Bhagyashri Borse: ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన అతి తక్కువ సమయంలోనే యూత్ ఆడియన్స్ లో మంచి క్రేజ్ ని సంపాదించుకొని స్టార్ హీరోయిన్ రేంజ్ కి ఎదగడం అనేది సాధారణమైన విషయం కాదు. ఈమధ్య కాలం లో ఇలాంటి సంఘటన శ్రీలీల విషయం లో జరిగింది , ఇప్పుడు భాగ్యశ్రీ భోర్సే విషయం లో కూడా జరగబోతుంది. ఈమె ‘మిస్టర్ బచ్చన్’ చిత్రం తో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమా కమర్షియల్ గా పెద్ద డిజాస్టర్ ఫ్లాప్ అయ్యింది. అయినప్పటికీ కూడా యూత్ ఆడియన్స్ దృష్టిని ఈమె ప్రత్యేకంగా ఆకర్షించింది. అందం తో పాటు , నటన కూడా అద్భుతంగా ఉందని , డ్యాన్స్ లో గ్రేస్ ఉందని టాలీవుడ్ కి దొరికిన ఆణిముత్యం లాంటి హీరోయిన్ భాగ్యశ్రీ అంటూ పొగడ్తలతో ముంచెత్తారు. కేవలం ఒక్క హిట్ వస్తే చాలు ఎవ్వరూ ఊహించనంత రేంజ్ కి వెళ్ళిపోతుందని కితాబిచ్చారు.
‘మిస్టర్ బచ్చన్’ తర్వాత ఈమె ‘కింగ్డమ్’, ‘ఆంధ్రా కింగ్ తాలూకా’, ‘కాంత’ వంటి చిత్రాల్లో నటించింది. అన్నీ డిజాస్టర్ ఫ్లాప్స్ అయ్యాయి. ఇప్పుడు లేటెస్ట్ గా ఆమె అక్కినేని అఖిల్ తో కలిసి ‘లెనిన్’ అనే చిత్రం లో న్బటించింది. ఈ చిత్రం అఖిల్ కి ఎంత ముఖ్యమైన సినేమానా , భాగ్యశ్రీ కి కూడా అంతే ముఖ్యమైన సినిమా. ముందుగా ఈ చిత్రాన్ని జూన్ 25 న విడుదల చెయ్యాలని అనుకున్నారు. కానీ పోస్ట్ ప్రొడక్షన్ కి మరింత సమయం కోరారు. దీంతో ఈ చిత్రాన్ని జులై 10 కి వాయిదా వేశారు. ఈ సందర్భంగా అక్కినేని అఖిల్ , భాగ్యశ్రీ ప్రొమోషన్స్ కూడా మొదలు పెట్టేసారు. ప్రముఖ యాంకర్ సుమతో కలిసి వీళ్లిద్దరు ఒక కుకింగ్ ప్రోగ్రాం లో పాల్గొని ఆమెతో చేసిన చిట్ చాట్ ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యింది.
అయితే ‘లెనిన్’ టీజర్ లో భాగ్యశ్రీ సీనియర్ ఎన్టీఆర్ ‘దాన వీర సూర కర్ణ’ చిత్రం లోని డైలాగ్ కొడుతోంది గుర్తుందా ?, ఆ డైలాగ్ ని ఈ స్పెషల్ ఇంటర్వ్యూ లో మరోసారి గుక్క తిప్పుకోకుండా చెప్పింది భాగ్యశ్రీ. మధ్యలో కొన్ని తప్పులు ఉన్నాయి , కానీ ఏ మాత్రం తడబడకుండా, ఆమె ఈ డైలాగ్ ని చెప్పే ప్రయత్నం చేయడం నిజంగా గ్రేట్ అనే చెప్పాలి. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యింది. కుర్రాళ్ళు భాగ్యశ్రీ ముద్దులొలికే మాటలకు ఫిదా అయిపోయారు. తెలుగు రాకపోయినా నేర్చుకొని , ఈ డైలాగ్ ని కొట్టింది , రాబోయే రోజుల్లో నూటికి నూరు శాతం పర్ఫెక్షన్ తో ఈ డైలాగ్ మరోసారి కొడుతోంది అంటూ ప్రశంసిస్తున్నారు.
అన్న గారి డైలాగును అవలీలగా చెప్పేసిన భాగ్య శ్రీ దాన వీర శుర కర్ణ..
భలే ముద్దుగా చెప్పింది కదా…!! ❤️#LENIN#BhagyasriBorse pic.twitter.com/22ylwizreX— Kakinada Talkies (@Kkdtalkies) June 20, 2026
