Kalki Movie: కల్కి సినిమా రేపు రిలీజ్ అవుతున్న సందర్భంగా ఈరోజు నుంచే కొన్ని చోట్లలో ప్రీమియర్స్ వేయడానికి సన్నాహాలైతే చేస్తున్నారు. ఇక ఇదిలా ఉంటే ఈ సినిమాతో ప్రభాస్ తనదైన రీతిలో సక్సెస్ సాధించాలని చూస్తున్నాడు. ఇక ఈ సందర్భంగా కల్కి సినిమా మీద చాలా వార్తలైతే బయటికి వస్తున్నాయి. ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం అశ్వద్ధామ క్యారెక్టర్ ను పోషిస్తున్న అమితాబచ్చన్ అలాగే భైరవ క్యారెక్టర్ ను చేస్తున్న ప్రభాస్ ల మధ్య ఒక భారీ ఫైట్ అయితే జరగబోతుందట.
వీళ్ళ పోరాటంలో ఇద్దరు రక్తం ఏరులై పారేలా కొట్టుకోబోతున్నట్టుగా కూడా తెలుస్తుంది. ఇక మొత్తానికైతే దీపిక పదుకొనే కి పుట్టే కల్కి ఒక గొప్ప కార్యం చేయబోతున్నాడు కాబట్టి అతన్ని కాపాడడం కోసమే వీళ్ళిద్దరూ ఒకరికొకరు కొట్టుకోబోతున్నట్టుగా కూడా వార్తలైతే వస్తున్నాయి. మరి వీళ్ళలో ఎవరు పై చేయి సాధించారు అనే విషయం పక్కన పెడితే ఈ రెండు క్యారెక్టర్లు మంచివా చెడ్డవా ఎవరికీ ఎవరు హెల్ప్ చేయడం కోసం ఒకరిని ఒకరు కొట్టుకుంటున్నారు అనే సందేహాలైతే కలుగుతున్నాయి.
Also Read: Kalki 2898 AD USA Review: ప్రభాస్ ‘కల్కి 2898 ఏడి’ మూవీ యూఎస్ఏ రివ్యూ…
ఇక ఇప్పుడు అందుతున్న సమాచారం ప్రకారం అశ్వద్ధామ క్యారెక్టర్ మొదటినుంచి పాజిటివ్ గా ఉన్నప్పటికీ మధ్యలో నెగిటివ్ గా మారే అవకాశాలైతే ఉన్నట్టుగా తెలుస్తుంది. అందువల్లే బైరవ అశ్వద్ధామకు మధ్య విపరీతమైన పోటీ ఉండబోతున్నట్టుగా కూడా తెలుస్తుంది. నిజానికి పురాణాల ప్రకారం చూసుకుంటే ‘అశ్వద్ధామ ‘ చాలా బలవంతుడు అతన్ని గెలవడం అంటే అంత ఈజీ కాదు.
Also Read: Shankar Bharateeyudu 2: శంకర్ భారతీయుడు 2 కోసం అనిరుధ్ ను తీసుకొని తప్పు చేశాడా..?
ఇక ‘భైరవ ‘ అంటే శంకరుడి అంశ నుంచి పుట్టిన క్యారెక్టర్ కాబట్టి అలాంటి వ్యక్తికి అశ్వద్ధామను పడగొట్టడం పెద్ద విషయమైతే కాదు. మరి వీళ్ళ మధ్య జరిగే ఆ బీకర యుద్ధాన్ని చూడడానికి ప్రేక్షకులు సిద్ధమవుతున్నారు. ఎంటైర్ ఈ సినిమాలో ఈ ఫైట్ కూడా ఒక అద్భుతాన్ని సృష్టించబోతున్నట్టుగా తెలుస్తుంది… ఇక ఇందులో చేసిన ప్రతి ఒక్కరి పాత్ర ను కూడా చాలా బాగా డిజైన్ చేసినట్టుగా తెలుస్తుంది… చూడాలి మరి ఈ సినిమా ఎలాంటి సక్సెస్ ను సాధిస్తుంది అనేది…