https://oktelugu.com/

బిగ్ బాస్: ఎవరు ఎంతవరకు మోసారో !

బుల్లితెర ప్రేక్ష‌కుల‌ని ఎంత‌గానో అల‌రిస్తున్న బిగ్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజ‌న్4 లో ఇస్తున్న టాస్క్‌లు ఈ మధ్య బాగా ఆస‌క్తిక‌రంగా ఉండటంతో రోజురోజుకూ షో పై ప్రేక్షకుల్లో ఆసక్తి రెట్టింపు అవుతోంది. ముఖ్యంగా టాస్క్ ల్లో కొన్ని మెద‌డుతో ఆలోచించి ఆడాల్సి ఉండ‌గా, మ‌రికొన్ని భుజ బ‌లంతో పూర్తి చేయాల్సి ఉండటంతో షో రసవత్తరంగా మారింది. అయితే ఫిజిక‌ల్ టాస్క్‌ల‌లో అమ్మాయిల‌తో పాటు అభిజీత్ బలమైన ప్ర‌ద‌ర్శ‌న ఇవ్వలేకపోతున్నాడు. కానీ సోహైల్, మెహ‌బూబ్, అఖిల్‌లు […]

Written By:
  • admin
  • , Updated On : November 20, 2020 / 06:52 PM IST
    Follow us on


    బుల్లితెర ప్రేక్ష‌కుల‌ని ఎంత‌గానో అల‌రిస్తున్న బిగ్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజ‌న్4 లో ఇస్తున్న టాస్క్‌లు ఈ మధ్య బాగా ఆస‌క్తిక‌రంగా ఉండటంతో రోజురోజుకూ షో పై ప్రేక్షకుల్లో ఆసక్తి రెట్టింపు అవుతోంది. ముఖ్యంగా టాస్క్ ల్లో కొన్ని మెద‌డుతో ఆలోచించి ఆడాల్సి ఉండ‌గా, మ‌రికొన్ని భుజ బ‌లంతో పూర్తి చేయాల్సి ఉండటంతో షో రసవత్తరంగా మారింది. అయితే ఫిజిక‌ల్ టాస్క్‌ల‌లో అమ్మాయిల‌తో పాటు అభిజీత్ బలమైన ప్ర‌ద‌ర్శ‌న ఇవ్వలేకపోతున్నాడు. కానీ సోహైల్, మెహ‌బూబ్, అఖిల్‌లు మాత్రం చెప్పుకోద‌గ్గ ప్ర‌ద‌ర్శ‌న ఇస్తున్నారు. ఒకరి మీద ఒకరు చూపిస్తున్న కోపం మొత్తానికి షో పీఆర్పీ రేటింగ్ ను రెట్టింపు చేస్తోంది.

    Also Read: అక్కడ కూడా మహేశ్ బాబు ‘మైండ్‌ బ్లాక్‌’ చేస్తాడా.?

    దీనికితోడు రోజులు ద‌గ్గ‌ర‌ప‌డుతున్న కొద్ది హౌజ్‌మేట్స్ లో స్నేహపూర్వక వాతావ‌ర‌ణం కూడా మారిపోతుంది. బిగ్ బాస్ కూడా వారి మధ్య విభేదాలు పెరగటానికి తన వంతు పాత్ర తానూ నిర్వహిస్తూ ముందుకుపోతున్నాడు. దాంతో ప్ర‌తి ఒక్క‌రూ తప్పని పరిస్థితుల్లో త‌మ గేమ్‌ పై ఫుల్ ఫోక‌స్ పెడుతూ పోటీ ఇవ్వడానికి ప్లాన్డ్ గా రెడీ అవుతున్నారు. ఇక ఈ వారం ఇంటి స‌భ్యుల ఫ్యామిలీస్ హౌజ్‌లోకి ఎంట్రీ ఇవ్వ‌డంతో బిగ్ బాస్ హౌజ్ క‌ళ‌క‌ళలాడింది. అదే విధంగా కంటెస్టెంట్స్‌ల ముఖాల‌లో కూడా ఆనందం వెల్లివిరుస్తోంది. షోలో డ్రామాను పండించడానికి ఇది బాగా పనికొస్తుంది.

    Also Read: ‘పుష్ప’తో బన్నీ స్టైల్.. ఇమేజ్ మారనుందా?

    ముఖ్యంగా ఇన్నాళ్ళ పాటు త‌మ కుటుంబానికి దూరంగా ఉన్న హౌజ్‌మేట్స్ త‌మ ఫ్యామిలీని చూసే స‌రికి ఆనంద బాష్పాలు కారుస్తూ.. షోలో సెంటిమెంట్ ను వండి వడ్డిస్తున్నారు. అంద‌రి ఇంటి స‌భ్యుల ఫ్యామిలీలు ఇంట్లోకి రాగా, లాస్య భ‌ర్త మంజునాథ్ ఈ రోజు హౌజ్‌లో సంద‌డి చేయ‌బోతున్నాడు. ఇక ఈ వారం కెప్టెన్సీ టాస్క్‌లో భాగంగా త‌మ భుజాల‌పైకి ఎవ‌రినైన ఎక్కించుకొని నుంచోవాల్సి వుంటుంది. అలా ఎవ‌రైతే ఎక్కువ సేపు ఉంటారో వారు కెప్టెన్ బాధ్య‌తలు అందుకుంటారు అన్నమాట. ఇందులో భాగంగా సోహైల్ .. అఖిల్‌ని త‌న భుజాల‌పైకి ఎక్కించుకోగా, అవినాష్‌- అభిజిత్‌, మోనాల్‌-హారిక‌ల‌ని మోసేశారు. మరి ఎంతవరకు మోసారో చివ‌రివ‌ర‌కూ ఎవరు బ‌రిలో ఉండి.. ఎవరు కెప్టెన్ అవుతారో చూడాలి.

    మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్