https://oktelugu.com/

Bheemla Nayak: భీమ్లానాయక్​ మాస్​ టీజర్​ రిలీజ్​ అప్పుడేనా?

Bheemla Nayak: పవర్ స్టార్ పవన్ కల్యాణ్ అప్ కమింగ్ మూవీ ‘బీమ్లా నాయక్’. సంక్రాంతి కానుకగా ఈ మూవీ రాబోతుందని చిత్రయూనిట్ ఇప్పటికే ప్రకటించింది. దీంతో ఈ మూవీ కోసం పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. భారీ తారాగాణంతో తెరకెక్కిన ఈ మూవీ సూపర్ హిట్ కొట్టడం ఖాయమని ఫ్యాన్స్ అంటున్నారు. ఈ నేపథ్యంలో ఈ మూవీకి సంబంధించిన ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ టాలీవుడ్ సర్కిల్స్ లో జోరుగా చక్కర్లు కొడుతోంది. ఈ సినిమాలో […]

Written By:
  • Sekhar Katiki
  • , Updated On : November 28, 2021 / 10:36 AM IST
    Follow us on

    Bheemla Nayak: పవర్ స్టార్ పవన్ కల్యాణ్ అప్ కమింగ్ మూవీ ‘బీమ్లా నాయక్’. సంక్రాంతి కానుకగా ఈ మూవీ రాబోతుందని చిత్రయూనిట్ ఇప్పటికే ప్రకటించింది. దీంతో ఈ మూవీ కోసం పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. భారీ తారాగాణంతో తెరకెక్కిన ఈ మూవీ సూపర్ హిట్ కొట్టడం ఖాయమని ఫ్యాన్స్ అంటున్నారు. ఈ నేపథ్యంలో ఈ మూవీకి సంబంధించిన ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ టాలీవుడ్ సర్కిల్స్ లో జోరుగా చక్కర్లు కొడుతోంది.

    ఈ సినిమాలో పవన్​, రానాల పై ప్రత్యేకంగా క్రియేట్​ చేసిన పవర్​ఫుల్​ టీజర్​కట్​ రిలీజ్​ డేట్​పై అభిమానుల ఆసక్తి నెలకొంది. ఈ క్రమంలోనే డిసెంబరు 14న ఈ మాస్​ టీజర్​కు ముహూర్తం ఖరారు చేసినట్లు తెలుస్తోంది. రానా దగ్గుబాటి బర్త్​డే స్పెషల్​గా ఈ సాలిడ్​ టీజర్​ను విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. అయితే దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. కాగా, ఈ సినిమాకు థమన్​ సంగీతం అందిస్తుండగా.. త్రివిక్రమ్​ మాటలకు, స్క్రీన్​ ప్లే అందిస్తున్నారు. సితార ఎంటర్​టైన్మెంట్స్ ఈ సినిమాకు నిర్మాణం వహిస్తున్న సంగతి తెలిసిందే.

    అయ్యప్పనుమ్ కోషియం’ మలయాళం మూవీని సీతార ఎంటటైన్మెంట్ తెలుగులో రీమేక్ చేస్తోంది. సూర్యదేవర నాగవంశీ ఈ సినిమా కోసం భారీగా ఖర్చు చేసినట్లు తెలుస్తోంది. ఈ మూవీలో రానా దగ్గుపాటి, మల్టి టాలెంటెడ్ హీరోయిన్ నిత్యామీనన్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇప్పటికే ఈమూవీ నుంచి విడులైన పోస్టర్స్, టీజర్స్, సాంగ్స్ అభిమానులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. కాగా సంక్రాంతి కానుకగా ఈ సినిమా ప్రేక్షకులను పలకరించేందుకు సిద్ధమైంది.