Bigg Boss 6 Telugu- Geetu Adi- Reddy: బిగ్ బాస్ హౌస్ ప్రస్తుత సీజన్లో మొదటి నుండి స్ట్రాంగ్ గా ఉంటూ వస్తున్న కంటెస్టెంట్స్ లో ఒకరు గీతూ..ఫిజికల్ టాస్కులు ఆడడం లో మొదటి నుండి వీక్ కంటెస్టెంట్ గా ఉన్న గీతూ..స్మార్ట్ గా ఆడడం లో మంచి నేర్పరి..అంతే కాకుండా హౌస్ లో ఎలాంటి సందర్భం వచ్చినా..ఎంతో ఎమోషనల్ అయ్యే సంఘటనలు ఎదురైనా కంటి నుండి ఒక్క చుక్క నీళ్లు కార్చడం కూడా ఎప్పుడు చూడలేదు..అలాంటి ఆమె కూడా ఈ వారం మూడు సార్లు ఏడవాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి.

చేపల చెరువు టాస్కులో ఒక్కసారి ఏడ్చినా గీతూ, శనివారం రోజు నాగార్జున గారు ఆమెని తిడుతున్నప్పుడు మరోసారి ఏడుపు మొహం పెట్టింది..ఇక ఈరోజు అయితే ఆమె వెక్కిళ్లు పెట్టిమరీ ఏడవడం చూసి ఇంటి సభ్యులతో పాటుగా, ప్రతిఒక్కరు షాక్ కి గురైయ్యారు..హౌస్ లో ఈమె మొదటి నుండి ఇంటి సభ్యులతో స్నేహం చెయ్యడానికి పెద్దగా ఆసక్తి చూపించలేదు..బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెట్టిన ప్రతి ఒక్కరు..ఇక్కడ మేము ఉన్నన్ని రోజులు ఇది మా కుటుంబమే అని చెప్పుకునేవారు..కానీ గీతూ మాత్రం బిగ్ బాస్ నా ఫామిలీ కాదు అని మొహమాటం లేకుండా చెప్పేది.
అంత కఠినంగా ఉండే ఈమె రోజులు గడుస్తున్నా కొద్దీ ఆది రెడ్డి తో స్నేహం గా ఉండడం ప్రారంభించింది..అలా వీళ్లిద్దరి మధ్య మంచి బాండింగ్ ఏర్పడింది..హౌస్ లో ఉన్న ఇంటిసభ్యులు మొత్తం గీతూ కి వ్యతిరేకంగా ఉంటే,ఆది రెడ్డి మాత్రం ఆమెకి సపోర్టు ఉంటూ వచ్చేవాడు..ఇక ఈరోజు జరిగిన ఎపిసోడ్ లో హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ అందరూ ఒక్కొక్కరిగా సేవ్ అవుతూ రాగా, చివరికి ఆది రెడ్డి మరియు మరీనా మిగులుతారు..వీళ్ళిద్దరిలో ఎవరో ఒకరు ఎలిమినేట్ అవుతారు అని తెలిసాక, ఎక్కడ ఆది రెడ్డి ఎలిమినేట్ అవుతాడో అని గీతూ ఎక్కిళ్లుపెట్టి ఏడ్చేసింది..’నువ్వు వెళ్లకు ఆది రెడ్డి..నువ్వు వెళ్తే నాకు హౌస్ లో సపోర్ట్ చేసే వాళ్ళు ఎవ్వరు ఉండరు..అర్థం చేసుకునేవాళ్ళు లేరు’ అంటూ బోరున ఏడవడం మొదలు పెట్టింది..ఈమెలో ఇంత ఎమోషనల్ యాంగిల్ కూడా ఉందా అని అందరూ ఆశ్చర్యపోయారు.

చివరికి ఇద్దరు సేఫ్ గానే ఉన్నారు ఎలిమినేషన్ లేదు అని నాగార్జున చెప్పడం తో అందరూ రిలాక్స్ అయ్యారు..శనివారం రోజు సూర్య ని డైరెక్ట్ ఎలిమినేషన్ చేసిన సంగతి మన అందరికి తెలిసిందే..తర్వాత ఆయనని సీక్రెట్ రూమ్ లోకి పంపుతారేమో అని అందరూ అనుకున్నారు..కానీ అతను నిజంగానే ఎలిమినేట్ అవ్వడం తో పక్క రోజు ఎవ్వరిని ఎలిమినేట్ చెయ్యలేదని తెలుస్తుంది.