Bhartha Mahasayulaku Wignyapthi 1st Week Collections: మాస్ మహారాజ రవితేజ(Mass Maharaja Raviteja) ఈమధ్య కాలం లో చేసిన సినిమాల్లో ఆడియన్స్ నుండి కాస్త పాజిటివ్ టాక్ ని తెచ్చుకున్న చిత్రం ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి'(Bharta Mahasayulaku wignapti). కిషోర్ తిరుమల దర్శకత్వం లో తెరకెక్కిన ఈ సినిమా సంక్రాంతి కానుకగా విడుదలైంది. చాలా కాలం తర్వాత రవితేజ సినిమాకు పాజిటివ్ టాక్ వచ్చింది, ఇక జనాలు ఈ చిత్రాన్ని పండక్కి ఎక్కడికో తీసుకెళ్లారని అంతా ఆశించారు. కానీ రవితేజ బ్యాడ్ లక్, ఈ సినిమా టాక్ జనాల్లోకి బలంగా వెళ్లలేకపోయింది. ఈ చిత్రం కంటే నవీన్ పోలిశెట్టి, శర్వానంద్ సినిమాలకు ఇంకా మంచి పాజిటివ్ టాక్ రావడంతో ఈ చిత్రాన్ని ఎవ్వరూ పట్టించుకోలేదు. ఫలితంగా హిట్ టాక్ వచ్చినప్పటికీ డిజాస్టర్ గానే మిగిలిపోయింది ఈ చిత్రం. వారం రోజుల థియేట్రికల్ రన్ ని పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రాంతాల వారీగా ఎంత వసూళ్లను రాబట్టింది అనేది ఇప్పుడు వివరంగా చూద్దాం.
7 వ రోజున ఈ చిత్రానికి ప్రపంచవ్యాప్తంగా 26 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు మాత్రమే వచ్చిందట. దీనిని బట్టీ చూస్తే జనవరి 26 వరకు ఎంత వసూళ్లు వస్తే, అంతే ఈ సినిమా ఫైనల్ వసూళ్లు. ఆ తర్వాత షేర్స్ వచ్చే సూచనలు కనిపించడం లేదు. ప్రస్తుతం ఉన్న ట్రెండ్ ప్రకారం చూస్తే ఈ సినిమా ఫైనల్ క్లోజింగ్ కలెక్షన్స్ 13 కోట్ల రూపాయిల వరకు ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. వారం రోజులకు గానూ ప్రపంచవ్యాప్తంగా కేవలం 10 కోట్ల షేర్ ని మాత్రమే రాబట్టింది. ప్రాంతాల వారీగా వచ్చిన వసూళ్లను ఒకసారి చూస్తే, నైజాం ప్రాంతం నుండి 2 కోట్ల 61 లక్షల రూపాయిలను రాబట్టిన ఈ సినిమా, సీడెడ్ ప్రాంతం నుండి 67 లక్షలు, ఆంధ్ర ప్రదేశ్ ప్రాంతం నుండి 5 కోట్ల రూపాయిలను రాబట్టింది. ఓవరాల్ గా ఈ చిత్రానికి తెలుగు రాష్ట్రాల నుండి మొదటి వారంలో 8 కోట్ల 33 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు, 13 కోట్ల 85 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి.
అదే విధంగా కర్ణాటక + రెస్ట్ ఆఫ్ ఇండియా ప్రాంతాల నుండి 60 లక్షల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టిన ఈ సినిమాకు, ఓవర్సీస్ నుండి కోటి 7 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. ఓవరాల్ గా మొదటి వారం పది కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు, 17 కోట్ల 45 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. విడుదలకు ముందు ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ ఈ చిత్రానికి 20 కోట్ల రూపాయిల వరకు జరిగింది. అంటే బ్రేక్ ఈవెన్ మార్కుని అందుకోవడానికి ఇంకో పది కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు రావాలి. అది ఇక దాదాపుగా అసాధ్యం అనే చెప్పాలి.
