Homeఎంటర్టైన్మెంట్సమంత సిరీస్ పై క్లాస్ డైరెక్టర్ ఫైర్ !

సమంత సిరీస్ పై క్లాస్ డైరెక్టర్ ఫైర్ !

The Family Man 2‘ది ప్యామిలీమెన్‌ 2’ వెబ్‌ సిరీస్‌ పై తమిళనాడులో నిరసనల సెగలు ఇంకా రగులుతూనే ఉన్నాయి. ముఖ్యంగా అక్కినేని సమంత శ్రీలంకకు చెందిన తమిళ యువతి పాత్రలో నటించడం, అలాగే ఆమె పాత్ర నెగటివ్‌ గా చూపించారనే ప్రచారం జరగడంతో మొత్తానికి ఈ వెబ్‌ సిరీస్‌ పై తమిళనాట అరవ ప్రేక్షకులతో పాటు అరవ సినిమా ప్రముఖులు కూడా విమర్శలు చేస్తున్నారు.

ఒకపక్క విమర్శలు వెల్లువెత్తుతున్నా.. సమంతతో పాటు ఈ సిరీస్ మేకర్స్ కూడా సైలెంట్ గానే ఉన్నారు. దాంతో తమిళనాడులో ఈ వెబ్‌ సిరీస్‌ ను నిషేధించాలంటూ ఇప్పటికే అక్కడి రాష్ట్ర ప్రభుత్వంతో పాటు పలు రాజకీయ పార్టీలు కూడా కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశాయి. ఒక వెబ్ సిరీస్ పై ఒక రాష్ట్ర ప్రభుత్వం ఈ విధంగా రియాక్ట్ అవ్వడం అంటే నిజంగా షాకింగ్ విషయమే.

తాజాగా ఈ వెబ్ సిరీస్ పై సీనియర్‌ దర్శకుడు భారతీరాజా ఆగ్రహం వ్యక్తం చేస్తూ తనదైన శైలిలో ఓ ప్రకటన కూడా పోస్ట్ చేశాడు. ‘యావత్తు తమిళ జాతికి వ్యతిరేకంగా రూపొందిన ‘ది ఫ్యామిలీ మెన్‌ 2’ సిరీస్‌ ను ప్రసారం చేయవద్దని తమిళ సమాజం ఎన్నోసార్లు విజ్ఞప్తి చేస్తున్నప్పటికీ.. కేంద్ర ప్రభుత్వం మాత్రం ఈ వెబ్ సిరీస్ పై నిషేధం విధించకపోవడం నిజంగా ఎంతో బాధాకరమని భారతీరాజా అన్నారు.

అలాగే ఆయన ఈ వెబ్ సిరీస్ ను తమిళ ద్రోహులు రూపొందించిన వెబ్‌ సిరీస్‌ గా పేర్కొంటూ.. ఇప్పటికైనా కేంద్రం స్పందించి ఈ వెబ్ సిరీస్ పై నిషేధం విధించాలని విజ్ఞప్తి చేశారు. పనిలో పనిగా ఈ క్లాస్ డైరెక్టర్ ఓ మాస్ డైలాగ్ కూడా చెప్పారు. ఈ సిరీస్ ప్రసారాన్ని ఆపకుంటే అమెజాన్‌ సంస్థ పై పోరాటం చేయడానికి కూడా వెనుకాడబోమంటూ యాక్షన్ హీరో రేంజ్ లో ఓ భారీ హెచ్చరికను కూడా జారీ చేశారు.

admin
adminhttps://oktelugu.com/
Editor, He is Working from Past 3 Years in this Organization, He is the incharge of News content and Looks after the overall Content Management.
RELATED ARTICLES

Most Popular