
Bhuma Maunika: మంచు మోహన్ బాబు రెండవ కుమారుడు మంచు మనోజ్ ఇటీవలే దివంగత నేత భూమా నాగి రెడ్డి రెండవ కుమార్తె భూమా మౌనిక రెడ్డి ని పెళ్లాడిన సంగతి తెలిసిందే.పెద్దగా హంగులు ఆర్భాటాలు లేకుండా చాలా సింపుల్ గా ఈ వివాహం కొంతమంది బంధుమిత్రుల సమక్ష్యం లో జరిగిపోయింది.ఇప్పటికీ ఈ పెళ్ళికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియా లో బాగా ట్రెండ్ అవుతున్నాయి.మనోజ్ – మౌనిక లు కలిసి ఇటీవలే కొత్త ఇంట్లోకి గృహ ప్రవేశం చేసారు.
అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియా లో వైరల్ గా ట్రెండ్ అవుతుంది.ఈ వీడియో లో భూమా మౌనిక వీపుపై ఉన్న టాటూ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.దీని గురించే ఇప్పుడు సోషల్ మీడియా లో ఎక్కడ చూసినా చర్చ నడుస్తుంది.ఇంతకీ ఆ టాటూ ఎవరిదీ అనే విషయం పై ఇప్పుడు సోషల్ మీడియా లో ప్రచారం అవుతున్న ఒక వార్త అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తుంది.
అసలు విషయానికి వస్తే మౌనిక రెడ్డి గతం లో గణేష్ రెడ్డి అనే అతనిని పెళ్లాడింది.ప్రారంభం లో వీళ్లిద్దరి దాంపత్య జీవితం సజావుగానే సాగినప్పటికీ ఆ తర్వాత మాత్రం కొన్నేళ్ళకు తరచూ విభేదాలు రావడం తో రెండేళ్ల క్రితమే విడాకులు ఇచ్చింది.ఇక ఆ తర్వాత మనోజ్ తో ప్రేమలో పది అతనితో కొనేళ్లు డేటింగ్ చేసి ఈమధ్యనే వివాహం చేసుకుంది.మొదటి భర్త తో విడాకులు తీసుకున్నా కూడా అతని తాలూకు కొన్ని జ్ఞాపకాలు మౌనిక తోనే ఉన్నాయి.

ఒకటి వాళ్ళిద్దరి దాంపత్య జీవితానికి ఫలితంగా పుట్టిన ఒక బిడ్డ, మరియు భూమా మౌనిక వీపు పై మొదటి భర్త పేరుతో టాటూ.ఈ రెండిటిని మనోజ్ సహృదయం తో స్వీకరించడం సర్వత్రా ప్రశంసల వర్షం కురుస్తుంది.మొదటి నుండి మనోజ్ అంటే నెటిజెన్స్ కి ఎంతో ఇష్టం ఉండేది, ఈ సంఘటన ద్వారా ఆ ఇష్టం మరింత రెట్టింపు అయ్యింది.