాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నప్పటికీ సినిమాలు చేసే కంటే ముందే ఈమె సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ గా ఉంటూ చాలామంది ఫాలోవర్స్ ని కూడా సంపాదించుకుంది.
View this post on Instagram
ఈమె బిగ్ బాస్ లోకి వచ్చి రాగానే తన అంద చందాలతో చాలా మంది ప్రేక్షకులను తన ఫ్యాన్స్ గా మార్చుకుంటుంది. ఈమె హౌజ్ లోకి వచ్చిన వెంటనే నామినేషన్ ప్రక్రియలో భాగంగా శోభాశెట్టితో గొడవపడి నేను షో నుంచి వెళ్ళిపోతాను అంటూ చెప్తూనే కన్నీళ్లు కూడా పెట్టుకుంది. ఇక ఈ అశ్విని శ్రీ ని బిగ్ బాస్ షోలో చూసిన చాలామంది అభిమానులు ఆమె గురించి ఇంటర్నెట్ లో సెర్చ్ చేయడం స్టార్ట్ చేశారు. అందులో భాగంగానే ఈమె ఇప్పటికే విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకొని వచ్చిన రెండు రోజులకే బిగ్ బాస్ హౌజ్ లో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పాటు చేసుకుంటుంది.
View this post on Instagram
ఇక వైల్డ్ కార్డు ఎంట్రీ తో వచ్చినప్పటికీ స్టార్టింగ్ నుంచి ఉన్న కంటెస్టెంట్స్ కి ఏ మాత్రం తీసిపోకుండా గేమ్స్ ఆడుతూ బిగ్ బాస్ హౌస్ లో ఎవరికి లేని విధంగా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ని అయితే ఏర్పాటు చేసుకుంటుంది. ఇక ఈమె మధ్యలో వచ్చినప్పటికీ ఈమె టార్గెట్ మాత్రం బిగ్ బాస్ టైటిల్ విన్నర్ గా నిలవడమే అని ఆమె హౌస్ లోకి వచ్చిన రోజే చెప్పడం జరిగింది. ఇక ఈ ప్రక్రియలో ముందు ముందు రాబోయే రోజుల్లో బిగ్ బాస్ హౌస్ లో ఉన్న మిగతా కంటెస్టెంట్స్ నుంచి వచ్చే పోటీని తట్టుకొని తను నిలబడగలుగుతుందా లేదా అనేది చూడాలి…
View this post on Instagram