బుల్లితెరపై దూసుకుపోతోంది బిగ్ బాస్ షో. దేశవ్యాప్తంగా అత్యంత ప్రజాదరణ పొందింది ఈ తెలుగు బిగ్ బాస్. ఇప్పటికే రెండు వారాలు పూర్తిగా కాగా.. మూడో వారం ఎలిమినేషన్ దశకు వచ్చేసింది. మొదటి వారం ‘సరయు’, రెండో వారం బూతులతో రెచ్చిపోయిన ‘ఉమాదేవి’ ఎలిమినేట్ అయిపోయింది. మూడో వారం ఎవరు ఎలిమినేట్ అవుతారన్నది ఉత్కంఠగా మారింది.

బిగ్ బాస్ లో ఈ వారం నామినేషన్స్ లో ఐదుగురు కంటెస్టెంట్లు ఉన్నారు. వాళ్లలో ఎవరు ఎలిమినేట్ అవుతారన్న దానిపై ఊహాగానాలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటివరకు ఎలిమినేషన్ పై ఓ అంచనా రాగా.. ఈ వారం ఓటింగ్ లో భారీ ట్విస్టులు మొదలయ్యాయని తెలుస్తోంది. మూడో వారం ఆ ఇద్దరిలో ఒకరు ఎలిమినేట్ కాబోతున్నారనే టాక్ వినిపిస్తోంది.
ఈ వారం బిగ్ బాస్ లో ప్రియ, ప్రియాంక సింగ్, మానస్, శ్రీరామచంద్ర, లహరిలు నామినేట్ అయ్యారు. మూడో వారం నామినేషన్స్ సమయంలో కొందరు కంటెస్టెంట్లు శృతి మించి మాట్లాడారు. ముఖ్యంగా సీనియర్ నటి ప్రియ.. కంటెస్టెంట్లు లహరి, యాంకర్ రవి బాత్రూంలో కౌగిలించుకున్నారని తీవ్ర ఆరోపణలు చేసింది. దీనిపై హౌస్ లోని ఇంటి సభ్యులంతా ప్రియపై విరుచుకుపడ్డారు. అత్యంత వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన ప్రియ ఈ వారం ఎలిమినేట్ అని అందరూ అనుకున్నారు.
మూడో వారానికి సంబంధించిన పోలింగ్ లో భారీ ట్విస్టులు నెలకొన్నాయి. అత్యధికంగా పోలింగ్ లో ‘మానస్’ ఉన్నారని సమాచారం. ఇక ప్రియ రెండో స్థానంలో ఉన్నట్టు తెలిసింది. ఇక ప్రియాంక సింగ్ కు కూడా భారీగా ఓట్లు పడినట్లు ప్రచారం సాగుతోంది. ఆమె మూడో స్థానంలో ఉందని తెలుస్తోంది.
ఇక చివరి రెండు స్థానాల్లో శ్రీరామచంద్ర, లహరి ఉన్నట్టు తెలుస్తోంది. అందరికంటే తక్కువగా లహరికి ఓట్లు వచ్చాయని అంటున్నారు. ఆ తర్వాత శ్రీరామచంద్రకు తక్కువ ఓట్లు పడ్డాయని సమాచారం. వీళ్లిద్దరిలో ఒకరు ఎలిమినేట్ అయ్యే అవకాశాలు ఉన్నాయని పోలింగ్ ను బట్టి తెలుస్తోంది. అయితే బిగ్ బాస్ అంటేనే అనూహ్య మలుపులు.. వీరిద్దరిలో ఎవరు ఎలిమినేట్ అవుతారన్నది వేచిచూడాల్సిందే.