Revanth Elimination: గడిచిన 5 సీజన్స్ లాగ ఈసారి బిగ్ బాస్ సీజన్ అందరూ ఊహించినట్టు గా లేదు..ఎవ్వరి ఊహలకు అందని విధంగా ముందుకు దూసుకుపోతుంది..ముఖ్యంగా ఎలిమినేషన్స్ విషయం లో బిగ్ బాస్ లెక్కలు వేరే విధంగా ఉంటున్నాయి..గడిచిన కొద్దీ వారల నుండి జరిగిన ఎలిమినేషన్స్ ప్రేక్షకులకు ఏ మాత్రం ఆమోదయోగ్యం కానీ విధంగా ఉంది..టాస్కులు అద్భుతంగా ఆడే కంటెస్టెంట్స్ అందరిని పంపిస్తే ఇక మేము బిగ్ బాస్ ఎవరి కోసం చూడాలి అని అంటున్నారు ప్రేక్షకులు..గత వారం గీతూ ఎలిమినేషన్ అందరిని గందరగోళంలోకి నెట్టేసింది.

మొదటి రోజు నుండి చివరి రోజు వరుకు ఎంటర్టైన్మెంట్ విషయం లో మరియు టాస్కులు ఆడే విధానం లో సరికొత్త విధానాలతో దూసుకుపోతూ అదిరిపొయ్యే కంటెంట్ ని ఇచ్చే గీతూ ఎలిమినేట్ అవ్వడం ఏమిటి అని ఆమె అభిమానులు విరుచుకుపడ్డారు..అదంతా పక్కన పెడితే ఈ వారం మరో షాకింగ్ ఎలిమినేషన్ ఉండబోతుందని తెలుస్తుంది..గత వారం నాగార్జున గారు రేవంత్ కి యెల్లో కార్డు ఇచ్చిన సంగతి మన అందరికి తెలిసిందే.
ఫిజికల్ టాస్కులు ముందు వెనుక చూసుకోకుండా ఆడడం వల్ల రేవంత్ కారణంగా ఇంటి సబ్యులకు చాలా గాయాలయ్యాయి..వచ్చే వారం నుండి కాస్త చూసుకొని ఆడు..అందుకే నీకు యెల్లో కార్డు ఇస్తున్నాను..నువ్వు పద్దతి మార్చుకోకపోతే ఇక రెడ్ కార్డు ఇచ్చి ఇంటికి పంపిస్తాను అంటూ నాగార్జున వార్నింగ్ ఇస్తాడు..కానీ రేవంత్ ఈ వారం కూడా ఘోరంగా ఫిజికల్ అయ్యాడు.
ఈ వారం జరిగిన కెప్టెన్సీ టాస్కు లో మొదటి రోజు కాస్త కంట్రోల్ లో ఉన్నప్పటికీ రెండవ రోజు నాగమణులను కాపాడుకునే టాస్కులో ఇంటి సభ్యులపై ఫిజికల్ అయ్యాడు..అంతే కాకుండా ‘నన్ను ఎవరో క్రింద నుండి గట్టిగా లాగుతున్నారు..నేను అలా ఆడినప్పుడు ఎవరైనా ఫిజికల్ అని అంటే తోలు తీసేస్తాను’ అంటూ వార్నింగ్ ఇస్తాడు.

ఇలాంటివే నాగార్జున గారు రేవంత్ కి మార్చుకోమని గత వారం లో యెల్లో కార్డు ఇవ్వడం జరిగింది..కానీ రేవంత్ లో ఎలాంటి మార్పు లేదు..దీనితో ఆయనకీ ఈ వారం రెడ్ కార్డు తప్పేలా లేదని విశ్వసనీయ వర్గాల సమాచారం..వోటింగ్ ప్రకారం అయితే రేవంత్ నెంబర్ 1 స్థానం లోనే కొనసాగుతున్నాడు..అలాంటి ప్రేక్షాదరణ కలిగిన రేవంత్ ని రెడ్ కార్డు ఇచ్చి ఎలిమినేట్ చేసే సాహసం బిగ్ బాస్ చెయ్యగలుతుందా లేదా అనేది చూడాలి.