Inaya Sultana: ఈ వారం బిగ్ బాస్ హౌస్ లో కెప్టెన్సీ టాస్క్ చాలా ఆసక్తికరంగా సాగింది..నిన్న జరిగిన ‘కెప్టెన్సీ ఈజ్ గోల్’ టాస్కులో ఇంటి సభ్యులందరు అద్భుతంగా ఆడారు..రేవంత్, ఇనాయ, శ్రీహాన్, ఆది రెడ్డి మరియు రోహిత్ ఈ టాస్కులో పాల్గొనగా రేవంత్ పోటీదారులందరిని ఓడించి ఇంటి కెప్టెన్ అయ్యాడు..ఇది రెండవసారి ఆయన ఇంటి కెప్టెన్ అవ్వడం..ఈ టాస్కు ఆడుతున్న సమయం లో రేవంత్ శ్రీహాన్ మీద దాడి చెయ్యడం లేదని..కలిసి ఆడుతున్నారని ఫైమా గొడవకి వస్తుంది.

అలా గొడవ జరుగుతున్నా సమయం లో చివర్లో మిగిలియున్న తన స్నేహితుడు శ్రీహాన్ తో తలపడి అతనిని ఓడించి ఇంటి కెప్టెన్ అవుతాడు రేవంత్..ఇక హౌస్ లోకి అడుగుపెట్టిన రోజు నుండి నేటి వరుకు ఇంటి కెప్టెన్ అవ్వాలనే కోరికతో టాస్కులలో ప్రాణం పెట్టిమరీ ఆడుతున్న ఇనాయ కి మరోసారి నిరాశే ఎదురు అయ్యింది..ఈ వారం కూడా ఆమె కెప్టెన్సీ టాస్కులో ఓడిపోవడం తో వెక్కిళ్లుపెట్టిమరీ ఏడుస్తూ కూర్చుంది.
అయితే రేవంత్ మినహా ఈ టాస్కులో పోటీ చేసిన కంటెస్టెంట్స్ అందరూ కూడా ఇనాయ ని నిలువరించలేకపోయారు..రేవంత్ ని సైతం ఆమె చాలాసేపటి వరుకు డిఫెండ్ చెయ్యగలిగింది..రేవంత్ లాంటి అగ్రెస్సివ్ ప్లేయర్ ని ఫిజికల్ టాస్కులో డిఫెండ్ చెయ్యడం అంటే మాములు విషయం కాదు..ఆడపులి లాగానే ఆమె ఈ ఆటని ఆడింది.

ఇక ఆమె ఏడుస్తూ కూర్చోవడం ని చూసిన రేవంత్ ఆమె దగ్గరకెళ్ళి ఓదారుస్తాడు..’నేను నిన్ను మాత్రమే కావాలని టార్గెట్ చెయ్యలేదు..నా బెస్ట్ ఫ్రెండ్ శ్రీహాన్ ని కూడా నేను లెక్కచెయ్యకుండా దాడి చేశాను..అది నువ్వు గమనించాలి..వచ్చే వారం ఇలాంటి అవకాశం వస్తే కచ్చితంగా నిన్ను గెలిపించి తీరుతాను’ అని రేవంత్ ఇనాయ కి ధైర్యం చెప్తాడు..అప్పుడు ఇనాయ ‘కాసేపు నన్ను ఒంటరిగా వదిలేయ్ రేవంత్ ప్లీజ్’ అని అడుగుతుంది..కెప్టెన్సీ టాస్కులు ఓడిపోవడమే ఇనాయ కి బాగా ప్లస్ అవుతుంది..హౌస్ లో ఒంటరిగా ఆడుతుంది అనే సింపతీ యాంగిల్ ఆమెకి బాగా కలిసి వస్తుంది..గడిచిన కొద్దీ వారాల నుండి ఆమె గ్రాఫ్ మాములుగా పెరగలేదు..టైటిల్ కూడా గెలిచే అవకాశాలు ఈమెకి ఎక్కువ ఉన్నాయి.