Bheemla Nayak: సంక్రాంతి బరి నుండి ‘భీమ్లా నాయక్​’ తప్పుకోనుందా!

Bheemla Nayak: పవర్​స్టార్​ పవన్​ కల్యాణ్​ హీరోగా సాగర్​ కె.చంద్ర దర్శకత్వంలో వస్తోన్న చిత్రం భీమ్లా నాయక్​. ఇటీవలే విడుదలైన సినిమా పాటలు, ప్రోమోలకు ప్రేక్షకుల నుంచి విపరీతమైన రెస్పాన్స్​ వచ్చింది. కాగా, దీపావళి కానుకగా విడుదల చేసిన వీడియో సినిమాపై భారీ అంచనాలు నెలకొల్పింది. ఇందులో, రానా విలన్​గా కనిపించనున్నారు. త్రివిక్రమ్​ మాటలు అందిస్తున్నారు. కాగా, సంక్రాంతి కానుకగా ఈ సినిమా విడుదల కానున్నట్లు గతంలో చిత్రబృందం ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే, ఇప్పుడు సంక్రాంతి […]

Written By: Raghava Rao Gara, Updated On : November 5, 2021 12:15 pm
Follow us on

Bheemla Nayak: పవర్​స్టార్​ పవన్​ కల్యాణ్​ హీరోగా సాగర్​ కె.చంద్ర దర్శకత్వంలో వస్తోన్న చిత్రం భీమ్లా నాయక్​. ఇటీవలే విడుదలైన సినిమా పాటలు, ప్రోమోలకు ప్రేక్షకుల నుంచి విపరీతమైన రెస్పాన్స్​ వచ్చింది. కాగా, దీపావళి కానుకగా విడుదల చేసిన వీడియో సినిమాపై భారీ అంచనాలు నెలకొల్పింది. ఇందులో, రానా విలన్​గా కనిపించనున్నారు. త్రివిక్రమ్​ మాటలు అందిస్తున్నారు. కాగా, సంక్రాంతి కానుకగా ఈ సినిమా విడుదల కానున్నట్లు గతంలో చిత్రబృందం ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే, ఇప్పుడు సంక్రాంతి రేసు నుంచి తప్పుకోనుందా అనే సందేహాలు నెలకొన్నాయి. ప్రస్తుతం ఈ విషయమే నెట్టింట చర్చనీయాంశమైంది. అందుకు కారణం, దీపావళి కానుకగా రిలీజ్​ చేసిన కొత్త పోస్టర్​లో విడుదల తేదీ లేకపోవడమే. మరి దీనిపై చిత్రబృందం క్లారిటీ ఇవ్వాల్సి ఉంది.

మరోవైపు, సూపర్​స్టార్​ మహేశ్​బాబు సర్కారు వారి పాట సినిమా కూడా సంక్రాంతి బరి నుంచి తప్పుకుంది. జనవరి 13న విడుదల కావాల్సిన ఈ సినిమా.. కొన్ని కారణాల వల్ల ఎప్రిల్​ 1న థియేటర్లలోకి తీసుకొస్తున్నట్లు తెలిపారు. ప్రస్తుతం సంక్రాంతి రేసులో ఆర్ఆర్ఆర్(జనవరి 7), భీమ్లా నాయక్(జనవరి 12), రాధేశ్యామ్(జనవరి 14) ఉన్నాయి. వీటి కోసం ప్రేక్షకులు ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. మరి ఎవరైనా రేసు నుంచి తప్పుకుంటారేమే వేచి చూడాలి.

మలయాళ హిట్ ‘అయ్యప్పనుమ్ కోశియమ్’కు రీమేక్​గా తెరకెక్కిన సినిమా ‘భీమ్లా నాయక్’. ఇందులో పవన్​ పోలీస్​గా కనిపించనున్నారు. నిత్యమేనన్, సంయుక్త కీలకపాత్రలు పోషిస్తున్నారు. తమన్ సంగీతమందిస్తున్నారు.