Inaya Sultana- Srihan: గత వారం లో లాగానే ఈ వారం కూడా బిగ్ బాస్ నామినేషన్స్ చాలా వాడివేడిగా సాగిపోయింది..హౌస్ లోకి అడుగుపెట్టిన మొదటి రోజు నుండి తరుచు గొడవలు పడుతూ ఉండే శ్రీహాన్ మరియు ఇనాయ సుల్తానా గత కొద్దీ రోజుల నుండి స్నేహంగా ఉంటూ అందరికి ఊహించని షాక్ ఇచ్చారు..ముఖ్యంగా శ్రీహాన్ పుట్టిన రోజు నాడు ఇనాయ స్పెషల్ గా అతని కోసం కేక్ ని తయారు చేసింది..అంతే కాకుండా ఆ కేక్ మీద ‘చోటు’ అని పేరు రాసి పక్కనే హార్ట్ సింబల్ పెట్టింది.

ఇది చూసి కేవలం ఇంటి సభ్యులు మాత్రమే కాదు, ప్రేక్షకులు కూడా ఆశ్చర్యపోయారు..అలా గత వారం మొత్తం వీళ్లిద్దరు నామినేషన్స్ తర్వాత గొడవలు పూర్తిగా మానుకొని స్నేహపూర్వకంగా ఉంటూ వస్తున్నారు..ఇనాయ హౌస్ లో బాగా క్లోజ్ గా ఉండే వ్యక్తి సూర్య..కానీ కొంతకాలం నుండి వీళ్లిద్దరి మధ్య సరిగా మాటలు లేవు..సూర్య తో మాట్లాడడం మానేసిన తర్వాత ఇనాయ శ్రీహాన్ తో క్లోజ్ గా ఉండడం ప్రారంభించింది.
ఇంటి సభ్యులు మరియు నాగార్జున గారితో పాటు ఆదివారం రోజు జరిగిన స్పెషల్ ఎపిసోడ్ కి గెస్ట్ గా వచ్చిన హైపర్ ఆది కూడా ఇనాయ బాయ్ ఫ్రెండ్స్ ని మార్చేస్తుంది అని అనడం తో ఇనాయ సుల్తానా బాగా హర్ట్ అయ్యింది..హైపర్ ఆది ఆ మాట అనడం తో ప్రేక్షకుల్లో కూడా అలాగే వెళ్తుందేమో అనే సందేహం ఇనాయలో కలిగింది..అందుకే ఈరోజు నామినేషన్స్ లో దానికి సాకుగా వాడుకొని శ్రీహాన్ ని నామినేట్ చేసింది..అప్పుడు శ్రీహాన్ దానికి సమాధానం చెప్తూ ‘వాళ్ళందరూ అలా అనుకుంటే అది వాళ్ళ తప్పు..నిన్ను అలా అనుకున్న వారిని నామినేట్ చెయ్యాలి కానీ..నన్ను నామినేట్ చెయ్యడం ఏమిటి’ అని అడుగుతాడు శ్రీహాన్.

అప్పుడు ఇనాయ దానికి సమాధానం చెప్తూ ‘అందరిలో నెలకొన్న ఆ అపోహ నుండి బయటపడడానికే నేను నిన్ను నామినేట్ చేస్తున్నాను’ అని చెప్తుంది..ఇది అసలు రీసన్ కాదు..ఈ రీసన్ తో నామినేట్ చెయ్యడం కరెక్ట్ కాదు అని శ్రీహన్ బదులిస్తాడు.