Bheemla Nayak: పవన్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్.. రానా ‘డేనియల్ శేఖర్’ టీజర్ ఎప్పుడంటే?

Bheemla Nayak: పవర్ స్టార్ పవర్ ప్యాక్డ్ పర్ ఫామెన్స్ ను రాబట్టాలే కానీ ఇండస్ట్రీ రికార్డులు బద్దలవుతాయి. అలాంటి అసలు సిసలు సినిమాలు కొన్నే వస్తాయి. గబ్బర్ సింగ్, వకీల్ సాబ్ సినిమాల్లో పవన్ వీరావేశాన్ని చూశాం. ఇప్పుడు ‘భీమ్లా నాయక్’లోనూ పవన్ ను పోలీస్ గెటప్ లో రచ్చ చేసిన తీరు అభిమానుల్లో ఈ సినిమాపై అంచనాలను పెంచేసింది . ఇప్పటికే విడుదలైన ‘భీమ్లా నాయక్’ టీజర్, పాట హైలెట్ గా నిలిచింది.పవన్, రానా […]

Written By: NARESH, Updated On : September 14, 2021 10:40 am
Follow us on

Bheemla Nayak: పవర్ స్టార్ పవర్ ప్యాక్డ్ పర్ ఫామెన్స్ ను రాబట్టాలే కానీ ఇండస్ట్రీ రికార్డులు బద్దలవుతాయి. అలాంటి అసలు సిసలు సినిమాలు కొన్నే వస్తాయి. గబ్బర్ సింగ్, వకీల్ సాబ్ సినిమాల్లో పవన్ వీరావేశాన్ని చూశాం. ఇప్పుడు ‘భీమ్లా నాయక్’లోనూ పవన్ ను పోలీస్ గెటప్ లో రచ్చ చేసిన తీరు అభిమానుల్లో ఈ సినిమాపై అంచనాలను పెంచేసింది .

ఇప్పటికే విడుదలైన ‘భీమ్లా నాయక్’ టీజర్, పాట హైలెట్ గా నిలిచింది.పవన్, రానా నటిస్తున్న మల్టీ స్టారర్ మూవీపై అభిమానుల్లో భారీ అంచనాలున్నాయి. వచ్చే సంక్రాంతికి విడుదల కానున్న ఈ మూవీ నుంచి ఇప్పటికే హీరో పవన్ టీజర్ రిలీజ్ అయ్యింది. లుంగీలో విలన్ ఇలాకాకు వచ్చి ఇరగదీసే ఫైట్ సీన్ ఆకట్టుకుంది.

ఇప్పుడు తాజాగా విలన్ రానాను ఇంట్రడ్యూస్ చేసే టీజర్ ను రెడీ చేశారట.. రానా ఈ సినిమాలో ‘డేనియల్ శేఖర్’ అనే పాత్రలో నటిస్తున్నాడు. పవన్ ట్రైలర్ లో చివరలో ‘డేనియల్ శేఖర్’ డైలాగ్ వినిపిస్తే పోటీగా ‘అయితే ఏంటి భీమ్లా నాయక్.. కింద క్యాప్షన్ లేదు’ అంటూ పవన్ వినిపించారు.

ఇప్పుడు తాజాగా టీజర్ లో విలన్ రానా ‘డేనియల్ శేఖర్’ టీజర్ ను రెడీ చేస్తున్నారట.. ఈ మేరకు విడుదలకు ముహూర్తం కూడా ఖరారు చేశారట.. సెప్టెంబర్ 17న డేనియల్ శేఖర్ గా రానాను పరిచయం చేయబోతున్నారట.. ఈ మేరకు టీజర్ కట్ చేస్తున్నట్టు సమాచారం.

భీమ్లా నాయక్ మూవీలో పవన్, రానాలతోపాటు నిత్యా మీనన్, ఐశ్వర్య రాజేశ్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. సాగర్ కే చంద్ర దర్శకత్వం వహిస్తుండగా.. త్రివిక్రమ్ స్క్రీన్ ప్లే, మాటలు సమకూర్చారు. ఎస్ రాధాకృష్ణ ఈ ప్రాజెక్టును నిర్మిస్తున్నారు. థమన్ సంగీతం అందిస్తున్నారు. ఆల్ మోస్ట్ త్రివిక్రమ్ కంట్రోల్ లోనే ఈ సినిమా నడుస్తోంది. వచ్చే సంక్రాంతికి మూవీని రిలీజ్ చేయబోతున్నారు.