Bheems Ceciroleo Remuneration: సినిమా ఇండస్ట్రీ అనగానే ప్రతి ఒక్కరికి స్టార్ హీరోలు మాత్రమే గుర్తుకొస్తారు. వాళ్లను చూసే ప్రేక్షకులు థియేటర్ కి వస్తారు. కాబట్టి వాళ్లకు ఇండస్ట్రీలో మార్కెట్ విపరీతంగా ఉంటుంది. ఒక సినిమా సక్సెస్ అవ్వాలంటే హీరోలతో పాటు దర్శకులతో పాటు మ్యూజిక్ డైరెక్టర్ కూడా కీలకపాత్ర వహిస్తాడనే విషయంలో చాలా మందికి తెలియదు. సినిమాలో సాంగ్స్ సూపర్ హిట్ అయినప్పుడే ఆ సినిమా మీద బజ్ క్రియేట్ అవుతుంది. తద్వారా సినిమాని చూడడానికి ప్రేక్షకులు ఆసక్తి చూపిస్తూ ఉంటారు. ఇక సినిమాలో బ్యాగ్రౌండ్ స్కోర్ కూడా ఆ సినిమా రేంజ్ ను మారుస్తుంది. కేవలం బ్యాగ్రౌండ్ మ్యూజిక్ తోనే సూపర్ సక్సెస్ అయిన సినిమాలు సైతం ఇండస్ట్రీ లో చాలానే ఉన్నాయి. ఇక ఇలాంటి సందర్భంలో ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ అయిన భీమ్స్ ప్రస్తుతం తన పాటలతో బ్యాగ్రౌండ్ మ్యూజిక్ తో ప్రేక్షకులను అలరిస్తున్నాడు. ‘మన శంకర వరప్రసాద్’ సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్ తనే కావడంతో పాటలన్నీ అద్భుతంగా ఉన్నాయి. బ్యాగ్రౌండ్ స్కోర్ విషయంలో కూడా చాలా మంచి గుర్తింపు వచ్చింది.
కాబట్టి ఆయన ఒక్కసారిగా టాప్ మ్యూజిక్ డైరెక్టర్ గా మారిపోయాడు. ఇక ప్రస్తుతం అతని రెమ్యునరేషన్ కూడా భారీ రేంజ్ లో పెంచినట్టుగా తెలుస్తోంది… రవితేజ హీరోగా చేసిన ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ సినిమాకి సైతం అతనే మ్యూజిక్ డైరెక్టర్ గా వ్యవహరించాడు.
ఆ సినిమా రీసెంట్ గా రిలీజ్ అయింది. ఆ సినిమా కూడా పాజిటివ్ టాక్ ను సంపాదించుకొని ముందుకు దూసుకెళ్తుండటంతో ఈ సంక్రాంతికి రెండు సినిమాలను మ్యూజికల్ హిట్స్ గా నిలిపిన బీమ్స్ ఇప్పుడు ఒక సినిమా కోసం దాదాపు మూడు నుంచి నాలుగు కోట్ల వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్టుగా తెలుస్తోంది…
‘సంక్రాంతి వస్తున్నాం’ సినిమా ముందు వరకు అతను కేవలం 50 లక్షలు రెమ్యునరేషన్ తీసుకున్నాడు. సంక్రాంతికి వస్తున్నాం సినిమా సూపర్ సక్సెస్ అయిన తర్వాత రెండు కోట్ల వరకు రెమ్యూనరేషన్ ఛార్జ్ చేశాడు. ప్రస్తుతం అతనికి బ్లాక్ బస్టర్ మ్యూజికల్ హిట్స్ పడటంతో 4 కోట్ల వరకు రెమ్యునరేషన్ ను పెంచినట్టుగా తెలుస్తోంది… ఇప్పుడు స్టార్ హీరోలు సైతం తమ సినిమాలకు భీమ్స్ ను మ్యూజిక్ డైరెక్టర్ గా పెట్టుకోవాలనే ప్రయత్నంలో ఉన్నారు…