Bhartha Mahasayulaku Wignyapthi 1st Day Collections: మాస్ మహారాజ రవితేజ(Mass Maharaja Raviteja) నటించిన లేటెస్ట్ చిత్రం ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి'(Bharta Mahasayulaku Vignapti) నిన్న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజై పాజిటివ్ రెస్పాన్స్ ని సొంతం చేసుకుంది. రవితేజ గత చిత్రాలతో పోలిస్తే ఈ చిత్రం చాలా బెటర్ అని, కామెడీ చాలా బాగా వర్కౌట్ అయ్యిందని అంటున్నారు. టాక్ అయితే వచ్చింది కానీ, ఈ సినిమాకు ఓపెనింగ్స్ మాత్రం రాలేదు. రవిటైజ్ గత 7 చిత్రాలు కమర్షియల్ గా డిజాస్టర్ ఫ్లాప్ అవ్వడం వల్ల, వాటి తాలూకు ప్రభావం ఈ సినిమా పై చాలా బాగా పడింది. దీంతో ఎంతటి ఫ్లాప్ సినిమాకు అయినా, టాక్ తో సంబంధం లేకుండా కనీసం నాలుగు కోట్ల రూపాయిల షేర్ వసూళ్లను పెట్టే సత్తా ఉన్న రవితేజ ఇప్పుడు కేవలం ప్రపంచవ్యాప్తంగా 4 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లను రాబట్టినట్టు చెప్తున్నారు ట్రేడ్ విశ్లేషకులు.
మొదటి రోజు బుక్ మై షో యాప్ లో ఈ చిత్రానికి 56 వేలకు పైగా టికెట్స్ అమ్ముడుపోయాయి, ఇది డీసెంట్ అనే చెప్పొచ్చు. ఆంధ్ర ప్రదేశ్ లో పలు ప్రాంతాల్లో ఈ సినిమా బాగా పికప్ అవ్వడం తో ఈ మాత్రం టికెట్స్ అమ్ముడుపోయాయి. ఓవరాల్ గా తెలుగు స్టేట్స్ నుండి ఈ చిత్రానికి రెండు కోట్ల 20 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. అయితే చిరంజీవి సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద వీరంగం ఆడుతుండడం తో, ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రానికి థియేటర్స్, షోస్ కరువు అయ్యాయి. ఆ కారణం చేత కూడా వసూళ్లు తగ్గిందని అంటున్నారు. కానీ ఓవరాల్ గా ఉన్నంత లో కాస్త బెటర్ గానే చేసిందని అంటున్నారు. ప్రభాస్ రాజా సాబ్ చిత్రానికంటే ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ కి ఎక్కువ డిమాండ్ ఉంది. కాబట్టి బ్రేక్ ఈవెన్ మార్కుని చాలా తేలికగా అందుకునే అవకాశాలు ఉన్నాయి.
రవితేజ కి చాలా కాలం తర్వాత ఒక డీసెంట్ సూపర్ హిట్ చిత్రం గా నిలవొచ్చు. విడుదలకు ముందు ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ 12 కోట్ల రూపాయలకు జరిగింది. మొదటి రోజు ప్రపంచవ్యాప్తంగా రెండు కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. ఫుల్ లో 12 కోట్లను అందుకోవడం అనేది ఇప్పుడు పెద్ద కష్టమైన విషయం కాదు, ఆదివారం లోపు బ్రేక్ ఈవెన్ మార్కుని దాటి క్లీన్ సూపర్ హిట్ గా నిలిచే అవకాశాలు ఉన్నాయి. మొత్తానికి రవితేజ తన రూట్ ని మార్చి అప్డేట్ వెర్షన్ తో యూత్ ఆడియన్స్ ని అలరించే ప్రయత్నం చేస్తున్నాడు. మరి ఈ ప్రయత్నం లో రాబోయే రోజుల్లో ఆయన ఏ మేరకు సక్సెస్ ని అనుకుంటాడో చూడాలి.