
బుల్లితెరపై ప్రసారం అవుతున్న బిగ్ బాస్ 5 (Bigg Boss 5)వ సీజన్ రియాలిటీ షో ఎంతో ఉత్కంఠ భరితంగా తెలుగులో కొనసాగుతోంది. హౌస్ లో ఉన్న కంటెస్టెంట్ లు ఒకరిపై ఒకరు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. సోమవారం జరిగిన నామినేషన్ ప్రక్రియ చాలా ఆసక్తికరంగా సాగింది. బిగ్ బాస్ (Bigg Boss 5 Telugu) ఐదో సీజన్ లో మొదటిసారిగా కన్ఫెషన్ రూమ్ లో నామినేషన్ ప్రక్రియను ఆరంభించాడు బిగ్ బాస్. అయితే ఆశ్చర్యంగా ఈ సారి ఎక్కువగా షణ్ముఖ్ ని టార్గెట్ చేసి మొదటిసారిగా నామినేషన్ లోకి పంపారు. ఇదిలా ఉండగా ఉన్నట్టుండి ‘గే లవ్ స్టోరీ’ ఎందుకు అంట కట్టారు అంటూ రవి మీద జెస్సీ ఫైర్ అయ్యాడు అనే దాని వివరాలకి వెళితే…
బిగ్ బాస్ హౌస్ లో నెమ్మది నెమ్మదిగా ప్రేమ చిగురిస్తుంది. ఇప్పటికే హమీదా – శ్రీరామ చంద్ర జోడి కట్టి బిగ్ బాస్ ప్రేక్షకులకి కావాల్సినంత వినోదాన్ని అందిస్తుండగా… తాజాగా ప్రియాంక సింగ్ కూడా లవ్ ట్రాక్ లో భాగమై ట్రై యాంగిల్ లవ్ స్టోరీ ని నడిపించడానికి యత్నిస్తుంది. శ్రీరామ చంద్ర – మానస్ తనకి రెండు కళ్ళు లాంటి వారని ఎన్నోసార్లు హౌస్ మేట్స్ తో కూడా చెప్పుకొచ్చింది అంట.
ఇదిలా ఉండగా… బిగ్ బాస్ మొదలయినప్పటి నుంచి జెస్సీ కి రవి కి మధ్య అంతర్ యుద్ధం నడుస్తోంది. ఈ తరుణంలో నామినేషన్ ప్రక్రియలో రవి – జెస్సీ ఇద్దరు ఒకరినొకరు నామినేట్ చేసుకుంటారు. దాని తర్వాత జెస్సీ – రవి మధ్య డీప్ డిస్కషన్ జరుగుతుంది. దానిలో భాగంగా “గే లవ్ స్టోరీ ని’ ఎలా ప్లాన్ చేస్తారని రవి మీద జెస్సీ విరుచుకు పడతాడు. సరే నిన్ను గ్రాంటెడ్ గా తీసుకుని ఉంటాం మమ్మల్ని క్షమించు అని జెస్సీ ని క్షమాపణ కోరుతాడు రవి, లోబో. ప్రియాంక కి జోడి కడితే నా లైఫ్ ఏం కావాలి అంటూ సిరి, షన్ను తో చెప్పుకొని వాపోతాడు జెస్సీ . మొత్తానికి బిగ్ బాస్ హౌస్ లో ‘ గే లవ్ స్టోరీ’ జెస్సీ ను కలవర పెట్టింది అన్నమాట.