Bigg Boss 5 Telugu: బిగ్ బాస్ ఏడో వారానికి చేరుకుంది. రోజు రోజు కి బిగ్ బాస్ లో టాస్కుల హడావిడి అంబరాన్ని అంటుకుంటు హోరా హోరీగా సాగుతుంది. అయితే తాజాగా ఏడోవారానికి సంబందించిన కెప్టెన్సీ కంటెండర్ల టాస్క్ నిన్న (మంగళవారం) మొదలైంది. ఈ నేపథ్యం లో కంటెస్టెంట్ల మధ్య వైరం అగ్గి మీద గుగ్గిలంలా రాచుకుంది. మొన్న సోమవారం జరిగిన నామినేషన్ల ప్రక్రియ జ్వరం ఇంట్లో ఉన్న ప్రతి ఒక్క కంటెస్టెంట్ కి వచ్చింది. కానీ, ఇంకా తగ్గనే లేదు.

అయితే మొన్న జరిగిన నామినేషన్ల ప్రక్రియలో సన్నీ – ప్రియాల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. నామినేషన్ల నుండి సన్నీ తన ఫ్రెండ్స్ ని కాపాడే యత్నం లో ఉన్నాడని, ఫేవిరిటిజం చూపిస్తున్నాడని ప్రియా నిరూపించాలి అని కంకణం కట్టుకుంది. సిల్లీ రీజన్ తో రవి ని నామినేట్ చెయ్యాలని భావించింది ప్రియా. అలా ప్రియా చెప్పిన సిల్లీ రీజన్ ని అంగీకరించి రవి ని నామినేషన్ లో ఉంచాడు. అలా ప్రియా పన్నిన వలలో సన్నీ కాలుజారి పడ్డాడు.

ముందు నుండే ఎడమొఖం పెడ ముఖం లా ఉండే సన్నీ – ప్రియాల మధ్య వైరం రోజు రోజు కి పెరుగుతూ పోతుంది. ఈ క్రమం లోనే మళ్ళీ నామినేషన్ల రూపంలో వీళ్ళదిరి మధ్య వైరం దాపురించింది. అయితే ఈ నేపథ్యంలో సన్నీ మీద కి కాళ్ళు రువ్వుతూ చెంప పగలకొడతా అంటూ ప్రియా శివాలెత్తినట్టు కనిపిస్తుంది ప్రోమో లో. మరి కొట్టిందో లేదో చూడాలంటే ఇవ్వాళ జరిగే ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
