Bhagavanth Kesari Collection: 12వ రోజు బాలయ్యకు షాక్… భారీగా పడిపోయిన భగవంత్ కేసరి వసూళ్లు!

6వ రోజు నుండి కొంచెం నెమ్మదించింది. అయితే నిలకడగా వసూళ్లు కొనసాగగా బ్రేక్ ఈవెన్ కి చేరువైంది. 12వ రోజు మాత్రం భగవంత్ కేసరి వసూళ్లు భారీగా పడిపోయాయి. ఏపీ/తెలంగాణాలలో భగవంత్ కేసరి సోమవారం కేవలం రూ. 85 లక్షల షేర్ రాబట్టినట్లు సమాచారం.

Written By: NARESH, Updated On : October 31, 2023 9:30 am

Bhagavanth Kesari Collection

Follow us on

Bhagavanth Kesari Collection: బాలకృష్ణ లేటెస్ట్ మూవీ భగవంత్ కేసరి. హిట్ కి చేరువలో ఉన్న ఈ మూవీ వసూళ్లు 12వ రోజు భారీగా డ్రాప్ అయినట్లు తెలుస్తుంది. దసరా బరిలో ముగ్గురు బడా హీరోలు దిగారు. అక్టోబర్ 19న భగవంత్ కేసరి, లియో చిత్రాలు విడుదలయ్యాయి. లియో నెగిటివ్ టాక్ తెచ్చుకోగా… భగవంత్ కేసరి పాజిటివ్ టాక్ అందుకుంది. ఆ నెక్స్ట్ డే టైగర్ నాగేశ్వరరావు గా రవితేజ థియేటర్స్ లోకి వచ్చాడు. ఈ చిత్రం కూడా నెగిటివ్ టాక్ తెచ్చుకుంది. ఈ పరిణామం బాలయ్యకు ప్లస్ అయ్యింది. పండగ రోజుల్లో భగవంత్ కేసరి వసూళ్లు సాలిడ్ గా ఉన్నాయి.

6వ రోజు నుండి కొంచెం నెమ్మదించింది. అయితే నిలకడగా వసూళ్లు కొనసాగగా బ్రేక్ ఈవెన్ కి చేరువైంది. 12వ రోజు మాత్రం భగవంత్ కేసరి వసూళ్లు భారీగా పడిపోయాయి. ఏపీ/తెలంగాణాలలో భగవంత్ కేసరి సోమవారం కేవలం రూ. 85 లక్షల షేర్ రాబట్టినట్లు సమాచారం. వరల్డ్ వైడ్ రూ. 1.05 కోట్లు షేర్ వసూలు చేసినట్లు అంచనా వేస్తున్నారు. దీంతో కలిపి 12 రోజులకు భగవంత్ కేసరి వరల్డ్ వైడ్ రూ. 64 కోట్ల షేర్ వసూలు చేసినట్లు నిర్మాతలు ప్రకటిస్తున్నారు.

భగవంత్ కేసరి ప్రీ రిలీజ్ బిజినెస్ చూస్తే… నైజాం రూ.14.5 కోట్లు, సీడెడ్ రూ. 13 కోట్లు, ఉత్తరాంధ్ర రూ. 8 కోట్లు, ఈస్ట్ అండ్ వెస్ట్ రూ. 9 కోట్లు, గుంటూరు రూ. 6 కోట్లు, కృష్ణ రూ. 4 కోట్లు, నెల్లూరు రూ. 2.60 కోట్లు, రెస్టాఫ్ ఇండియా-కర్ణాటక రూ. 4.25 కోట్లు, ఓవర్సీస్ రూ. 6 కోట్లకు అమ్మారు. మొత్తంగా వరల్డ్ వైడ్ రూ. 67.35 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. అంటే దాదాపు రూ. 69 కోట్లు బ్రేక్ ఈవెన్ టార్గెట్ గా ఉంది. రూ. 70 కోట్లు షేర్ వస్తే కానీ హిట్ స్టేటస్ అందుకోదు.

ఆ లెక్కన భగవంత్ కేసరి మరో రూ. 6 కోట్లు వసూలు చేస్తే కానీ… హిట్ కాదన్నమాట. అయితే కొన్ని ఏరియాల్లో భగవంత్ కేసరి బ్రేక్ ఈవెన్ అయ్యిందంటున్నారు. భగవంత్ కేసరి చిత్రానికి అనిల్ రావిపూడి దర్శకుడు. శ్రీలీల కీలక రోల్ చేసింది. బాలయ్యకు జంటగా కాజల్ నటించింది. థమన్ సంగీతం అందించాడు.