https://oktelugu.com/

Big Boss 5 Telugu: ఒక్క ఎపిసోడ్ తో మారిన ఓటింగ్స్.. టాప్ లోకి వెళ్ళిన ఆ కంటెస్టెంట్.. డేంజర్ లో ఉన్న స్ట్రాంగ్ కంటెస్టెంట్?

Big Boss 5 Telugu: బిగ్ బాస్ హౌస్ లో ఉన్నటువంటి కంటెస్టెంట్ లు ఎప్పుడు ఎవరు డేంజర్ జోన్ లోకి వస్తారు ఎవరు సేఫ్ జోన్ లోకి వెళ్తారు అనేది వారి ఫర్ఫార్మెన్స్ బట్టి ఉంటుంది. ఇక ఈ వారం నామినేషన్స్ లో ఉన్న వారిలో ఇప్పటివరకు సిరి, కాజల్, మానస్ డేంజర్ జోన్ లో ఉన్నట్లు పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి. అయితే తాజాగా జరిగిన ఎపిసోడ్ మాత్రం అందరి ఓటింగ్ […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : December 10, 2021 / 11:18 AM IST
    Follow us on

    Big Boss 5 Telugu: బిగ్ బాస్ హౌస్ లో ఉన్నటువంటి కంటెస్టెంట్ లు ఎప్పుడు ఎవరు డేంజర్ జోన్ లోకి వస్తారు ఎవరు సేఫ్ జోన్ లోకి వెళ్తారు అనేది వారి ఫర్ఫార్మెన్స్ బట్టి ఉంటుంది. ఇక ఈ వారం నామినేషన్స్ లో ఉన్న వారిలో ఇప్పటివరకు సిరి, కాజల్, మానస్ డేంజర్ జోన్ లో ఉన్నట్లు పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి. అయితే తాజాగా జరిగిన ఎపిసోడ్ మాత్రం అందరి ఓటింగ్ తలకిందులు చేసిందనే చెప్పాలి. ఇక ఓటింగ్ కి ఒక రోజు మిగిలి ఉండడంతో ఎంతో మంది ప్రేక్షకులు ఓటింగ్ విషయంలో ఆసక్తి చూపిస్తూ వారి అభిమాన కంటెస్టెంట్ లకు భారీగా ఓట్లు వేస్తారు. ఇలా వారి అభిమాన కంటెస్టెంట్ లకు భారీగా ఓట్లు వేసి వారిని సేవ్ చేసే పనిలో ఉన్నారు.

    Big Boss 5 Telugu

    తాజాగా జరిగిన ఎపిసోడ్ డేంజర్ జోన్ లో ఉన్నటువంటి సిరి ఏకంగా టాప్ 3 పోజిషన్ కి వెళ్లిందని సమాచారం. ఈ వారం మొత్తం షణ్ముఖ్ ఆమెను ఎక్కువగా తిడుతూ తననీ కమాండ్ చేయడం వల్ల ఈమెకు ప్లస్ అయ్యిందని ఇందుకే ఓట్లు ఎక్కువగా పడటం వల్ల మూడో స్థానానికి వెళ్లిందనే సమాచారం వినపడుతోంది. అలాగే శ్రీ రామచంద్ర, కాజల్ మధ్య గొడవ జరగడంతో ఈ గొడవ కాజల్ కి మైనస్ అయిందని చెప్పవచ్చు. ఇక ఈ వారం మొదటి నుంచి మానస్ డేంజర్ జోన్ లోనే ఉన్నారు.

    Also Read: ఇదేం శాడిజం రా బాబు… వాళ్ళిద్దరినీ ఎలిమినేట్ చేయండి బిగ్ బాస్

    ప్రస్తుతం ఉన్న ఓటింగ్ ప్రకారం ఈవారం మానస్, కాజల్ ఇద్దరూ డేంజర్ జోన్ లో ఉన్నారని తెలుస్తుంది. మరి వీరిద్దరిలో ఈవారం హౌస్ నుంచి ఎవరు బయటకు వెళ్తారు అనే విషయంపై ఎంతో ఉత్కంఠత నెలకొందని చెప్పవచ్చు. ఒకవేళ కాజల్ బయటకు వెళ్తే మానస్ టాప్ ఫైవ్ లో ఉంటారు లేదా కాజల్ టాప్ ఫైవ్ లో ఉంటుంది. మరి వీరిద్దరిలో ఎవరు బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వెళ్తారు? ఎవరు టాప్ ఫైవ్ లో ఉంటారు అనే విషయం తెలియాలంటే మరికొన్ని రోజులు వేచి ఉండాలి.

    Also Read: హెల్ప్ చేద్దామనుకున్నా.. కానీ నేనే బయటకు వచ్చేసా..షణ్ముక్‌పై రవి ఇంట్రెస్టింగ్ కామెంట్స్..