Bheemla Nayak Controversy: పవన్ కల్యాణ్ నటించిన సినిమా భీమ్లా నాయక్ విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. పవన్ కల్యాణ్ కు జోడీగా నిత్యా మీనన్, రానాకు జతగా సంయుక్త మీనన్ నటించారు. ఇందులో ఎవరికి వారు పోటీపడి నటించి తమ ప్రతిభకు పదును పెట్టారని తెలుస్తోంది. క్లైమాక్స్ లో సంయుక్త నటనకు అందరు ఫిదా అవుతున్నారు. పవన్ కల్యాణ్ నటనకు ప్రేక్షకులు ముగ్ధులవుతున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా భీమ్లా నాయక్ రికార్డుల మోత మోగిస్తోంది. ఇప్పటికే వంద కోట్లు దాటినట్లు లెక్కలు చెబుతున్నాయి.

సినిమా ఫిబ్రవరి 25న విడుదలైంది. టికెట్ల విషయంలో ఏపీ ప్రభుత్వం విధించిన నిబంధనల మేరకు వివాదం నెలకొన్నా తరువాత సమసిపోయింది. కానీ ప్రస్తుతం మరో వివాదం తెర మీదకు వచ్చింది. చిత్రంలో రానా ఓ సన్నివేశంలో చక్రంను తన్నడం ఉండటంతో తమ మనోభావాలు దెబ్బతిన్నాయని కుమ్మరి కులం వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
తమ బతుకు చక్రం కావడంతో దాన్ని తన్ని అవమానించారని ఆరోపణలు చేశారు. చిత్రం యూనిట్ పై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. దీంతో శాలివాహన కులస్తుల డిమాండ్ నేపథ్యంలో భీమ్లానాయక్ పై కూడా ఫిర్యాదు రావడంతో చిత్రం యూనిట్ సభ్యులు ఆలోచనలో పడ్డారు. చిన్న విషయంపై కూడా వివాదాలు రావడంపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఇందులో ఎవరి హస్తం ఉందోననే సంశయాలు వ్యక్తం చేయడం గమనార్హం.

ఏపీ కుమ్మరి, శాలివాహన కార్పొరేషన్ చైర్మన్ పురుషోత్తం గుంటూరు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. తమ మనోభావాలను దెబ్బ తీసే విధంగా ఉన్న సన్నివేశం తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు. దీంతో తాము పవిత్రంగా భావించే చక్రాన్ని తన్నడం సమంజసం కాదని ఆరోపిస్తున్నారు. చిత్రం యూనిట్ దీనిపై ఏం చర్యలు తీసుకుంటుందో వేచి చూడాల్సిందే.
[…] Social Updates: లేటెస్ట్ సోషల్ పోస్ట్స్ విషయానికి వస్తే.. తన ఫొటోల్ని షేర్ చేస్తూ “పురివిప్పిన నెమలి అందము… కురిసిన ఈ చినుకు అందము’ అనే పాటను గుర్తుచేస్తూ దివి తాజాగా లేటెస్ట్ ఫోటోలు పెట్టింది. […]
[…] Sagar K Chandra: పవర్ స్టార్ పవన్ పవన్ కళ్యాణ్ స్టార్ డమ్ ఏంటో బాక్సాఫీస్ వద్ద “భీమ్లా నాయక్” ద్వారా మరోసారి ఘనంగా రుజువు అయ్యింది. ప్రపంచ వ్యాప్తంగా కలెక్షన్స్ సునామి సృష్టిస్తూ.. పవన్ కళ్యాణ్ కొత్త రికార్డులను సెట్ చేస్తున్నారు. మొత్తానికి ఈ సినిమాతో తానూ బాక్సాఫీస్ కింగ్ ను అని పవన్ నిరూపించారు. మొత్తమ్మీద సక్సెస్ ఫుల్ టాక్ తో పవన్ కళ్యాణ్, రానాల ‘భీమ్లానాయక్’ మూవీ దూసుకెళ్తోంది. […]
[…] Trisha Marriage: సీనియర్ హీరోయిన్ త్రిషకి సినిమాల్లోకి రాకముందే పెళ్లి చేయాలనుకున్నారట వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్. కానీ అంతలో త్రిష సినిమాల్లోకి రావడం.. తక్కువ టైంలోనే స్టార్ హీరోయిన్ అయిపోవడం చకచకా జరిగిపోయాయి. అంతలో త్రిష కెరీర్ కూడా చాలా కాలం పాటు సాగింది. ఇంతలో ఆమె వయసు కూడా చాలా ముందుకు వచ్చేసింది. తెలియకుండానే త్రిష వయసు రెండేళ్లు తక్కువ నలభైకి వచ్చేసింది. […]
[…] Also Read: Bheemla Nayak Controversy: భీమ్లా నాయక్ కు తప్పని వ… […]
[…] Ramarao On Duty Teaser : రామారావ్ ఆన్ డ్యూటీలో ఉంటే నేరస్థుల గుండెల్లో గుబులే. ఇప్పటికే ‘క్రాక్’తో ప్రేక్షకులకు కిరాక్ పుట్టించిన రవితేజ.. ఇప్పుడు ‘రామారావు’గా వస్తున్నారు. సరికొత్త కథలు, కథాంశంలో అలరిస్తున్నారు. […]
[…] Bheemla Nayak Box Office Collections: పవన్ కళ్యాణ్ మేనియా ఆంధ్రాలోనే కాదు.. తెలంగాణలోనూ ఏమాత్రం తగ్గలేదని ‘భీమ్లానాయక్’ కలెక్షన్లు చూస్తే అర్థమవుతోంది. ఏపీ రాజకీయ నాయకుడైన పవన్ కు అక్కడి జనాలు కాదు.. తెలంగాణ వాసులు గొప్పగా ఆదరించేస్తున్నారు. పవన్ కళ్యాణ్ భీమ్లా నాయక్ సినిమా తెలంగాణలోనూ హిట్ టాక్ ను దక్కించుకొని భారీ వసూళ్లను రాబడుతోంది. వంద కోట్లకు పైగా ఇప్పటికే వసూళ్లు రాబట్టిన ఈ సినిమా వారాంతంలో కూడా మంచి వసూళ్లను దక్కించుకుంది. […]