Bigg Boss 6 Telugu: బిగ్ బాస్ లో అసలు సిసలు గేమ్ ఆడించారు. హౌస్ మేట్స్ చేపల కోసం కొట్టుకు చచ్చారు. ఎప్పుడూ గేమ్ ఆడకుండా హితబోధ చేసే బాలాదిత్య ఈరోజు గేమ్ లో రెచ్చిపోయి ఆడడం అందరినీ ఆశ్చర్యపరిచింది. ఈ చేపల ఫిజికల్ టాస్క్ లో పోటీ పడలేక వైదొలిగిన గీతూ-ఆదిరెడ్డి వెంటనే చివరకు కింగ్ మేకర్లుగా అవతరించారు.

ఈ చేపల టాస్కులో చేపల కోసం హౌస్ మేట్స్ కొట్టుకు చచ్చారు. ఒకరి చేపలు మరొకరు లాక్కుంటూ రచ్చ రచ్చ చేశారు. అందరికంటే ఎక్కువగా చేపలను బల ప్రయోగం తో దక్కించుకున్నారు. కానీ రేవంత్-ఇనాయాలకు గట్టి షాకిస్తూ ఓడిపోయిన గీతూ ఇచ్చిన పంచ్ అయితే మామూలుగా లేదు.
చేపల్లో ఒక నల్లటి చేపను పంపించాడు బిగ్ బాస్. దాన్ని ఎవరూ చూడకుండా దాచిపెట్టుకుంది గీతూ. ఆ డిఫెరెంట్ చేపతో ఏదో ఒక బాంబు పేలుతుందని ముందే గమనించిన గీతూకు అన్నట్టే బిగ్ బాస్ ‘ఆ నల్లటి చేప ’ ఉన్న కంటెస్టెంట్ అత్యధిక చేపలను దక్కించుకున్న వారిని జీరో చేయవచ్చని.. మరొకరిని టాప్ లోకి తీసుకురావచ్చని గీతూకు సందేశం ఇస్తాడు.
తనకు వచ్చిన ఈ అధికారంతో రేవంత్-ఇనయాలను చావు దెబ్బ తీసింది గీతూ.. చేపల కోసం అందరి బుట్టల్లోంచి కొల్లగొట్టి దాదాపు 120 సేకరించి టాప్ లో నిలిచిన రేవంత్ కు గట్టి షాకిచ్చింది గీతూ. అతడి టాప్ ప్లేసులోంచి దించేసి తక్కువ చేపలు కలెక్ట్ చేసిన శ్రీహాన్-శ్రీసత్య జోడీని టాప్ లోకి మార్చేసింది. బిగ్ బాస్ గేమ్ మొత్తాన్ని తనకు దక్కిన ఓ బంగారు నల్లచేపతో మార్చేసిన గీతూ ఆట ఈ రోజు హైలెట్ అని చెప్పొచ్చు.
అందరికంటే ఎప్పుడూ సైలెంట్ గా ఉండే బాలాదిత్య ఈరోజు రెచ్చిపోయి ఆడాడు. కీర్తి, శ్రీసత్యలతో గొడవలు పెట్టుకోవడం విశేషం. మొత్తానికి గేమింగ్ పరంగా హౌస్ మేట్స్ అంతా ప్రాణం పెట్టి ఆడుతున్నారు. ఒక్క ఎంటర్ టైన్ మెంట్ కూడా బాగా చేస్తే ఈ సీజన్ కు కూడా ప్రేక్షకాదరణ బాగానే ఉంటుంది.