Rohit- Vasanthi: వయస్సుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరు రాత్రి పది గంటలు అవ్వగానే టీవీ లకు అత్తుక్కుపోయి చూసే ఏకైక షో బిగ్ బాస్..ప్రతి ఏడాది లాగానే ఈ ఏడాది కూడా సరికొత్త సీసన్ తో భారీ అంచనాల నడుమ ప్రారంభమైన ఈ రియాలిటీ షో ఇప్పుడు సరికొత్త టాస్కులతో హౌస్ మేట్స్ తో ఒక ఆట ఆడుకుంటూ ప్రేక్షకులకు తిరుగులేని ఎంటర్టైన్మెంట్ ని పంచుతుంది..ఈ వారం బిగ్ బాస్ ఇచ్చిన బ్యాటరీ ఛార్జింగ్ టాస్క్ కి అద్భుతమైన ఆదరణ దక్కింది..బ్యాటరీ పాయింట్స్ ని ఉపయోగించుకొని హౌస్ మేట్స్ వారి కుటుంబ సభ్యులతో మాట్లాడే విధానం ఆసక్తి గా అనిపించింది..గత మూడు రోజుల నుండి సాగుతున్న ఈ టాస్కుకి ఈరోజు తెర దించారు బిగ్ బాస్..అయితే ఈరోజు జరిగిన ఎపిసోడ్ లో బ్యాటరీ శాతం సున్నాకి పడిపోయినప్పుడు బిగ్ బాస్ ఇంటి సభ్యులలో వాసంతి మరియు రోహిత్ ని పిలిచి బ్యాటరీ వంద శాతం రీ ఛార్జ్ అవ్వాలంటే మీ ఇద్దరిలో ఎవరో ఒక్కరు వరుసగా రెండు వారాలు నామినేట్ అవ్వాల్సి ఉంటుంది అని చెప్పాడు.

దీనికి రోహిత్ మరియు వాసంతి చర్చించుకోగా వాసంతి మాట్లాడుతూ ‘నువ్వు మెరీనా కలిసి వచ్చారు..ఒకరు హౌస్ నుండి వెళ్లిపోయిన మరొకరు ఉంటారు..కానీ నాకు ఆ అవకాశం లేదు..కాబట్టి నేను ఈ నామినేషన్ నుండి తప్పించుకోవాలి అనుకుంటున్నాను’ అంటూ రోహిత్ కి చెప్తుంది..అప్పుడు రోహిత్ అందుకు అంగీకరించి నామినేట్ అవ్వబోతుండగా అతని సతీమణి మెరీనా మధ్యలో కలగచేసుకొని ‘ఈ వారం నేను నామినేషన్స్ లో ఉన్నాను..ఒకవేళ నేను ఎలిమినేట్ అయ్యి.

వచ్చే వారం నువ్వు ఎలిమినేట్ అయితే ఇద్దరికీ లాభం ఉండదు..ఆలోచించుకో’ అని చెప్తుంది..కానీ రోహిత్ నామినేట్ అవ్వడానికి ఇష్టపడతాడు..అప్పుడు మెరీనా ‘నీ ఇష్టం’ అని చెప్పి వదిలేస్తుంది..అలా వాసంతి కోసం రోహిత్ రెండు వారాలు నేరుగా నామినేట్ అయ్యాడు..హౌస్ లో అందరికంటే వీక్ ఉండే కంటెస్టెంట్ ఎవరైనా ఉన్నారా అంటే అది రోహిత్ అని చెప్పొచ్చు..ఇప్పటి వరుకు ఈయన సీరియస్ గా ఆడిన ఆట ఒక్కటి కూడా లేదు..ఇప్పుడు వరుసగా నామినేషన్స్ లో ఉన్నాడు కాబట్టి ఎలిమినేట్ అవుతానేమో అనే భయం తో ఇక నుండి అయినా రోహిత్ తన ఆట తీరుని మార్చుకుంటాడో లేదో చూడాలి.