Bigg Boss 6 Telugu Voting Results Week 6: ప్రారంభం లో నత్త నడకన సాగిన ఈ సీసన్ బిగ్ బాస్ షో, రెండవ వారం నుండి ఉరకలేస్తూ ముందుకు దూసుకుపోతుంది..ఆసక్తికరమైన టాస్కులతో ప్రతి ఇంటి సభ్యుడు కుటుంబం తో కూర్చొని చక్కగా షో చూసేలాగా డిజైన్ చేసారు బిగ్ బాస్ టీం..ఇక ఈ వారం అనేకరకమైన ఎమోషన్స్ తో ప్రతీ ప్రేక్షకుడి మనసు కదిలించేలా ఎంతో ఆహ్లాదకరంగా బిగ్ బాస్ షో సాగిపోయింది..అయితే మొదటి నుండి మిగిలిన ఇంటి సభ్యులతో పోలిస్తే టాస్కులు ఆడడం లో కాస్త వెనుకబడిన కొంతమంది ఇంటి సభ్యులు ఈ వారం లో తమ ఆటని బాగా మెరుగుపర్చుకున్నారు.

వారిలో మనం ముందుగా మాట్లాడుకోవాల్సింది అర్జున్ గురించి..ఈ సీసన్ ప్రారంభం నుండి ఇతను ఏమిటి టాస్కులు ఆడకుండా ఎంతసేపు శ్రీ సత్య చుట్టూ తిరుగుతున్నాడు అని అందరూ అనుకున్నారు..కానీ గత రెండు వారాల నుండి ఇతగాడు తన ఆట తీరుని పూర్తిగా మార్చేసుకున్నాడు..ఇక ఈ వారం అయితే తన ఆట తీరుతో గ్రాఫ్ ని బాగా పెంచేసుకున్నాడు..నామినేషన్స్ లోకి వస్తే ఎలిమినేట్ అయిపోతాడు అనేంత వీక్ గా ఉండే అర్జున్ ఇప్పుడు నామినేషన్స్ పడితే వోటింగ్ లో టాప్ 3 రేంజ్ లో పక్కాగా ఉంటాడు అనిపించేంత రేంజ్ కి తన గ్రాఫ్ ని పెంచేసుకున్నాడు.
ఇప్పుడు ఈ వారం తమ ఆటని బాగా మెరుగు పరుచుకున్న కంటెస్టెంట్స్ మెరీనా మరియు రోహిత్..ఈ ఇద్దరి ఇంటి సభ్యులు ఈ వారం వ్యవరించిన తీరుకి కేవలం ఇంటి సభ్యుల మనసులనే కాదు, ఈ బిగ్ బాస్ షో చూస్తున్న ప్రతీ ఒక్కరి మనసుని గెలుచుకున్నారు..సందర్భానుసారంగా వీళ్లిద్దరు చేసిన త్యాగాలు చెయ్యడం, మరియు టాస్కులు వచ్చినప్పుడు కలబడి ఆడిన తీరు ప్రతీ ఒక్కరికి ఎంతగానో నచ్చింది..ప్రారంభంలో వీళ్లిద్దరు అసలు హౌస్ లో ఉన్నారా లేదా అన్నట్టు ఉండేది..అంత లౌ ప్రొఫైల్ లో ఆటలను ఆడేవారు..కానీ ఈ వారం వీళ్లిద్దరి ఆట తీరు అద్భుతం.

ఈ వారం నామినేషన్స్ లో మెరీనా కూడా ఉన్న సంగతి మన అందరికి తెలిసిందే..వారం ప్రారంభం లో వోటింగ్ లైన్ అందరి కంటే తక్కువ ఓట్లతో మెరీనా కొనసాగుతూ ఉండేదట..కానీ ఒక్కసారిగా ఆమె ఈ వారం మధ్యలో ఆమె ఆడిన ఆటని చూసి ప్రేక్షకులు ఆమెని టాప్ 3 స్థానం లో నిల్చోబెట్టినట్టు సమాచారం.
కాబట్టి ఈ వారం ఆమె ఎలిమినేట్ అయ్యే అవకాశమే లేదు..వీళ్ళతో పాటుగా ఆది రెడ్డి కూడా తన ఆటని బాగా మెరుగుపర్చుకున్నాడు..ఇక ప్రారంభం నుండి అందరికంటే బాగా ఆడుతూ చిచ్చర పిడుగులాగా దూసుకుపోయిన గీతూ మాత్రం తన గ్రాఫ్ ని బాగా తగ్గించేసుకుంది..ఈ వారం ఆమె ఎలిమినేట్ అయినా కూడా ఆశ్చర్యపోనక్కర్లేదని టాక్ వినిపిస్తుంది.