Best Supporting Actors Of Tollywood: ఏదేని చిత్రంలో హీరో హీరోయిన్స్ పర్ఫార్మెన్స్ బాగుంటేనే సరిపోదు. కథలో ఉన్న పాత్రలు బాగుండాలి. కథను సపోర్ట్ చేస్తూ కథానాయకుడి పాత్రను ఎలివేట్ చేసే సపోర్టింగ్ రోల్స్ పార్ట్ కీలకం. అలా సపోర్టింగ్ రోల్స్ బాగుంటేనే పిక్చర్ బాగుంటుందని సినీ పరిశీలకులు చెప్తున్నారు. ఈ ఏడాది విడుదలైన సినిమాల్లో సపోర్టింగ్ క్యారెక్టర్స్ ప్లే చేసిన వారెవరెవరు, అందులో వారి పాత్రలు ఎలా ఉన్నాయి అనే విషయాలపై ఇంట్రెస్టింగ్ స్టోరి..

సపోర్టింగ్ రోల్స్ ద్వారా సినిమా, స్టోరి ఎలివేషన్ ఈజీ అయిపోతుందని కొందరు డైరెక్టర్స్ అభిప్రాయపడుతున్నారు. 2021లో వచ్చిన సినిమాల్లో వరలక్ష్మీ శరత్ కుమార్ సపోర్టింగ్ రోల్స్ ప్లే చేసింది. అల్లరి నరేశ్ ‘నాంది’ సినిమాలో వరలక్ష్మీ శరత్ కుమార్ లాయర్ రోల్ ప్లే చేసింది. ఇదే క్రమంలో మాస్ మహారాజా రవితేజ ‘క్రాక్’ ఫిల్మ్‌లోనూ వరలక్ష్మీ కీలక పాత్ర పోషించింది. అలా ఈ ఏడాది పలు చిత్రాల్లో కీలకమైన సపోర్టింగ్ రోల్స్ ప్లే చేసిన యాక్టర్స్ గురించి తెలుసుకుందాం.
పాన్ ఇండియా మూవీ ‘పుష్ప’లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పాత్ర తర్వాత అందరినీ ఆకట్టుకుంటున్న పాత్రల్లో ఒకటి ‘కేశవ’ పాత్ర. ఈ పాత్రలో ఒదిగిపోయాడు జగదీశ్ బండారి. ‘పలాస’ చిత్రంలో నటించిన జగదీశ్ బండారి .. ప్రజెంట్ ‘పుష్ప’ఫిల్మ్ రిలీజ్‌తో స్టార్ అయిపోయాడని చెప్పొచ్చు. ‘పుష్ప 2’లోనూ జగదీశ్ బండారి పాత్ర ‘కేశవ’గా వెరీ ఇంట్రెస్టింగ్‌గా ఉండబోతున్నదని సమాచారం.

మలినేని గోపీచంద్, మాస్ మహారాజ రవితేజ కాంబినేషన్‌లో వచ్చిన ‘క్రాక్’ సినిమాలో జయమ్మ రోల్ స్పెషల్ అట్రాక్షన్‌గా నిలచింది. ఈ పిక్చర్‌తో వరలక్ష్మీ శరత్ కుమార్ పేరు తెలుగులో ‘జయమ్మ’గా మారింది. విలక్షణ నటుడు ప్రకాశ్ రాజ్ నటన గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. 20 ఏళ్ల కిందట వచ్చిన ‘బద్రి’ సినిమాలో పవన్ కల్యాణ్, ప్రకాశ్ రాజ్ కలిసి నటించారు. ఈ ఏడాది విడుదలైన ‘వకీల్ సాబ్’ చిత్రంలోనూ వీరిరువురు కలిసి నటించారు.
Also Read: ఆర్ఆర్ఆర్ విడుదల వాయిదా?… స్వయంగా క్లారిటీ ఇచ్చిన రాజమౌళి
స్టైలిష్‌గా మాత్రమే కాకుండా ఊరమాస్ విలన్‌గా పలు సినిమాల్లో నటిస్తున్న బిజియెస్ట్ యాక్టర్ జగపతిబాబు ‘అఖండ’ చిత్రంలో‘అఘోర’గా కీలక పాత్ర పోషించారు. ఈ సినిమా కథను మలుపు తిప్పే సపోర్టింగ్ రోల్‌ను జగపతిబాబు ప్లే చేశారు. మెగా హీరో సాయిధరమ్ తేజ్ ‘రిపబ్లిక్’ సినిమాలో బెస్ట్ సపోర్టింగ్ రోల్‌ను సీనియర్ హీరోయిన్ రమ్యకృష్ణ ప్లే చేశారు. సినిమాకు మోస్ట్ పవర్ ఫుల్ ప్లస్ కీ రోల్ ఇది. విక్టరీ వెంకటేశ్ ‘నారప్ప’ మూవీలో ‘బసవయ్య’ పాత్రకు ప్రాణం పోశారు నటుడు రాజీవ్ కనకాల. కామెడీ ఎంటర్ టైనర్‘జాతిరత్నాలు’లో కీలకమైన పిల్లర్స్‌గా నిలిచారు రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శి.
‘మోసగాళ్లు’ మూవీలో మంచు విష్ణుకు సిస్టర్‌గా సపోర్టింగ్ రోల్ ప్లే చేసింది బ్యూటిఫుల్ హీరోయిన్ కాజల్ అగర్వాల్.
Also Read: చరణ్ ని అలా ఎలా మార్చేశావ్ ఎన్టీఆర్?