Bigg Boss 6 Telugu- Revanth: ఈ వారం బిగ్ బాస్ హౌస్ లో కెప్టెన్సీ టాస్కు చాలా ఉత్కంఠ వాతావరణం మధ్య కొనసాగింది..కెప్టెన్సీ టాస్కులో భాగంగా ‘ల్యాడర్ vs స్నేక్’ టీమ్స్ నుండి వివిధ రౌండ్స్ తర్వాత ఫిల్టర్ అయ్యాకా శ్రీ సత్య , మరీనా , ఫైమా , రోహిత్, కీర్తి పోటీదారులవ్వగా రేవంత్ సంచలాక్ గా వ్యవహరించాడు..కెప్టెన్సీ పోటీ దారులకు బిగ్ బాస్ ‘వస్తా నీ వెనుక’ అనే టాస్కు ని నిర్వహిస్తాడు..ఈ టాస్కులో బస్తాలను భుజానికి తగిలించుకొని సర్కిల్స్ చుట్టూ తిరగాలి.

అలా పోటీదారులు తమ బస్తాలను కాపాడుకుంటూ సర్కిల్స్ చుట్టూ తిరుగుతుండగా బిగ్ బాస్ ఆట మధ్యలో ఎవ్వరు కూడా తమ బస్తాలను కాపాడుకునేందుకు చేతులు ఉపయోగించకూడదు అని చెప్తాడు..అయితే ఈ విషయం లో రోహిత్ చాలా పక్షపాతం చూపిస్తాడు..నిన్న కెప్టెన్సీ టాస్కులో జరిగిన గొడవతో పూర్తిగా ఆట మీద ఆసక్తి కోల్పోయిన రేవంత్ తనకి ఇష్టమొచ్చినట్టు ప్రవర్తించడం ఇంటి సభ్యుల సహనం కి పరీక్ష పెట్టింది.
బిగ్ బాస్ చెప్పిన రూల్ ని అతిక్రమించి ఆదిరెడ్డి తన బస్తాని కాపాడుకునేందుకు చేతులు ఉపయోగిస్తాడు..అప్పుడు రేవంత్ ఏ మాత్రం స్పందించడు..కానీ రోహిత్ చేతులుపెట్టకపోయిన కూడా అతనిని టాస్కు నుండి తొలగిస్తాడు రేవంత్..దీనితో కోపం కట్టలు తెంచుకున్న రోహిత్ తన బస్తా ని విసిరికొట్టి ‘నేను కేవలం చేతులు వెనక్కి పెట్టుకుంటే బస్తాని తాకినట్టు అంట..ఆది రెడ్డి రెండు చేతులతో ముందు పట్టుకున్నది కనిపిస్తున్నా కూడా అతను ముట్టుకోలేదట’ అంటూ ఆవేశం తో ఊగిపోతాడు.

అప్పుడు మరీనా ‘వదిలేయ్ రోహిత్..జనాలు మొత్తం చూస్తున్నారు..వాళ్ళు చూసుకుంటారులే’ అంటుంది..అప్పుడు రేవంత్ కూడా ‘ఆ చూస్తున్నారు’ అని బదులు ఇస్తాడు..అలా వింతగా ప్రవర్తిస్తున్న రేవంత్ ని బిగ్ బాస్ కన్ఫెషన్ రూమ్ కి పిలుస్తాడు..కన్ఫెషన్ రూమ్ లో బిగ్ బాస్ రేవంత్ తో ఏమి మాట్లాడాడు అనేది తెలియాంటే ఈరోజు రాత్రి వరుకు ఆగాల్సిందే..దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియా వైరల్ గా మారింది.