
బుల్లితెర రియల్టీ షో బిగ్ బాస్-4 ప్రారంభమై ఇప్పటికే ఐదువారాలు గడిచిపోయాయి. దీంతో క్రమంగా కంటెస్టెంట్ల మధ్య వేడిరాజేసుకుంటోంది. ఇప్పటికే పలువురు కంటెస్టులు బిగ్ బాస్ హౌస్ నుంచి వెళ్లిపోగా.. మరికొందరు వైల్డ్ కార్డు ఎంట్రీ ఇచ్చారు. ఇక వారంవారం కొనసాగుతున్న ఎలిమినేషన్ ప్రక్రియ ఉత్కంఠగా మారుతోంది. ఎవరికీ వారు బిగ్ బాస్ హౌస్ ఉండేందుకు ప్రయత్నిస్తుండటంతో గేమ్ రసవత్తరంగా మారుతోంది.
Also Read: సంజయ్ దత్ డైలాగ్స్ ప్రత్యేకమట !
కిందటి వారం బిగ్ బాస్ హౌస్ నుంచి జోర్దార్ సుజాత ఎలిమినేట్ అయింది. ఆమె వెళుతూ వెళుతూ సొహైల్ పై బిగ్ బాంబ్ పేల్చింది. అయితే ఈ వారం బిగ్ బాస్ కెప్టెన్ గా సొహైల్ అయ్యాడు. ఈవారం అంట్లుతోమేపని సొహైల్ వచ్చింది. దీంతో కెప్టెన్ అయి కాలుమీద కాలేసుకొని కుర్చుదాం అనుకుంటే అంట్లు మొత్తం కడగాల్సి వస్తోందని వాపోయాడు. అయితే వంట పాత్రలు మాత్రమే కడుగుతా కానీ కప్పులు కడగనుంటూ మెలిక పెట్టాడు. అయితే అఖిల్ కప్పు నేను కడుగుతా.. పక్కన పెట్టు అని మోనాల్ చెప్పింది.
ఈ సందర్భంగా అమ్మరాజశేఖర్ మాట్లాడుతూ హౌస్ లో ఇప్పటివరకు ఎవరు వంట పాత్రలను క్లీన్ చేసినా ఇబ్బందులు రాలేదన్నాడు. కానీ నువ్వు మొదలుపెట్టిన తరువాత పాత్రలు శుభ్రంగా ఉండటం లేదని రాజశేఖర్ అనడంతో సొహైల్ స్పందిస్తూ ఇక రోజు నువ్వే వంట పాత్రలు శుభ్రం చెయ్యి.. ఇప్పటి నుంచి కప్పులు ఎవరూ కడగకండి.. మాస్టర్ కడిగేస్తాడు అంటూ బిగ్గరగా అరిచాడు. దానికి అమ్మ రాశేఖర్ నేను కడిగేస్తానులే అని చెప్పాడు.
ఈక్రమంలోనే సొహైల్‌కి అరియానా ఏదో చెప్పబోయింది. అయితే సొహైల్ వినకుండా ముఖంపై ఒకరకమైన ఎక్స్‌ప్రెషన్ ఇచ్చాడు. దీంతో అరియానా అతడిపై ఫైర్ అయింది. దీన్నే అతి అంటారని మండిపడింది. కెప్టెన్ అన్నప్పుడు అందరి మాట వినాలి.. పెద్ద పొగరు అంటూ కామెంట్ చేసింది. దీంతో సొహైల్ సహనం కోల్పోయాడు. అయితే కిందటి వారం నాగార్జున.. ఆడపిల్లలపై ఎవరూ అరవొద్దని హెచ్చరించాడు. దీంతో ఆవిషయాన్ని బాగా మైండ్‌లో పెట్టుకున్నట్టు ఉన్నాడు సొహైల్.
Also Read: పవన్ సినిమా కోసం భారీ సెట్ !
సొహైల్ తన యాటిట్యూడ్‌కి భిన్నంగా కూల్‌గానే స్పందించాడు. అరియానా వదలకుండా రచ్చ చేయడం అతడికి విసుగు తెప్పించింది. వీరిమధ్యలో కుమార్ సాయి కల్పించుకున్నాడు. వేలు చూపిస్తూ అడగడంతో.. సొహైల్, కుమార్ సాయిని వేలు దించమన్నాడు. ఎంత దించాలంటూ కుమార్ సాయి చాలా వెటకారంగా అనడం వెగటు తెప్పించింది.
ఆ తరువాత బిగ్‌బాస్ కెమెరా ముందుకు వెళ్లి అరియానాపై కంప్లైంట్ చేశాడు. అరియానా కూడా బిగ్‌బాస్‌కు వివరణ ఇచ్చింది. దీంతో అరియానా-సొహైల్-కుమార్ మధ్య వాగ్వాదం హౌస్ లో రచ్చో రచ్చః అన్నట్లు సాగింది.