https://oktelugu.com/

Bigg Boss 7 Telugu: శోభ చేసిన పనికి బిగ్ బాస్ సీరియస్… గంటసేపు ఆ పని చేయాలని అందరికీ పనిష్మెంట్!

ఫినాలే రేస్ ముగింపు దశకు చేరుకుంది. ఇక ఇందులో భాగంగా పోటీ దారులకు మరో టాస్క్ ఇచ్చారు బిగ్ బాస్. దీనికి సంబంధించిన తాజా ప్రోమోలో ముందుగా గౌతమ్ .. శోభా గురించి చెప్తూ .. నిన్నటి నుంచి అడిగిందే పది సార్లు అడిగింది.

Written By: , Updated On : December 2, 2023 / 12:12 PM IST
Bigg Boss 7 Telugu

Bigg Boss 7 Telugu

Follow us on

Bigg Boss 7 Telugu: బిగ్ బాస్ ఇంటి మొదటి ఫైనలిస్ట్ అయేందుకు కంటెస్టెంట్స్ తెగ కష్టపడి పోతున్నారు. మొత్తం ఎనిమిది మందితో మొదలైన ఫినాలే రేస్ నుంచి శివాజీ,శోభా, ప్రియాంక, యావర్ లు తప్పుకున్నారు. అలాగే స్కోర్ బోర్డు లో లీస్ట్ లో ఉండటంతో గౌతమ్ కూడా రేస్ నుంచి తప్పుకున్నాడు. అందరికంటే టాప్ స్కోర్ తో అమర్ దీప్ మొదటి స్థానంలో దూసుకెళ్తున్నాడు. ప్రశాంత్ స్కోర్ బోర్డు లో రెండవ స్థానంలో ఉన్నాడు. అర్జున్ మూడవ స్థానంలో ఉన్నాడు.

అయితే ఫినాలే రేస్ ముగింపు దశకు చేరుకుంది. ఇక ఇందులో భాగంగా పోటీ దారులకు మరో టాస్క్ ఇచ్చారు బిగ్ బాస్. దీనికి సంబంధించిన తాజా ప్రోమోలో ముందుగా గౌతమ్ .. శోభా గురించి చెప్తూ .. నిన్నటి నుంచి అడిగిందే పది సార్లు అడిగింది. నన్ను చూసి ఏడుపు పెట్టుకుని తిరుగుతుంది అంటూ అర్జున్, శివాజీ లతో చెప్పాడు గౌతమ్. తర్వాత శోభా .. ‘ నువ్వు పాయింట్లు ఇవ్వాలి అనుకున్నప్పుడు డైరెక్ట్ గా ఇచ్చేస్తే సరిపోతుంది. అలా చెప్పించి ఇవ్వడం నాకు నచ్చలేదు అని ప్రియాంక తో చెప్పింది శోభ.

ఇక రేస్ లో భాగంగా పదవ ఛాలెంజ్ ఇచ్చారు బిగ్ బాస్. ‘సార్ట్ మీ అవుట్ ‘ అనే ఈ ఛాలెంజ్ లో పోటీ దారులు గజిబిజిగా ఉన్న కలర్ బాల్స్ ను క్రమంలో పెట్టాల్సి ఉంటుంది. ఇలా బాల్స్ అన్ని వాటి రంగుకు అనుగుణంగా ఎరేంజ్ చేసి గంట కొట్టాలి. ఈ టాస్క్ లో అర్జున్ అందరికంటే ముందు గంట కొట్టాడు. తర్వాత ప్రశాంత్ గంట కొట్టాడు. కానీ ప్రశాంత్ తొందర్లో బాల్స్ కింద పడేశాడు, దాంతో అతడు డిస్ క్వాలిఫై అయ్యాడు.

అయితే ఈ టాస్క్ ముగిశాక శోభా .. బిగ్ బాస్ టాస్క్ కోసం పెట్టిన బాల్స్ తో ఆడుకుంటూ కనిపించింది. దీంతో శోభ మీకు పనిష్మెంట్ ఇవ్వాలి .. లివింగ్ ఏరియా కి రండి అని బిగ్ బాస్ వార్నింగ్ ఇచ్చాడు. దీంతో భయపడుతూ శోభతో పాటు మిగిలిన ఇంటి సభ్యులు కూడా లివింగ్ ఏరియా లో కూర్చున్నారు. శోభ కారణంగా మీకు పనిష్మెంట్ ఇస్తున్నాను అంటూ భయపెట్టారు బిగ్ బాస్. ఇంతలోనే గంట సేపు అందరూ నిద్రపోవాలని కంటెస్టెంట్స్ ని సర్ప్రైజ్ చేశారు. దీంతో హౌస్ మేట్స్ ఫుల్ ఖుష్ అయ్యారు. బిగ్ బాస్ హౌస్లో సరైన నిద్ర ఉండదు. నిర్ణీత సమయానికి ముందే నిద్రపోతే కుక్కలు అరుస్తాయి.