Bigg Boss 6 Telugu- Inaya Sultana vs Revanth: ఈ వారం బిగ్ బాస్ ఇచ్చిన కెప్టెన్సీ టాస్క్ ఎంత వాడివేడిగా సాగిందో మన అందరికి తెలిసిందే..బిగ్ బాస్ చరిత్ర లో ఇది వరుకు ఎన్నడూ కూడా ఉపయోగించని స్ట్రాటజిలను కొంతమంది కంటెస్టెంట్స్ ఈ టాస్కులో ఆది శబాష్ అనిపించాడు..అయితే ఈ టాస్కు చాలా వరుకు ఫిజికల్ గా వెళ్ళింది..కొంతమందికి తీవ్రమైన గాయాలు కూడా అయ్యాయి..బిగ్ బాస్ ఇది పరిగణలోకి తీసుకొని హింసకి తావు ఇవ్వకుండా చూసి ఉంటే బాగుండేదని ఈ షో ని చూస్తున్న ప్రేక్షకుల అభిప్రాయం.

ఎందుకంటే ఇంతకు ముందు సీజన్స్ లో కూడా ఫిజికల్ టాస్కులు పెట్టారు కానీ..ఈ సీజన్ లో ఈ వారం జరిగినంత ఫిజికల్ గా ఇంతకు ముందు ఏ సీజన్ లో కూడా జరగలేదనే చెప్పాలి..నాగార్జున గారు దీనికి ఎలాంటి రెస్పాన్స్ ఇస్తాడో చూడాలి..ఇక రేవంత్ సంగతి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు..టాస్కు వచ్చిందంటే చాలు ఇతనితో ఆడాలంటే ఎవరైనా భయపడిపోతారు..అంత కోపం తో కసిగా ఆడుతాడు..ఈ క్రమం లో అవతలి కంటెస్టెంట్ కి దెబ్బలు తాకడం వంటివి జరుగుతుంటాయి.
ఈరోజు ఇనాయ విషయం లో కూడా అదే జరిగింది..టాస్కులో భాగంగా టీ షర్ట్ మీదున్న లైఫ్ స్ట్రిప్స్ ని దొంగిలించే క్రమం లో ఇనాయ ని పొరపాటున కొట్టే పరిస్థితి రేవంత్ కి ఏర్పడింది..ముందుగా ఇనాయ కూడా తన రెండు కాళ్లతో రేవంత్ ని కొడుతోంది..అయితే ఇది ఉద్దేశపూర్వకంగా కొట్టలేదని..టాస్కులో అలా తగిలేసిందని , కానీ రేవంత్ ఉద్దేశపూర్వకంగానే నన్ను కొట్టాడని..కావాలని టార్గెట్ చేస్తున్నారని ఇనాయ అరిచి గోలపెడుతుంది..మరి ఇందులో ఏది నిజమో ఏది అబ్బద్దమో తెలియాలంటే ఈ వీకెండ్ లో జరగబొయ్యే ఎపిసోడ్స్ లో నాగార్జున గారు వీడియోస్ వేసి చూపించాల్సిందే.

గత వారం కూడా హౌస్ మేట్స్ కాస్త హద్దులు దాటి ప్రవర్తించడం తో నాగార్జున గారు ఇంటి సభ్యులందరికి కోటింగ్ ఇస్తాడు..గత వారం తో పోలిస్తే ఈ వారం ఇంటి సభ్యులు మరింత హద్దులు దాటారు..మరి దీనికి నాగార్జున రియాక్షన్ ఎలా ఉంటుందో చూడాలి మరి..ముఖ్యంగా రెడ్ స్క్వాడ్ టీం వారికి గట్టిగా కోటింగ్ పడే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి.