అన్నీ ఎమోషన్స్ కి పెట్టింది పేరు బిగ్ బాస్ హౌస్. వాటిల్లో అత్యంత కీలకమైన ఎమోషన్ “ప్రేమ”. బిగ్ బాస్ మొదటి సీజన్ నుండి ఈ పరంపర కొనసాగుతూ వచ్చింది. మొదట సీజన్ లో శివ బాలాజీ – హరితేజ, రెండవ సీజన్ లో సామ్రాట్ రెడ్డి – తేజస్విని, దీప్తి సునయన – తనీష్, మోనాల్ – అఖిల్ ఇలా చెప్పుకుంటూ పోతే బోలెడు జంటల ప్రేమలు బిగ్ బాస్ హౌస్ లో విరిశాయి.

తాజా గా సీజన్ 5 లో ప్రేమ కావ్యాలు మొదలయ్యాయి. శ్రీరామ చంద్ర – హామీద, మానస్ – ప్రియాంక సింగ్, లాహరి, ఇలా చాలా లవ్ స్టోరీస్ బయటకి వస్తున్నాయి. బిగ్ బాస్ మొదలయినప్పటి నుండి ప్రియాంక సింగ్, మానస్ మీద మనసు పారేసుకుంది. సందర్భం వచ్చిన ప్రతీ సారీ తన ప్రేమను మానస్ కి వ్యక్త పరుస్తోంది. తాజా గా బిగ్ బాస్ హౌస్ లో కొన్ని పరిణామాలు చోటుచేసుకున్నాయి. మానస్ కూడా హామీదాకి నోట్లో గోరు ముద్దలు పెడుతూ దగ్గర అయ్యాడు.
శుక్రవారం ఎపిసోడ్ లో వరస్ట్ పర్ఫార్మెన్స్ కనబరిచిన కారణంగా మానస్ జైల్ కి వెళ్ళాడు. మానస్ జైల్లో ఉన్నందుకు ప్రియాంక సింగ్ ఆ జైలు దగ్గరే తచ్చాడింది. హమీదాకు తినిపించినందుకు బాగా హర్టయిన పింకీ.. నువ్వు జైల్లో ఉన్నావు కదా! మరి హమీదాకు ఎవరు తినిపిస్తారు? అని అడిగింది. అంతలోనే అందుకుంటూ ఆమెకు రెండు చేతులు బాగానే ఉన్నాయి కదా, అయినా మూడు పూటలా తినిపిస్తున్నాడు అని అక్కసు వెళ్లగక్కింది. తర్వాత మాత్రం తన జెలసీని పట్టించుకోవద్దని, అలా అని పూర్తిగా పట్టించుకోకుండా ఉండొద్దని సూచించింది. హమీదాకు తినిపిస్తుంటే ఆ కోతిముఖం దానికి అవసరమా? అన్నానని చెప్పింది. దీంతో మానస్.. ఆమె తనకు ఫ్రెండ్ అని, సిస్టర్ అనమంటే కూడా అంటానని అనడంతో సంతోషపడ్డ పింకీ.. వద్దులే, ఫ్రెండ్‌లానే ఉండమని చెప్పింది. అవసరమైతే శ్రీరామ్‌కు అయినా రాఖీ కడతా కానీ నీకు మాత్రం కట్టనని మానస్‌కు తెగేసి చెప్పింది.